Disney+ Hotstar సబ్‌స్క్రిప్షన్ కొత్త ప్లాన్‌లు వాటి పూర్తి వివరాలు!!!
డిస్నీ+ హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫాం గత నెలలో భారతీయ వినియోగదారుల కోసం కొత్తగా మూడు ప్లాన్‌లను ప్రారంభించింది. ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ఇప్పటికే ఉన్న వాటిని కూడా భర్తీ చేస్తాయి. సెప్టెంబర్ 1 నుండి ఈ మూడు కొత్త డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్‌లు అమల్లోకి రానున్నది. అందుచేత ఇప్పటికే ఉన్న వినియోగదారులు వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ని ఉపయోగించడం కొనసాగించడానికి మరియు వారికి ఇష్టమైన సినిమాలు మరియు వెబ్ సిరీస్‌లను ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడటానికి అప్‌గ్రేడ్ చేయవలసి ఉంటుంది.

ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ఇప్పుడు నెలకు రూ.499 నుంచి ప్రారంభమై రూ.1499 వార్షిక సభ్యత్వంతో లభిస్తాయి. ఇప్పుడు కూడా డిస్నీ+ హాట్‌స్టార్ భారతీయ వినియోగదారులకు రూ.299, రూ.399 విఐపి ప్లాన్, మరియు రూ.1499 ధర వద్ద వార్షిక సబ్‌స్క్రిప్షన్ ప్యాక్‌తో సహా మూడు ప్లాన్‌లను అందిస్తుంది.

డిస్నీ+ హాట్‌స్టార్ కొత్త ప్లాన్‌ల జాబితా & వాటి ధరల వివరాలు
డిస్నీ+ హాట్‌స్టార్ ఇప్పుడు రూ.499, రూ.899 మరియు రూ.1499 ధరల వద్ద కొత్తగా మూడు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రకటించింది. రూ.499 ధర వద్ద లభించే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఒక సంవత్సరం చెల్లుబాటు వాలిడిటీకి HD క్వాలిటీ వీడియో యాక్సెస్‌ను అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ మొబైల్ వినియోగదారులకు మాత్రమే. కాబట్టి మీరు మీ మొబైల్ ఫోన్‌ని మాత్రమే ఉపయోగించి కంటెంట్‌ను వినియోగిస్తే ఇది ఉపయోగకరంగా మరియు పాకెట్ ఫ్రెండ్లీగా కూడా మారుతుంది.

రూ.899 సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కింద డిస్నీ+ హాట్‌స్టార్ రెండు స్క్రీన్‌ల యాక్సెస్‌ను HD నాణ్యతతో అందిస్తుంది. ఇది చౌకైన రూ.299 ప్లాన్ లాగా కాకుండా ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను స్మార్ట్‌ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్ లేదా టీవీలో కూడా ఉపయోగించవచ్చు. ఆయతే ఇది కూడా వార్షిక ప్లాన్. చివరిగా అత్యంత ఖరీదైన రూ.1499 సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ 4 స్క్రీన్‌లలో 4K నాణ్యతతో వీడియోను ప్రసారం చేస్తుంది. ఇది మూడింటిలో అత్యంత ప్రీమియం ప్లాన్ మరియు ఒక సంవత్సరం చెల్లుబాటుతో వస్తుంది.

డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కొనుగోలు చేసే విధానం
డిస్నీ+ హాట్‌స్టార్ యొక్క ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ఇండియాలోని వినియోగదారుల కోసం సెప్టెంబర్ 1, 2021 నుండి అమలులోకి వస్తాయని గమనించాలి. ఈ మూడు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లలో ఒకదాన్ని కొనుగోలు చేయడానికి మీరు డిస్నీ+ హాట్‌స్టార్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లవచ్చు.


Click it and Unblock the Notifications








