దీపావళి ధమాకా: గణనీయంగా పెరిగిన ఆన్‌లైన్ షాపింగ్

Posted By:

ఈ దీపావళి ఇండియన్ ‘ఇ-కామర్స్' వ్యాపారానికి కొత్త ఊపును తీసుకువచ్చింది. ఈ పండుగను పురస్కరించుకుని భారత్‌లోని అత్యధిక శాతం మంది నెటిజనులు ఆన్‌లైన్ షాపింగ్ వైపు అడుగులు వేయటంతో ‘ఇ-కామార్స్' వ్యాపారం 250శాతం మేర విస్తరించినట్లు అస్సోచాం సర్వే వెల్లడించింది.

దీపావళి ధమాకా: గణనీయంగా పెరిగిన ఆన్‌లైన్ షాపింగ్

దీపావళి సీజన్‌ను పురస్కరించుకని హైదరాబాద్, ఢిల్లీ, లక్నో, కోల్‌కతా, డెహ్రాడూన్, పూణే, ముంబయ్, చెన్నై, ఆమ్మదాబాద్, కొచ్చిన్, ఉదయ్‌పూర్, జైపూర్, చండీగఢ్ వంటి ప్రధాన నగరాల్లో ఆన్‌లైన్ షాపింగ్ ఊహించని స్థాయిలో ఊపందుకున్నట్లు ఈ సర్వే ద్వారా తెలుస్తోంది.

ఆన్‌‌లైన్ షాపింగ్ ద్వారా దీపావళీ సందర్భాన్ని పురస్కరించుకుని అమ్ముడైన వస్తువల శాతాన్ని ఆస్సోచాం సర్వే విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. దీపావళి గిఫ్ట్ ఆర్టికల్స్ (58 శాతం), ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ (41 శాతం), ఉపకరణాలు (36 శాతం), దుస్తులు (36 శాతం), కంప్యూటర్ ఉపకరణాలు (33 శాతం), హోట్ రూమ్స్ (20 శాతం), గృహోపకరణాలు (16శాతం), ఆట వస్తువులు (16శాతం), ఆభరణాలు (15శాతం), అందాన్ని పెంపొందించే ఉత్పత్తులు (12 శాతం), ఫిట్నెస్‌ను పెంపొందించే ఉత్పత్తులు (12 శాతం).

ధరల విశ్లేషణ, ధర తగ్గింపు రాయితీలు, 24x7 షాపింగ్ అందుబాటు, ఉచిత హోమ్ డెలివరీ, సమయ పాలన వంటి అంశాలు ఆన్‌లైన్ షాపింగ్ ఎదుగుదలకు తోడ్పడ్డాయని ఈ సర్వే ద్వారా తెలుస్తోంది. మొత్తంమీద ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని అక్టోబర్ 2013లో రూ 5,000 కోట్లమేర ఆన్‌లైన్ అమ్మకాలు సాగినట్లు ఓ విశ్లేషణ.

అస్సోచాం సర్వేలో భాగంగా ఢిల్లీలో 71శాతం మంది ఆన్‌లైన్ షాపింగ్‌ను ఇష్టపడితే 21శాతం మంది మాత్రమే సాంప్రదాయక మార్కెటింగ్‌‍ను ఎన్నుకున్నారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot