Home
News

Disney+ Hotstar వాడుతున్న వారికి గుడ్ న్యూస్...

ఇండియాలో ఏప్రిల్ 3 న హాట్‌స్టార్‌ను డిస్నీ + హాట్‌స్టార్‌కు అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు స్టార్ ఇండియా ప్రకటించింది. అప్‌గ్రేడ్ చేసిన ప్లాట్‌ఫాం "డిస్నీ యొక్క స్టోరీస్ ల మాయాజాలం మరియు హాట్‌స్టార్ యొక్క కంటెంట్ మరియు సాంకేతిక నైపుణ్యాన్ని కలిపి వినియోగదారులకు అసమానమైన వీడియో స్ట్రీమింగ్ అనుభవాన్ని ఇస్తుంది.

డిస్నీ + హాట్‌స్టార్

దీని ద్వారా వినియోగదారులు మెరుగైన అనుభవాన్ని పొందుతారని కంపెనీ తెలిపింది. అప్‌గ్రేడ్‌తో డిస్నీ + హాట్‌స్టార్ విఐపి, డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం మరియు యాడ్ సపోర్టెడ్ బేసిక్ టైర్‌తో సహా మూడు ఆఫర్‌లను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇంకా డిస్నీ + హాట్‌స్టార్ విఐపి చందాదారులు కంటెంట్‌ను హిందీ, తమిళం, తెలుగులతో సహా మరో మూడు భారతీయ భాషల్లో ఆస్వాదించవచ్చని కంపెనీ తెలిపింది.

 

 

డిస్నీ ప్లస్ లాంఛ్

డిస్నీ ప్లస్ లాంఛ్

భారతదేశంలో ఏప్రిల్ 3న డిస్నీ ప్లస్ లాంఛ్ కానుంది. హాట్‌స్టార్‌తో కలిసి ఇండియాలో అడుగుపెడుతోంది డిస్నీ. 'డిస్నీ+హాట్‌స్టార్' ఓటీటీ ప్లాట్‌ఫామ్ అధికారికంగా లాంఛ్ కానుంది. అంటే ఇప్పుడు ఉన్న హాట్‌స్టార్ రీబ్రాండెడ్‌ వర్షన్ 'డిస్నీ+హాట్‌స్టార్' పేరుతో కనిపించనుంది. 'డిస్నీ+హాట్‌స్టార్' తెలుగు, తమిళ్‌ సహా 8 భారతీయ భాషల్లో కంటెంట్‌ని అందించనుంది. ఇందులో మార్వెల్ సినిమాటిక్ మూవీస్ కూడా చూడొచ్చు. ప్రస్తుతం హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌లో ఉన్నవారు ఆటోమెటిక్‌గా కొత్త సబ్‌స్క్రిప్షన్‌కు మారిపోతారు. రెన్యువల్ సమయంలో కొత్త ఛార్జీల ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది.

 

 

 

డిస్నీ + హాట్‌స్టార్ ప్యాకేజీల ధరలు

డిస్నీ + హాట్‌స్టార్ ప్యాకేజీల ధరలు

భారతదేశంలో 'డిస్నీ+హాట్‌స్టార్' రెండు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ అందిస్తోంది. డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ ధర ఏడాదికి రూ.399. ఇందులో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌తో పాటు ది అవెంజర్స్, ఐరన్ మ్యాన్ లాంటి సూపర్‌హీరో సినిమాలు చూడొచ్చు. దీంతో పాటు ది లయన్ కింగ్, ఫ్రోజెన్ 2, అలాద్దీన్, టాయ్ స్టోరీ 4 లాంటివి అందుబాటులో ఉంటాయి. హాట్‌స్టార్ ఒరిజినల్స్, లైవ్ స్పోర్ట్స్ మ్యాచెస్, బాలీవుడ్ మూవీస్, రీజనల్ కంటెంట్ ఉంటుంది. గతంలో ఈ ప్యాకేజీ ధర రూ.365 మాత్రమే.

 

 

డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం చందా

డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం చందా

డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియం యొక్క చందాదారులు విఐపి చందా యొక్క మొత్తం కంటెంట్‌తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంటెంట్ మరియు 29 డిస్నీ + ఒరిజినల్‌లను అందుకుంటారని స్టార్ ఇండియా తెలిపింది. మాండలోరియన్ మరియు హై స్కూల్ మ్యూజికల్: ది మ్యూజికల్: ది సిరీస్ కొన్ని డిస్నీ + ఒరిజినల్స్ కూడా దీని ప్రీమియం సభ్యత్వంలో చేర్చారు.

 

 

 

ఉచిత కంటెంట్‌కు యాక్సిస్

ఉచిత కంటెంట్‌కు యాక్సిస్

ఎనిమిది భారతీయ భాషలలో క్యాచ్-అప్ టీవీ షోలు, సినిమాలు మరియు ఆన్-డిమాండ్ న్యూస్ లతో సహా ఉచిత కంటెంట్‌ను వినియోగదారులు చూడటం కొనసాగించవచ్చని స్టార్ ఇండియా పేర్కొంది. అదనంగా వినియోగదారులు ఇండియన్ ప్రీమియర్ లీగ్, బిసిసిఐ క్రికెట్ సిరీస్ మరియు ప్రీమియర్ లీగ్‌తో సహా వివిధ క్రీడా కార్యక్రమాల నుండి స్పోర్ట్స్ క్లిప్‌లను కూడా యాక్సెస్ చేయవచ్చు.

ప్రీమియర్‌ షోలు

ప్రీమియర్‌ షోలు

ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీతో సహా పలు భాషల్లో ది లయన్ కింగ్ ప్రీమియర్‌తో ఏప్రిల్ 2 న వర్చువల్ రెడ్ కార్పెట్ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు కంపెనీ తెలిపింది. సాయంత్రం 6 గంటలకు ది లయన్ కింగ్ ప్రీమియర్ ప్లే అవుతుండగా, తరువాత 8 గంటలకు ది మాండలోరియన్ ప్లే కానున్నది.

More from GizBot

Best Mobiles in India

English summary
Disney+ Hotstar New Plans and Subscription Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X