Flipkart New scam: డిస్నీ + హాట్‌స్టార్ చందా కేవలం రూ.99లకే!!! నమ్మారో అంతే సంగతులు

|

ఇండియాలో ఆన్‌లైన్ మోసాల గురించి ఇప్పటికే చాలా విన్నారు కదా!! మోసగాళ్లు ప్రజలను మభ్యపెట్టడానికి ఎటువంటి చిన్న చిన్న అవకాశాలను కూడా వదలడం లేదు. ఇప్పుడు కొత్తగా IPL 2020 ని బ్రహ్మాస్తరంగా ఉపయోగించాలని చూస్తున్నారు. IPL మ్యాచ్లను అన్నిటిని డిస్నీ + హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. టెలికామ్ సంస్థలు కొన్ని ఈ OTT ప్లాట్‌ఫారమ్‌ను తమ యొక్క రీఛార్జ్ ప్లాన్లతో ఉచిత యాక్సిస్ ను అందిస్తున్నారు. సాధారణంగా డిస్నీ + హాట్‌స్టార్ యొక్క సంవత్సరం చందా రూ.399. అయితే ఇప్పుడు నకిలీ డిస్నీ + హాట్‌స్టార్ సభ్యత్వాన్ని ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ .99 ధరకు విక్రయిస్తున్నట్లు కొత్త స్కామ్ బయటపడింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

OTT ప్లాట్‌ఫారమ్‌ ఉచిత ఆఫర్‌లు
 

OTT ప్లాట్‌ఫారమ్‌ ఉచిత ఆఫర్‌లు

ఇండియాలో బండిల్ చేసిన OTT ప్లాట్‌ఫారమ్‌ల ఆఫర్‌లు అందరు ఉహించిన దానికంటే ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ఇందులో మరి ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు డిస్నీ + హాట్‌స్టార్ వంటి OTT ప్లాట్‌ఫారమ్‌ల సభ్యత్వం ఆన్‌లైన్ సేల్ లో కొన్ని వస్తువులను కొనుగోలుతో లేదా ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లతో ఉచితంగా లభిస్తూ ఉంటుంది. అయితే వెబ్‌లో మీరు చూసే అన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లు సరైనవి అవునా కదా అని అర్థం చేసుకోవలసి ఉంటుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో డిస్నీ + హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ నకిలీ అకౌంట్

ఫ్లిప్‌కార్ట్‌లో డిస్నీ + హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ నకిలీ అకౌంట్

ఫ్లిప్‌కార్ట్‌ను పోలిన నకిలీ వెబ్‌ పేజీ జాబితాలో డిస్నీ + హాట్‌స్టార్ సభ్యత్వాన్ని కేవలం రూ.99 కు విక్రయిస్తున్నట్లు చూపుతున్నది. వాస్తవమైన మరియు నమ్మదగినదిగా కనిపించే ఈ వెబ్‌ను చూసి టెంప్ట్ అయ్యారో అంతే సంగతులు. సాధారణంగా డిస్నీ + హాట్‌స్టార్ స్ట్రీమింగ్-సేవ కోసం ఏడాది పొడవునా సభ్యత్వం కోసం 399 రూపాయల ధరను కలిగి ఉంది. ఏదేమైనా వినియోగదారులు ఇలాంటి మోసాలను వదిలివేయడం అత్యవసరం. ఇది చివరికి మళ్లీ పాపప్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

అమెజాన్ & ఫ్లిప్‌కార్ట్‌లో నకిలీ అకౌంట్ల జాబితా

అమెజాన్ & ఫ్లిప్‌కార్ట్‌లో నకిలీ అకౌంట్ల జాబితా

అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ వంటి కామర్స్ పోర్టల్‌లలో వినియోగదారులను మోసం చేయడానికి ప్రయత్నిస్తు వారి డబ్బును దోచుకోవడానికి కనిపించే స్కామ్‌స్టర్‌లు పుష్కలంగానే ఉన్నాయి. అవి అవాస్తవికంగా తక్కువ ధరకు ఖరీదైనదాన్ని లాభదాయకంగా అందిస్తున్నాయి. ఏదేమైనా ఈ ఆఫర్‌లు, ఒప్పందాలు వంటివి ఖచ్చితంగా మోసం చేయడానికి ఉపయోగిస్తారు. ఆన్‌లైన్‌లో ఎక్కువగా షాపింగ్ చేసేటప్పుడు అనుసరించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవి నిజమా కాదా అని తెలుసుకోవడం చాలా మంచిది.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్
 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్

ఫ్లిప్‌కార్ట్ 2020 సంవత్సరంలో జరపబోయే "ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ 2020" ఈవెంట్ తేదీని వెల్లడించింది. ఈ సేల్ కార్యక్రమం సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 4 వరకు జరపనున్నది. భారతదేశంలో పండుగ సీజన్‌తో ఈ అమ్మకాలు సమానంగా ఉంటాయి. ప్రజలు ఎక్కువ షాపింగ్ చేసేటప్పుడు అమ్మకాలకు ముందు 70,000 కొత్త ఉద్యోగాలను సృష్టించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ యొక్క విక్రేత భాగస్వామి స్థానాల్లో పరోక్షంగా ఇతర ఉద్యోగాలను కూడా సృష్టించనున్నది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Disney+ Hotstar Now Available Just Rs.99 Only On Flipkart New Scam Beware

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X