Home
News

Disney+ Hotstar సబ్‌స్క్రిప్షన్‌ మూడు నెలల వాలిడిటీను కేవలం రూ.151 ధరకే పొందవచ్చు!!

వేగవంతమైన ప్రస్తుత స్మార్ట్ ప్రపంచంలో తమ యొక్క గమ్యాలను వేగంగా చేరుకుంటూ అధికంగా అలసిపోతూ ఉంటారు. ప్రజలు తమ రోజువారి అలసటను తీర్చుకోవడం కోసం అధిక మంది వినోదంవైపు అధికంగా మొగ్గు చూపుతూ ఉంటారు. నేటి ప్రపంచంలో వినోదం లభించే అనేక రూపాలలో OTT కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫారమ్‌లలో డిస్నీ+ హాట్‌స్టార్ కూడా ఒకటి. దీనిని ఇప్పుడు మూడు నెలల చెల్లుబాటు కాలం యొక్క సభ్యత్వాన్ని కేవలం రూ.151 ధరకే లభిస్తుంది.

OTT ప్లాట్‌ఫారమ్‌

వినియోగదారులు డిస్నీ+ హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫారమ్‌ యొక్క మూడు నెలల వాలిడిటీ సభ్యత్వాన్ని ఎంచుకున్నప్పుడు వినియోగదారులు నెలకు కేవలం రూ.50.33 మాత్రమే చెల్లిస్తున్నారు. కానీ ఇందులో గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇది ప్రత్యక్ష సభ్యత్వం కాదు. అంటే మీరు OTT ప్లాట్‌ఫారమ్ వెబ్‌సైట్ నుండి నేరుగా కొనుగోలు చేయలేరు. ఇందుకోసం మీరు వోడాఫోన్ ఐడియా (Vi) కస్టమర్ అయిఉండి దాని యొక్క రూ.151 డేటా వోచర్ ను ఎంచుకోవలసి ఉంటుంది. వోడాఫోన్ ఐడియా తన రూ.151 వోచర్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్‌ మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఈ డేటా వోచర్ యొక్క ప్రయోజనాల గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌

డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌

వోడాఫోన్ ఐడియా (Vi) టెలికాం సంస్థ ఇటీవల తన యొక్క వినియోగదారుల కోసం 4G డేటా వోచర్లను ప్రకటించింది. రూ.151 ధర వద్ద లభించే వోచర్ కూడా ఈ విభాగంలో ఉంది. ఈ వోచర్‌తో వినియోగదారులు 8GB డేటాను పొందుతారు. దీనిని లంప్సమ్ పద్ధతిలో ఉపయోగించవచ్చు. ఇది 4G వోచర్ అయినందున వినియోగదారులు దానితో కేవలం మొబైల్ డేటాను మాత్రమే పొందుతారు. దీనితో వాయిస్ కాలింగ్ లేదా SMS వంటి ప్రయోజనాలు ఏవీ అందించబడవు. అయితే అదనంగా డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఈ డేటా వోచర్‌తో కాంప్లిమెంటరీ విభాగంలో లభిస్తుంది. దీన్ని యాక్టివేట్ చేయడానికి వినియోగదారులు అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు.

SonyLIV ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ Vi ప్లాన్

SonyLIV ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ Vi ప్లాన్

వోడాఫోన్ ఐడియా (Vi) సిమ్ ని వినియోగిస్తున్న వినియోగదారులు తక్కువ మొత్తంలో ఖర్చు చేసి అదనంగా OTT ప్లాట్‌ఫారమ్‌లకి ఉచిత సబ్‌స్క్రిప్షన్ ని పొందాలనుకుంటే కనుక Vi టెల్కో అందించే రూ.82 డేటా వోచర్‌ని పొందవచ్చు. ఇది కూడా ఇటీవలే ప్రకటించబడింది. ఇది వినియోగదారులకు SonyLIV ప్లాట్‌ఫారమ్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్ని అందిస్తుంది. ఈ వోచర్‌తో వినియోగదారులు 4GB లంప్సమ్ డేటాను పొందుతారు. ఇది 14 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అయితే ఈ ప్లాన్‌తో అందించే SonyLIV సబ్‌స్క్రిప్షన్ మాత్రం 28 రోజుల చెల్లుబాటును కలిగి ఉంటుందని గుర్తుంచుకోండి. కాబట్టి మీకు మళ్లీ కావాలంటే, 28 రోజులు ముగిసిన తర్వాత మీరు అదే డేటా వోచర్‌ను కొనుగోలు చేయవచ్చు.

వోడాఫోన్ ఐడియా(Vi) డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్

వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తన యొక్క వినియోగదారులకు చౌకైన ధరలో డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనాన్ని ఉచితంగా అందించే ప్రీపెయిడ్ ప్లాన్ రూ.601 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు రోజుకు 100 SMS మరియు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 3GB రోజువారీ డేటాను పొందుతారు. అయితే ఈ ప్లాన్ 28 రోజుల స్వల్ప వ్యాలిడిటీని మాత్రమే కలిగి ఉంటుంది. ఇంకా వినియోగదారులు ఈ ప్లాన్‌తో Vi హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను కూడా పొందుతారు. Vi హీరో అన్‌లిమిటెడ్ ప్రయోజనాలలో బింగే ఆల్ నైట్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ మరియు డేటా డిలైట్స్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. దీనితో పాటు వినియోగదారులు Vi మూవీస్ & TV VIPకి ఉచిత సబ్‌స్క్రిప్షన్ మరియు 16GB బోనస్ డేటా వంటి అధిక ప్రయోజనాలు కూడా పొందుతారు. వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో రూ.901 ధర వద్ద అందించే మరొక ప్రీపెయిడ్ ప్లాన్‌తో కూడా తన యొక్క వినియోగదారులకు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుంది. ఈ ప్లాన్ కూడా 3GB రోజువారీ డేటా ప్రయోజనంతో లభిస్తుంది. ఈ ప్లాన్‌ 70 రోజుల సర్వీస్ వాలిడిటీతో వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా పొందుతారు. అదనంగా ఈ ప్లాన్ కు టెల్కో యొక్క అన్ని Vi హీరో ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి. ఈ ప్లాన్ 48GB బోనస్ డేటాతో పాటు Vi Movies & TV VIP యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Disney + Hotstar Mobile Three Months Validity Subscription Now Available at Just Rs.151 Only
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X