Home
News

DishNXT HD STB కొనడానికి సరైన సమయం!! ఉచితంగా HD ఛానెల్ ప్యాక్‌ కూడా

భారతదేశపు రెండవ అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్ అయిన డిష్ టివి తన యొక్క వినియోగదారులకు వినోద అవసరాలను నెరవేర్చడం కోసం అనేక మార్గాలను అందిస్తుంది. ఇందులో భాగంగా ఆపరేటర్ వారి వినియోగదారులకు హై-డెఫినిషన్ (HD) నాణ్యతతో కొన్ని ఆసక్తికరమైన మరియు ఆర్థిక ఛానెల్ ప్యాక్‌లను అందిస్తుంది. HD నాణ్యతలో కంటెంట్‌ను చూడటానికి వినియోగదారులు DishNXT HD సెట్-టాప్ బాక్స్ (STB) ను ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఇది చాలా తక్కువ ధర వద్ద లభించడమే కాకుండా ఉచిత ఛానెల్ ప్యాక్‌ను కూడా అందిస్తుంది. DishNXT HD STB గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

DishNXT HD STB డిస్కౌంట్ ధరలు, ఫీచర్లు

DishNXT HD STB డిస్కౌంట్ ధరలు, ఫీచర్లు

DishNXT హెచ్‌డి ఎస్‌టిబిని ఇప్పుడు కేవలం రూ.1,347 ప్రారంభ ధర వద్ద వినియోగదారులు పొందవచ్చు. ఈ HD STB ని కొనుగోలు చేసిన వారు ఏదైనా ఛానెల్ ప్యాక్‌కు సభ్యత్వాన్ని పొందడానికి వినియోగదారులు అదనంగా ఏమీ చెల్లించనవసరం లేదు. వినియోగదారులు ఆపరేటర్‌కు రూ.1,347 చెల్లించినప్పుడు వారికి ‘సూపర్ ఫ్యామిలీ హెచ్‌డి' ప్యాక్ యొక్క చందాను ఉచితంగా అందిస్తుంది. సాధారణంగా ఈ ఛానల్ ప్యాక్ యొక్క ధర 435 రూపాయలు. ఈ సూపర్ ఫ్యామిలీ HD ప్యాక్‌తో వినియోగదారులు 12 HD ఛానెల్‌లతో కలుపుకొని మొత్తంగా 299 కంటే ఎక్కువ ఛానెల్‌లను పొందుతారు.

DishNXT HD STB లాంగ్ టర్మ్ ప్యాక్

DishNXT HD STB లాంగ్ టర్మ్ ప్యాక్

వినియోగదారులు దీర్ఘకాలిక ఛానెల్ ప్యాక్‌తో DishNXT HD STBని కూడా పొందవచ్చు. అయితే ఈ STBని రూ.1,652 చెల్లించి కొనుగోలు చేసిన వారికి 3 నెలల హెచ్‌డి ప్యాక్ ను ఉచితంగా పొందే అవకాశం ఉంది. ఈ ప్లాన్ ప్రకారం వినియోగదారులు 3 నెలల పాటు ‘స్వాగత్ హెచ్‌డి' ప్యాక్‌కు ఉచిత సభ్యత్వాన్ని పొందుతారు. ఇదే కాకుండా ఆరు నెలల చెల్లుబాటుతో లభించే ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ లో భాగంగా వినియోగదారులు ఒకే ఛానల్ ప్యాక్ యొక్క ఉచిత చందాను రూ.2,245 ధర వద్ద పొందుతారు.

DishNXT HD STB ఉచిత ఆఫర్లు

DishNXT HD STB ఉచిత ఆఫర్లు

DishNXT HD STB కొనుగోలు మీద 1నెల మరియు 6 నెలల ఆఫర్లు పరిమిత కాలానికి మాత్రమే లభిస్తాయని డిష్ టివి హైలైట్ చేసింది. పైన పేర్కొన్న ధరలలో దేనికి GST కలిగి ఉండదని గమనించండి. కాబట్టి మీరు పైన పేర్కొన్న ధర మీద 18% ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది. అలాగే పైన పేర్కొన్న STB మరియు ఛానల్ కాంబో హిందీ ఛానెల్‌లను ఇష్టపడే వినియోగదారుల కోసం అని గమనించండి. ఏదేమైనా వివిధ భాషలలో ఛానల్ ప్యాక్‌తో STB ని కొనుగోలు చేసే వారికి మొత్తం ఖర్చు ఒకేలా లేదా కొద్దిగా తక్కువగా ఉంటుంది.

DishNXT HD STB కొనుగోలుపై డిస్కౌంట్ కూపన్స్

DishNXT HD STB కొనుగోలుపై డిస్కౌంట్ కూపన్స్

డిష్ టీవీ ఎస్‌టిబి ని మీరు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన సమయం నుండి నాలుగు గంటలలోపు కనెక్షన్‌ను ఇన్‌స్టాల్ చేస్తామని కంపెనీ తెలిపింది. డిష్ టీవీ STBలు సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. సంస్థ తన సేవలను పరీక్షించడానికి ఆసక్తి ఉన్నవారికి డెమో సేవలను కూడా అందిస్తోంది. ఇంకా STB ని కొనుగోలు చేసినప్పుడు వినియోగదారులు కూపన్ దునియా నుండి రూ.2,000 విలువైన కూపన్లను పొందుతారు. వినియోగదారులు కనెక్షన్‌ను కొనుగోలు చేస్తున్నప్పుడు సంస్థ అందించే దానికంటే మీరు మరొక ఛానెల్ ప్యాక్‌తో డిష్ టీవీ కనెక్షన్‌ను ఎంచుకోవచ్చు. అలాగే వినియోగదారులకు యాంటెన్నాతో వచ్చే కనెక్షన్ కావాలా లేదా అది లేనిది కావాలా అని ఎన్నుకునే సౌలభ్యం ఉంది. ఈ రెండు సందర్భాల్లోనూ STB ఛార్జీలు ఒకే విధంగా ఉంటాయని గమనించండి. డిష్ టీవీ వినియోగదారులు ‘వాచో' అని పిలువబడే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నుండి ఉచిత కంటెంట్‌ను చూసే అవకాశాన్ని కూడా పొందుతారు.

Best Mobiles in India

English summary
DishNXT HD STB Comes Less Price With Free Channel Pack
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X