Home
News

Disney+ Hotstar కొత్త చందాదారుల చేరికలో సరికొత్త రికార్డ్!!!

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న రెండు ప్రముఖ ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫాంలు డిస్నీ + మరియు డిస్నీ + హాట్‌స్టార్ చందాదారుల చేరికలో సరికొత్త రికార్డును సాధించింది. ప్రస్తుతం దీని యొక్క వినియోగం కూడా అధికంగా ఉంది. సెప్టెంబర్ 2020 త్రైమాసికం నాటికి సుమారు 16 మిలియన్ల మంది కొత్త చందాదారులను చేర్చుకున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లు కొద్దిగా భిన్నంగా ఉన్నప్పటికీ ఇవి ఒకే సంస్థ డిస్నీకి చెందినవి కావడం గమనార్హం. డిస్నీ యొక్క స్ట్రీమింగ్ సర్వీస్ త్రైమాసిక ఆదాయ వివరాలను సంస్థ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO), డిస్నీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టిన్ మెక్‌కార్తీ వెల్లడించారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిస్నీ + హాట్‌స్టార్ మొత్తం చందాదారుల పూర్తి వివరాలు

డిస్నీ + హాట్‌స్టార్ మొత్తం చందాదారుల పూర్తి వివరాలు

డిస్నీ + హాట్‌స్టార్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలో 2020 సంవత్సరం క్యూ 3 లో కొత్త చందాదారులను చేర్చిన తరువాత ఇది 18.5 మిలియన్లకు పైగా పేమెంట్ చందాదారులకు చేరుకుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా డిస్నీ + యొక్క మొత్తం చందాదారుల సంఖ్య 73.7 మిలియన్లకు చేరుకున్నది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కోసం ఇండియాలో ఎక్కువ మంది పెద్ద సంఖ్యలో చందాదారులను పొందింది.

 

IPL స్ట్రీమింగ్ - డిస్నీ + హాట్‌స్టార్

IPL స్ట్రీమింగ్ - డిస్నీ + హాట్‌స్టార్

ఐపిఎల్ యొక్క స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ + హాట్‌స్టార్‌ కలిగి ఉన్నందున ఆన్‌లైన్‌లో ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ లను చూడటానికి ఉన్న ఏకైక మార్గం ఈ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం యొక్క సభ్యత్వాన్ని కొనుగోలు చేయడం. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే డిస్నీ + హాట్‌స్టార్ VIP చందా సంవత్సరానికి కేవలం 399 రూపాయలకు మాత్రమే లభిస్తుంది. అందువల్ల వినియోగదారులు OTT సభ్యత్వాన్ని పొందడానికి ఎక్కువగా ఆలోచించలేదు. ఇప్పుడు ఐపిఎల్ ముగిసినప్పటికీ ఈ కొత్త చందాదారుల యొక్క చందా గడువు ముగియడానికి కనీసం ఒక సంవత్సరం సమయం పడుతుంది.

డిస్నీ + పేమెంట్ చందాదారుల పూర్తి సమాచారం

డిస్నీ + పేమెంట్ చందాదారుల పూర్తి సమాచారం

2020 సంవత్సరం ఏప్రిల్‌ నెల సమయానికి డిస్నీకి 8 మిలియన్లకు పైగా పేమెంట్ చందాదారులు ఉన్నారని సంస్థ అప్పుడు వెల్లడించారు. దీని అర్థం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలో ప్రస్తుతం పేమెంట్ చందాదారుల సంఖ్య రెట్టింపు అయింది. డిస్నీ + క్యూ 3 తో పోలిస్తే 16 మిలియన్లకు పైగా చందాదారుల పెరుగుదలతో క్యూ 4 ను 73.7 మిలియన్ చెల్లించిన చందాదారులతో ముగించింది. ఈ పెరుగుదలకు డిస్నీ + హాట్‌స్టార్ చందాదారుల చేరికలు అత్యధికంగా కారణమయ్యాయి. డిస్నీ + హాట్‌స్టార్ చందాదారులు ఇప్పుడు గ్లోబల్ చందాదారుల సంఖ్యలో నాలుగింట ఒక వంతు ఉన్నారు అని సంస్థ ప్రత్యేకంగా తెలిపింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Disney+ Hotstar and Disney+ Subscribers Cross 73.7 Million in 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X