పాత కస్టమర్లు ఎయిర్‌టెల్ 4జీలోకి వెళితే...
ఎయిర్‌టెల్ యూజర్లు తమ పాత సిమ్‌ను 4జీకి అప్‌గ్రేడ్ చేసుకున్నట్లయితే ప్రత్యేక ఆఫర్లను కల్పిస్తోంది.
దీపావళిని పురస్కరించకుని భారతి ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఎయిర్‌టెల్ యూజర్లు తమ పాత సిమ్‌ను 4జీకి అప్‌గ్రేడ్ చేసుకున్నట్లయితే 2జీబి 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఈ 4జీ సిమ్ ప్రమోషనల్ ఆఫర్‌ను పొందేందుకు మీరు పాటించవల్సిన సూచనలు...
Read More : కొత్త ఫోన్‌ల పై Amazon, Flipkart డిస్కౌంట్లు

స్టెప్ 1
మీరు ఇప్పటికే వాడుతోన్న 2జీ/3జీ ఎయిర్‌టెల్ సిమ్‌ను 4జీకి అప్‌గ్రేడ్ చేసుకునే క్రమంలో http://www.airtel.in/4g/sim-swapలోకి వెళ్లి.. మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఇంకా షిప్పింగ్ అడ్రస్ వివరాలను ఎంటర్ చేసి 'Send me a 4G SIM'పై క్లిక్ చేయండి.

స్టెప్ 2
మీరు తెలిపిన వివరాలు ప్రకారం ఎయిర్‌టెల్ 4జీ సిమ్ మీ చిరునామాకు డెలివరీ చేయటం జరుగుతుంది. కొత్త సిమ్ పొందిన తరువాత ఆ సిమ్ పై ఉన్న 20 డిజిట్ల నెంబర్‌ను 121కు ఎస్ఎంఎస్ చేయవల్సి ఉంటుంది.

స్టెప్ 3
మెసెజ్ పంపిన వెంటనే ఎయిర్‌టెల్ నుంచి మీకో రిప్లై మెసేజ్ అందుతుంది. ఆ మెసేజ్‌ను కన్ఫర్మ్ చేసేందుకు ‘1' అంకెను ప్రెస్ చేయవల్సి ఉంటుంది.

స్టెప్ 4
ఈ ప్రక్రియ పూర్తి అయిన కొద్ది నిమిషాలకే మీ పాత ఎయిర్‌టెల్ సిమ్ డిస్‌కనెక్ట్ కాబడుతుంది. ఇలా జరిగిన వెంటనే కొత్త ఎయిర్‌టెల్ సిమ్‌ను ఫోన్‌లో ఇన్సర్ట్ చేసి ఎయిర్‌టెల్ 4జీ సేవలను ఆస్వాదించవచ్చు.

స్టెప్ 5
సిమ్ అప్‌గ్రేడ్ ప్రాసెస్ పూర్తి అయిన వెంటనే మీ నెంబర్‌కు 2జీబి 4జీ డేటా క్రెడిట్ అవుతుంది. ఉచిత 4జీ డేటాను పొందే క్రమంలో 52122 నెంబర్‌కు మిస్సుడ్ కాల్ ఇవ్వవల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








