Disha app ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా వాడాలి, గైడ్ మీకోసం.

By Gizbot Bureau
|

మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోచ్చిన దిశ యాప్‌ విజయవంతం అయింది. ఈ యాప్ ద్వారా నమోదైన తొలి కేసును పోలీసులు విజయవంతంగా చేధించారు. ఈ యాప్ ఇప్పుడు రికార్డు దిశగా దూసుకుపోతోంది. ఆపదలో ఉన్న మహిళల కోసం రూపొం‍దించిన ఈ యాప్‌ను కేవలం నాలుగు రోజుల్లోనే 50 వేల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇటీవల ఓ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ దిశ యాప్‌ ద్వారా సాయం కోరగా.. కేవలం ఆరు నిమిషాల్లోనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ఆమెను వేధిస్తున్న వ్యక్తిని అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీన్ని ఎలా డై్లోడ్ చేసుకోవాలి, ఎలా వాడాలో ఓ సారి చూద్దాం.

దిశ యాప్‌ డౌన్‌లోడ్‌

దిశ యాప్‌ డౌన్‌లోడ్‌

మీ మొబైల్ నుంచి ఇంటర్నెట్‌ సాయంతో గూగుల్ ప్లే స్టోర్ లో కెళ్లి దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, ఇన్‌స్టాల్‌ చేసుకుంటే చాలు. లింక్ కోసం క్లిక్ చేయండి.

ఇంటర్నెట్‌ ఉన్నా లేకున్నా ఫోన్‌ ద్వారా ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చు. ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కడం ద్వారా గానీ, ఫోన్‌ను గట్టిగా అటూఇటూ ఉపడం ద్వారా గానీ ఆపదలో ఉన్న మహిళలు దిశ కాల్‌ సెంటర్‌కు సమాచారం ఇవ్వవచ్చు. ఆ తర్వాత ప్రమాదంలో ఉన్న మహిళలను కాపాడేందుకు దిశ కంట్రోల్‌ రూమ్‌ నుంచి పోలీసులకు ఆటోమేటిక్‌గా సమాచారం అందుతుంది.

లింక్ ఇదే : https://play.google.com/store/apps/details?id=com.likhatech.disha

ఎస్‌వోఎస్‌ బటన్ 

ఎస్‌వోఎస్‌ బటన్ 

ఈ యాప్‌ను ఓపెన్‌ చేసి అత్యవసర సహాయం(ఎస్‌వోఎస్‌) బటన్‌ నొక్కితే చాలు.. వారి ఫోన్‌ నంబర్, చిరునామా, వారున్న ప్రదేశం వివరాలు దిశ కంట్రోల్‌ రూమ్‌కు చేరతాయి. ఎస్‌వోఎస్‌ బటన్‌ ప్రెస్‌ చేసే సమయం లేనప్పుడు చేతిలోని ఫోన్‌ను గట్టిగా అటూఇటూ ఊపితే చాలు.. దిశ కమాండ్‌ రూమ్‌కు సమాచారం చేరుతుంది. 

ఆటోమేటిక్‌గా కాల్‌

ఆటోమేటిక్‌గా కాల్‌

ఎస్‌వోఎస్‌ బటన్‌ను నొక్కితే వాయిస్‌తోపాటు పది సెకన్ల వీడియోను కూడా రికార్డు చేసి కమాండ్‌ రూమ్‌కు పంపించే వీలు ఉంది. ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కగానే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం వెళ్లి.. అక్కడి నుంచి వెంటనే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు, పోలీస్‌ రక్షక్‌ వాహనాలకు ఆటోమేటిక్‌గా కాల్‌ వెళ్తుంది. ప్రమాదంలో ఉన్నవారిని చేరుకోవడానికి జీపీఎస్‌ అమర్చిన పోలీస్‌ రక్షక్‌ వాహనాల్లోని ‘మొబైల్‌ డేటా టెర్మినల్‌' సహాయపడుతుంది.

ట్రాక్‌ మై ట్రావెల్‌

ట్రాక్‌ మై ట్రావెల్‌

అలాగే ఆపదలో ఉన్నప్పుడు సమాచారాన్ని పోలీసులతోపాటు తక్షణం కుటుంబ సభ్యులు/మిత్రులకు పంపేలా ఐదు ఫోన్‌ నంబర్ల (ఎమర్జెన్సీ కాల్స్‌)ను దిశ యాప్‌లో నమోదు చేసుకోవచ్చు. దిశ యాప్‌లోని ‘ట్రాక్‌ మై ట్రావెల్‌' ఆప్షన్‌ వినియోగిస్తే వారు వెళ్లాల్సిన ప్రాంతాన్ని కూడా నమోదు చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా వారు ప్రయాణిస్తున్న వాహనం వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా దారి మళ్లితే ఆ సమాచారాన్ని కంట్రోల్‌ రూమ్, బంధుమిత్రులకు పంపి అప్రమత్తం చేయొచ్చు. 

డయల్‌ 100, డయల్‌ 112

డయల్‌ 100, డయల్‌ 112

ఈ యాప్‌లోనే డయల్‌ 100, డయల్‌ 112 నంబర్లను కూడా పొందుపర్చారు. డయల్‌ 100 అయితే నేరుగా కాల్‌ చేసి విషయం చెప్పాలి. డయల్‌ 112 అయితే మిస్డ్‌ కాల్‌ ఇచ్చినా సరిపోతుంది. దిశ యాప్‌లో పోలీసు అధికారుల ఫోన్‌ నంబర్లు, సమీపంలోని పోలీస్‌స్టేషన్‌ వివరాలు తెలుసుకునేందుకు ఆప్షన్లు ఉంటాయి. వైద్య సేవలు అవసరమైనప్పుడు యాప్‌ ద్వారా దగ్గర్లోని ఆస్పత్రులు, బ్లడ్‌ బ్యాంకులు, ఫార్మసీల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Disha app: How to download and use it for emergency

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X