Home
News

Disney+ Password Sharing పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై డిస్ని+ కీలక నిర్ణయం.. జూన్‌ 2024 నుంచే అమల్లోకి..?

భారత్‌ మార్కెట్‌లో OTT ప్లాట్‌ఫాంలకు భారీగా ఆదరణ పెరుగుతోంది. అయితే తాజాగా డిస్ని+ (Disney+) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై నియంత్రణ విధించనుంది. హౌస్‌హోల్డ్‌ మినహా ఇతరులకు పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అయితే ఎప్పుటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందనే సమాచారం కూడా తెలిసింది.

ఈ సంవత్సరం జూన్‌ నుంచి డిస్ని + (Disney Plus Passward sharing) పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను నిలిపేస్తున్నట్లు తెలిసింది. ఇదివరకు మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ ఈ తరహా నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో డిస్ని+ లాభాలను పెంచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌లో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చే అవకాశం ఉండగా.. జూన్‌లో కొన్ని దేశాల్లో ఈ నిర్ణయం తొలుత అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.

disney plus decided to crackdown sharing password

ఈ పాస్‌వర్డ్‌ షేరింగ్‌ నిలిపివేత నిర్ణయాన్ని పక్కాగా అమలుచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాస్‌వర్డ్‌ షేరింగ్‌ నిలిపివేత కారణంగా కొత్తగా సబ్‌స్క్రిప్షన్‌ తీసుకొనేవారి సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అయితే హౌస్‌హోల్డ్‌ సభ్యులకు కాకుండా ఇతరులను పాస్‌వర్డ్‌ షేరింగ్ చేసేందుకు అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.

అయితే ఇందుకోసం ఎంత చెల్లించాల్సి ఉంటుందనే వివరాలు వెల్లడి కాలేదు. డిస్ని ఇటీవల డిస్ని+ మరియు హులూ యాప్‌ను ప్రారంభించింది. ఈ రెండు ప్లాట్‌ఫాంల ద్వారా యూజర్లకు మరింత ఎక్కువ కంటెంట్‌ లభిస్తుంది. మరియు రెండు ఫ్లాట్‌ఫాంల కంటెంట్‌ హిస్టరీ కూడా పరస్పరం అందుబాటులో ఉంటుంది. ఈ సంవత్సరం చివరి నాటికి డిస్ని+ లాభాల్లోకి వస్తుందని భావిస్తోంది.

గత సంవత్సరం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ అమెరికాలో పాస్‌వర్డ్‌ షేరింగ్‌ను నిలివేసింది. డేటా అనలిటిక్స్ ద్వారా ప్రైమరీ ఖాతాదారుడి లోకేషన్‌ను గుర్తించి, ఇతర అనధికార యాక్సెల్‌ను నియంత్రిస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌ నిర్ణయంతో భారీగా సబ్‌స్క్రైబర్లు సంఖ్య పెరిగింది. దీంతో డిస్ని కూడా ఇదే దారిలో ముందుకెళ్తోంది.

కరోనా అనంతర పరిస్థితుల నేపథ్యంలో భారీ సంఖ్యలో ప్రజలు ఓటీటీల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే తొలిదశలో వినియోగదారులను ఆకర్షించేందుకు ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో ఎక్కువ మంది కంటెంట్‌ను యాక్సెస్‌ చేసేలా పాస్‌వర్డ్ షేరింగ్‌పై ఎటువంటి నియంత్రణ విధించలేదు. అయిన అనంతర కాలంలో లాభాల పేరిట పాస్‌వర్డ్‌ షేరింగ్‌పైన నియంత్రణ తీసుకొస్తున్నాయి.

అయితే డిస్ని+ జూన్‌ 2024 లో కొన్ని దేశాల్లో ఈ పాస్‌వర్డ్ షేరింగ్‌ నియంత్రణ నిర్ణయం అమల్లోకి తీసుకురానుంది. సెప్టెంబర్‌ నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ నిర్ణయం అమలు చేయాలని భావిస్తోంది. అయితే భారత్‌లో ఎప్పటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందనే సమాచారం అందుబాటులో లేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
disney plus will restrict password sharing starting from june 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X