Home
News

స్మార్ట్‌ఫోన్‌ ఛార్జింగ్‌ కోసం ఫాస్ట్‌ ఛార్జర్‌లను ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి!

భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న అనేక స్మార్ట్‌ఫోన్‌లు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టును (Fast Charging) కలిగి ఉంటున్నాయి. మిడ్‌ రేంజ్‌ నుంచి ఫ్లాగ్‌షిప్ హ్యాండ్‌సెట్‌ల వరకు ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను కలిగి ఉంటున్నాయి. అయితే ఈ ఫాస్ట్‌ ఛార్జింగ్ టెక్నాలజీ తక్కువ సమయంలో ఫోన్‌ను ఛార్జింగ్‌ చేస్తుంది. అయితే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు వినియోగిస్తున్న వారిలో చాలా మందికి ఫాస్ట్‌ ఛార్జింగ్ వల్ల జరిగే అనర్ధాలపై అవగాహన ఉండదు. అలాంటి వారి కోసం ఈ ప్రత్యేక కథనం.

సాధారణంగా ఫాస్ట్ ఛార్జింగ్‌ ద్వారా కేవలం నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని పూర్తిగా ఛార్జింగ్ చేయవచ్చు. అత్యవసర సమయాలు లేదా దూరప్రాంత ప్రయాణాల్లో ఈ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. టికెట్ల రిజర్వేషన్‌ నుంచి UPI వరకు అనేక పనులు స్మార్ట్‌ఫోన్‌ ద్వారా చేసేందుకు అవకాశం ఉండడంతో ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి స్మార్ట్‌ఫోన్‌ యూజర్‌కూ ఉంది.

what are the disadvantages in fast charging

స్మార్ట్‌ఫోన్‌ను సాధారణ ఛార్జర్‌తో ఛార్జింగ్‌ చేసినప్పుడు కొన్నిసార్లు ఫోన్ వేడెక్కుతుంది. అదే అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించినప్పుడు ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీంతోపాటు సరైన ప్రదేశంలో స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్ చేయకుంటే.. ఫోన్‌ పేలిపోయే అవకాశం ఉంది. ఛార్జింగ్‌ సమయంలో ఫోన్‌ వేడెక్కకుండా ఉండేందుకు వీలుగా.. గాలి సరిగా వచ్చే ప్రాంతంలో ఉంచాలి.

స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్ చేసే సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యరశ్శి నేరుగా వచ్చే ప్రాంతంలో స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జింగ్ చేయకూడదు. సరైన వెంటిలేషన్‌ ఉన్న ప్రదేశంలో ఛార్జింగ్ చేయాలి. ఛార్జింగ్‌ సమయంలో ఫోన్ వేడెక్కినట్లు అనిపిస్తే వెంటనే డిస్‌ కనెక్ట్‌ చేయాలి. ఛార్జింగ్ సమయాల్లో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రతి స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ.. కొన్ని ఛార్జింగ్ సైకిళ్ల వరకు సరైన పనితీరును కనబరుస్తుంది. సంస్థ గైడ్‌లైన్స్‌ ప్రకారం ఛార్జింగ్‌ చేస్తే ఎక్కువ రోజులపాటు బ్యాటరీ పనిచేస్తుంది. అయితే ఫాస్ట్‌ ఛార్జర్‌లు ఈ ఛార్జింగ్ సైకిళ్లను ప్రభావితం చేస్తాయి. ఫలితంగా బ్యాటరీలు త్వరగా డ్యామేజీ అవుతాయి. బ్యాటరీ ఛార్జింగ్ 20 శాతం కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఛార్జింగ్‌ చేసుకోవాలి. 20 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు ఛార్జింగ్‌ చేసే అలవాటు ఉంటే బ్యాటరీ త్వరగా డ్యామేజీ అవుతుంది.

ప్రస్తుతం మార్కెట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లను ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్టుతో వస్తున్నాయి. వేర్వేరు ఛార్జింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు అనుమతించిన ఛార్జర్‌లను మాత్రమే వినియోగించాలి. అధిక లేదా తక్కువ ఛార్జింగ్‌ సామర్థ్యం కలిగిన ఛార్జర్‌లను వినియోగించకూడదు.

అల్ట్రా ఫాస్ట్‌ ఛార్జింగ్ కారణంగా కొన్నిసార్లు వోల్టెజ్‌లో హెచ్చుతగ్గులు సంభవించే అవకాశం ఉంది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్‌లోని సున్నితమైన ఎలక్ట్రిక్‌ విభాగాలు డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఛార్జింగ్ పోర్టు లేదా కొన్నిసార్లు పూర్తిగా బ్యాటరీ డ్యామేజీ అయ్యే అవకాశం ఉంది.

అల్ట్రా ఫాస్ట్‌ ఛార్జర్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల బ్యాటరీ సామర్థ్యం తగ్గడం సహా బ్యాటరీ లైఫ్‌ కూడా తగ్గుతుంది. దీంతోపాటు పాత మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌లను కొత్త హ్యాండ్‌సెట్‌లకు చెందిన ఫాస్ట్‌ ఛార్జర్‌లను ఉపయోగించడం కూడా బ్యాటరీ వేగంగా డ్యామేజీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

Best Mobiles in India

English summary
Do you know 5 risk factors in fast charging in smartphones full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X