పండుగ ఆఫర్.. రూ.16,490కే ఇంటెక్స్ 32 ఇంచ్ ఎల్ఈడి టీవీ

ఇంటెక్స్ టెక్నాలజీస్ సరికొత్త ఎల్ఈడి టీవీని మార్కెట్లో లాంచ్ చేసింది.32 ఇంచ్ 3222 మోడల్‌లో వస్తోన్న ఈ ఎల్ఈడీ టీవీ ధర రూ.16,490. Eye Safe T-Matrix టెక్నాలజీతో వస్తోన్న ఈ ఎల్ఈడి టీవీ సుపీరియర్ క్వాలిటీ ఫీచర్లతో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో సరికొత్త అనుభూతులను చేరువ చేస్తుందని కంపెనీ చెబుతోంది.

పండుగ ఆఫర్.. రూ.16,490కే ఇంటెక్స్ 32 ఇంచ్ ఎల్ఈడి టీవీ

Read More : భారీ అంచనాలతో దూసుకొస్తున్న 10 చైనా ఫోన్‌లు!

స్పెషల్ దీపావళి ఆఫర్‌లో భాగంగా ఈ టీవీ కొనుగోలు పై 5 సంవత్సరాల స్పెషల్ వారంటీతో పాటు 8000 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల పవర్ బ్యాంక్‌ను ఉచితంగా అందిస్తున్నారు. అక్టోబర్ 31, 2016 వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

పండుగ ఆఫర్.. రూ.16,490కే ఇంటెక్స్ 32 ఇంచ్ ఎల్ఈడి టీవీ

Read More : మీ ఫోన్ బ్యాటరీ కోసం, 10 ముఖ్యమైన టిప్స్

ఐ‌సేఫ్ మాట్రిక్స్ టెక్నాలజీతో వస్తోన్న ఈ టీవీలో వ్యూవింగ్ యాంగిల్స్ అద్భుతంగా అనిపిస్తాయి. పిక్షర్ క్వాలిటీ బాగుంటుంది. 2 బిల్ట్ ఇన్ స్పీకర్స్‌తో వస్తోన్న ఈ టీవీ 10WX2 బ్యాలెన్సుడ్ సౌండ్‌ను ప్రొడ్యూస్ చేయగలదు. డిజిటల్ నాయిస్ ఫీల్టర్ సినీమాటిక్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను కలిగిస్తుంది. ఈ ఫుల్‌హెచ్‌డి టీవీలో అనేక రకాల కనెక్టువిటీ ఆప్షన్స్ అందుబాటులో ఉంచారు. అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్‌లతో పాటు లీడింగ్ ఈ-కామర్స్ సైట్‌లలో ఈ ఎల్‌ఈడీ టీవీ అందుబాటులో ఉంటుంది.

English summary
Diwali Offer: Buy an Intex 32 Inch LED TV Priced at Rs. 16,490 and Get a Power Bank Free!. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot