మొబైల్ డేటా నిరంతరం ఆన్‌లోనే ఉంచుతున్నారా.. అయితే ఈ సమస్యలు గురించి కచ్చితంగా తెలుసుకోవాలి!
భారత్‌లో డేటా వినియోగం గతం కంటే భారీ స్థాయిలో పెరిగింది. అన్‌లిమిటెడ్ డేటాతో జియో అరగేట్రం చేసింది. టెలికాం రంగంలో భారీ మార్పులను తీసుకొచ్చింది. దీంతో మిగిలిన సంస్థలు కూడా అదే బాటలో అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తున్నాయి. గతంలో కేవలం 30 రోజుల వ్యాలిడిటీతో 1GB డేటా సుమారు రూ.200 వరకు ఉండేది. ప్రస్తుతం అత్యంత తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చింది. చాలా దేశాలతో పోలిస్తే భారత్‌లో డేటా ధరలు తక్కువగా ఉన్నాయి.
అప్పట్లో ఇలా :
ఒకవైపు హైస్పీడ్ అన్‌లిమిటెడ్ డేటా అందుబాటులో ఉండడం, తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్ లు (Smartphone) అందుబాటులోకి రావడంతో డేటా వినియోగం భారీగా పెరిగింది. గతంలో ఏదైనా అవసరం మొబైల్ డేటా ఆన్ చేసి, బ్రౌజింగ్ సహా ఇతర నోటిఫికేషన్ ల వివరాలు తెలుసుకొనే వారు. ధర సహా ఇతర కారణాలతో డేటా వినియోగం పరిమితంగానే ఉండేది.

ప్రస్తుతం ఇలా ;
ప్రస్తుతం అన్‌లిమిటెడ్ డేటా అందుబాటులో ఉండడం సహా మొబైల్ ద్వారా అనేక పనులు పూర్తి చేస్తున్న నేపథ్యంలో మొబైల్ డేటాను ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంచుతున్నారు. దీంతోపాటు వాట్సాప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేందుకు డేటా ఆన్‌లోనే ఉంచుతున్నారు.
నష్టాలు కూడా ఉన్నాయి! :
దీని కారణంగా సోషల్ మీడియాలో మెసేజ్‌లకు వెంటనే స్పందించే అవకాశం ఉంటుంది. మరియు ఇతర అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు తెలిసే అవకాశం ఉంది. న్యూస్ సహా ఇతర విషయాలను తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. సుమారుగా అన్నే నష్టాలు కూడా ఉన్నాయి.
* స్మార్ట్‌ఫోన్ డేటా ఎప్పుడూ ఆన్‌లో ఉంటే బ్యాటరీ వేగంగా డిశ్చార్జీ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఎక్కువ సార్లు ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా బ్యాటరీ పనితీరు వేగంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది.
* ఫోన్‌లో డేటా ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంటే.. యాప్‌లు నిరంతరం డేటాను వినియోగిస్తుంటాయి. మరియు నోటిఫికేషన్‌లు వస్తుంటాయి. దీంతోపాటు యాప్‌లు అప్‌డేట్ అవుతుంటాయి. ఫలితంగా డేటా వేగంగా ఖర్చు కానుంది.
* డేటా నిరంతరం ఆన్‌లో ఉంటే.. తరచూ వచ్చే నోటిఫికేషన్‌లు, ఇతర మెసేజ్‌లు మీ ఏకాగ్రతను దెబ్బతీసే అవకాశం ఉంది. మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉంటే.. మీ ఫోన్‌కు వచ్చే అన్ని రకాల నోటిఫికేషన్లు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.
* దీంతోపాటు సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఉంటుంది. మొబైల్ డేటా ఎప్పుడూ ఆన్ లో ఉంటే హ్యాకింగ్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు మీ లోకేషన్ ను సులభంగా ట్రాక్ చేసేందుకు అవకాశం ఉంది.
* ప్రస్తుతం రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. గత జులైలో అన్ని ప్రైవేటు టెలికాం సంస్థలు భారీగా టారిఫ్‌లను పెంచాయి. ఫలితంగా మొబైల్ డేటా నిరంతరం ఆన్‌లో ఉంచడం కారణంగా డేటా వేగంగా ఖర్చు అవుతుంది. అవసరం అయిన సమయంలో డేటా కోసం అదనపు రీఛార్జ్‌లు చేయాల్సిన అవసరం ఉండవచ్చు.
అందువల్ల అవసరం లేని సమయాల్లో మొబైల్ డేటాను ఆఫ్ చేయడం ఉత్తమం. ముఖ్యంగా రాత్రి సమయాల్లో కచ్చితంగా ఆఫ్ చేసే అలవాటు చేసుకోవాలి. నిరంతరం వచ్చే మెసేజ్‌లు, నోటిఫికేషన్లతో ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. మానసికంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








