Home
News

10 కి.మీ వరకు ఎగిరే డ్రోన్, లాంచ్! ధర కూడా తక్కువే!

By Maheswara

ప్రస్తుతం, ఇది డ్రోన్ల యుగం అని చెప్ప్పవచ్చు, ఈ రోజుల్లో డ్రోన్ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది. దీంతో పలు రంగాల్లో డ్రోన్‌ల వినియోగం పెరిగింది. దీని ప్రకారం, ప్రముఖ కంపెనీలు కూడా విభిన్నమైన మరియు ప్రత్యేకమైన డ్రోన్‌లను పరిచయం మార్కెట్ కు అనుగుణంగా తయారు చేస్తున్నాయి. ఇటీవల, ప్రముఖ డ్రోన్ తయారీ సంస్థ అయిన DJI తక్కువ ధరలో తమ కొత్త ఎంట్రీ లెవల్ డ్రోన్‌ను లాంచ్ చేసింది. ఈ డ్రోన్ యొక్క డిజైన్ మరియు పరిమాణం రెండు ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఎంట్రీ లెవల్ డ్రోన్

ఎంట్రీ లెవల్ డ్రోన్

అవును, DJI కంపెనీ మార్కెట్లోకి కొత్త ఎంట్రీ లెవల్ డ్రోన్ DJI Mini 2 SE ని లాంచ్ చేసింది. ఈ డ్రోన్ OcuSync 2.0 ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌ తో కూడిన లేటెస్ట్ టెక్నాలజీ ని కలిగి ఉంది. ఈ డ్రోన్ యొక్క మునుపటి వెర్షన్ DJI Mini SE కంటే రెండింతలు ప్రయాణించే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. అదనంగా, ఎక్కువ దూరాలకు కూడా స్థిరమైన వీడియో ఫీడ్‌ను అందించగలదు. అయితే ఈ డ్రోన్ ఎలా పని చేస్తుంది? దీని ధర ఎంత, అనే వివరాలు ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం.

 DJI మినీ 2 SE డ్రోన్

DJI మినీ 2 SE డ్రోన్

ఈ కొత్త DJI మినీ 2 SE డ్రోన్ ఒక ఎంట్రీ-లెవల్ డ్రోన్ ల కేటగిరీ లో వస్తుంది.ఈ  OcuSync 2.0 ట్రాన్స్‌మిషన్ సిస్టమ్, మెరుగుపరచబడిన WiFi సిస్టమ్‌తో అమర్చబడి ఉంది, ఎగిరే పరిధి 4km వరకు పరిమితం చేయబడింది. అదనంగా, DG కంపెనీ ఈ సిస్టమ్ ఎక్కువ దూరం వద్ద మరింత స్థిరమైన వీడియో ఫీడ్‌ను నిర్వహిస్తుందని పేర్కొంది. ఈ డ్రోన్ మంచి కెమెరా సిస్టమ్‌తో కూడా వస్తుంది, ఇది త్రీ-యాక్సిస్ గింబల్ మరియు 1/2.3-అంగుళాల CMOS సెన్సార్‌తో వస్తుంది.

10km వరకు HD వీడియో లు స్ట్రీమ్ చేయగలదు

10km వరకు HD వీడియో లు స్ట్రీమ్ చేయగలదు

ఈ డ్రోన్‌ యొక్క కెమెరా సిస్టం 2.7K వరకు వీడియో మరియు 12 మెగాపిక్సెల్ స్టిల్ ఫోటోలను క్యాప్చర్ చేయగలదు. ఇది 10km (6.2 mi) వరకు HD వీడియో లు స్ట్రీమ్ చేయగల మద్దతు ఇస్తుంది మరియు 5 దశల గాలి నిరోధక టెక్నాలజీ ని కలిగి ఉంటుంది. ఈ డ్రోన్ 10.7 m/s (24mph) వేగంతో వీచే గాలిలో కూడా స్థిరంగా కదిలేలా ఉంటుంది. కాబట్టి మీరు ఎత్తైన ప్రదేశంలో కూడా డ్రోన్‌తో సులభంగా వీడియో రికార్డ్ చేయవచ్చు.

బరువు కేవలం 249 గ్రాములు మాత్రమే

బరువు కేవలం 249 గ్రాములు మాత్రమే

DJI మినీ 2 SE డ్రోన్ ఉత్తమైన బ్యాటరీ బ్యాకప్ కలిగి ఉంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 31 నిమిషాల పాటు ఎగరగలదని కంపెనీ చెబుతోంది. ఈ డ్రోన్ మునుపటి వెర్షన్ కంటే ఒక నిమిషం ఎక్కువసేపు ఎగురుతుంది. అలాగే, ఈ డ్రోన్ బరువు కేవలం 249 గ్రాములు మాత్రమే మరియు దీనిని సులభంగా తీసుకువెళ్లవచ్చు. ఈ డ్రోన్ యొక్క సైజు మరియు బరువు తక్కువ ఉండటం కారణంగా, మీరు ఈ డ్రోన్‌ను ఏ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌లో రిజిస్టర్ చేసుకోకుండానే మీరు ఉపయోగించవచ్చు.

డ్రోన్ ధర

డ్రోన్ ధర

ప్రస్తుతం DJI మినీ 2 SE డ్రోన్ గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేయబడింది. కాబట్టి DJI మినీ 2 SE డ్రోన్ ధర $369 (సుమారు రూ. 30,469). రాబోయే నెల నుంచి ఈ డ్రోన్ సేల్ కు రానుంది. ఈ డ్రోన్ భారత మార్కెట్లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఎలాంటి సమాచారం లేదు. ఈ డ్రోన్‌కు అందుబాటులో ఉన్న కలర్ ఆప్షన్‌ల వివరాలు మరియు సేల్ ఆఫర్లకు సంబందించిన వివరాలు మరి కొద్ది రోజుల్లో తెలియనున్నాయి.

Best Mobiles in India

English summary
Dji Mini 2 SE LightWeight Drone Launched At Affordable Price Range,Specifications And Availability Details In Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X