పాస్‌వర్డ్ షేరింగ్‌పై డిస్నీ+హాట్‌స్టార్ కీలక నిర్ణయం.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందంటే..?
ప్రస్తుతం భారత్‌లో ఓటీటీల హవా రోజురోజుకు ఎక్కువవుతోంది. నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ సహా మరికొన్ని సంస్థలు ప్రస్తుతం అధిక సంఖ్యలో వినియోగదారులను కలిగి ఉన్నాయి. అయితే ఆదాయం పెంచుకోవడంలో భాగంగా ఈ ఓటీటీ స్ట్రిమింగ్ సంస్థలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి.
ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ భారత్ సహా సుమారు వంద దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితులు విధించింది. కేవలం కుటుంబ సభ్యులు మధ్య మాత్రమే పాస్‌వర్డ్ షేరింగ్ జరిగేలా చర్యలు ప్రారంభించింది. ఈ చర్యల వల్ల కొత్తగా సబ్‌స్క్రైబర్ల సంఖ్య భారీగా పెరుగుతుందని భావిస్తోంది.

అయితే మరో ఓటీటీ స్ట్రీమింగ్ దిగ్గజం డిస్ని+ హాట్‌స్టార్ కూడా నెట్‌ఫిక్స్‌ను అనుసరిస్తోంది. పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితులు విధించేందుకు సిద్ధం అవుతోంది. త్వరలో కొత్త నిబంధనలు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా కేవలం 4 డివైస్‌ల నుంచి మాత్రమే డిస్నీ + హాట్‌స్టార్ అకౌంట్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఈ నిర్ణయం పాస్‌వర్డ్ షేరింగ్ సమస్యకు చెక్ పెడుతుందని భావిస్తోంది.
ప్రస్తుతం భారత్‌లో డిస్నీ+ హాట్‌స్టార్ నాలుగు డివైస్‌లోనే లాగిన్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించినా.. గరిష్ఠంగా 10 డివైస్‌ల వరకు లాగిన్ అయ్యేందుకు అనుమతి ఇస్తోంది. కేవలం ఓటీటీ లాగిన్‌ను నాలుగు డివైస్‌లకే పరిమితం చేసేలా పరీక్షలు చేస్తోంది. ఈ సంవత్సరం చివర్లో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే సబ్‌స్క్రిప్షన్‌లు పెరిగే అవకాశం ఉందని సంస్థ భావిస్తోంది.

ప్రస్తుతం భారత్‌లో డిస్నీ, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జియో సినిమా ఎక్కువ పాపులారిటీని సంపాదించాయి. 2027 నాటికి స్ట్రీమింగ్ పరిశ్రమ 7 బిలియన్లుగా వృద్ధి చెందుతుందని ఓ నివేదిక పేర్కొంది. ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్ భారత్‌లో 50 మిలియన్ల సబ్‌స్ర్కైబర్లను కలిగి ఉంది. జనవరి 2022 మరియు మార్చి 2023 మధ్య భారతదేశ స్ట్రీమింగ్ మార్కెట్‌లో డిస్నీ+ హాట్‌స్టార్ 38శాతం వీక్షకులను కలిగి ఉందని మీడియా పార్టనర్స్ ఆసియా వెల్లడించింది.
అయితే ప్రీమియం యూజర్లకు అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో కేవలం 4 డివైస్‌లోనే లాగిన్ అయ్యే విధానాన్ని వెంటనే అమలుచేయడం లేదని తెలుస్తోంది. కొన్ని అంతర్గత నివేదికల ప్రకారం కేవలం 5 శాతం ప్రీమియం యూజర్లు మాత్రం నాలుగు కంటే ఎక్కువ డివైస్‌లలో లాగిన్ అవుతున్నట్లు గుర్తించింది. త్వరలో రానున్న మార్పులతో తక్కువ ధర ప్లాన్ వినియోగాన్ని కేవలం 2 డివైస్‌లకే పరిమితం చేస్తుంది.
* భారత్‌లో పాస్‌వర్ట్ షేరింగ్ విధానంలో Netflix పరిమితులు విధించింది. జులై 20 నుంచి నిర్ణయం అమల్లోకి వచ్చింది. భారత్ సహా సుమారు వంద దేశాల్లో పాస్‌వర్ట్ షేరింగ్ విధానంపై నెట్‌ఫ్లిక్స్ పరిమితులు విధించింది. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే పాస్‌వర్డ్ షేరింగ్‌కు అనుమతి ఇచ్చింది.
నెట్‌ఫ్లిక్ అకౌంట్ అనేది ఒకే కుటుంబం వినియోగించుకోడానికి నిర్దేశించబడిందని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఇంట్లో, ప్రయాణాలు, ఉద్యోగంలో ఎక్కడున్నా వినియోగించుకోవచ్చని పేర్కొంది. ప్రొఫైల్ బదిలీ, అకౌంట్ యాక్సెస్ వంటి అదనపు సదుపాయాలను కూడా పొందవచ్చు వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్ ప్రకారం కుటుంబ సభ్యులు అంటే ఒకే ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించే ఇతర పరికరాలు కూడా నెట్‌ఫ్లిక్స్ హౌస్‌హోల్డ్ (కుటుంబ సభ్యులు)లో భాగం అవుతాయి.
తమ వినియోగదారులకు అనేక ఎంటర్ టైన్‌మెంట్ ఆప్షన్లు ఉన్నాయని, అందువల్ల అనేక కొత్త సినిమాలు, టీవీషోలపై భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. వినియోగదారుని భాష, ఇష్టం, మానసిక స్థితి ఆధారంగా ఎప్పుడు కూడా నెట్‌ఫ్లిక్స్ సంతృప్తికర కంటెంట్‌ను అందిస్తుందని పేర్కొంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








