Home
News

స్మార్ట్‌ఫోన్‌లోని Flight Mode ఫీచర్‌తో మీకు తెలియని ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలుసా..?

స్మార్ట్‌ఫోన్‌లలో అనేక ఫీచర్లు ఉంటాయి. అయితే ఆ ఫీచర్లు ఎలా ఉపయోగపడతాయో చాలా మంది యూజర్లకు అవగాహన ఉండదు. అలాంటి ఫీచర్లతో Flight Mode లేదా Airplane Mode ఒకటి. ఈ ఫ్లైట్ మోడ్‌ లో విమాన ప్రయాణ సమయాల్లో మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇంకా అనేక ప్రయోజనాలున్నాయి. పూర్తి వివరాలు.

చాలా మంది ఇందుకోసం మాత్రమే అనుకుంటారు! :
విమాన సంకేతాలకు అవరోధం కలగకుండా మొబైల్‌, వైపై, బ్లూటూత్‌ నెట్‌వర్క్‌ ను ఆఫ్‌ చేసేందుకు ఫ్లైట్‌ మోడ్‌ ను యాక్టివేట్‌ చేయాలని విమాన ప్రయాణ సమయంలో చెబుతుంటారు. అయితే ప్రస్తుతం కొన్ని విమానయాన సంస్థలు వైఫై, బ్లూటూత్‌ వినియోగించుకొనేందుకు అనుమతిస్తున్నాయి.

Flight Mode or Airplane Mode in smartphones

అధిక బ్యాటరీ లైఫ్ :
స్మార్ట్‌ఫోన్‌ లో ఫ్లైట్ మోడ్ ఆన్‌ చేసిన వెంటనే అన్ని రకాల రేడియో సిగ్నల్స్‌ ఆఫ్‌ అవుతాయి. ఫలితంగా అధిక బ్యాటరీ లైఫ్‌ ను పొందేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫోన్‌ లో తక్కువ ఛార్జింగ్ ఉన్న సమయాల్లో ఫ్లైట్ మోడ్‌ ఫీచర్‌ ఉపయోగపడుతుంది.

ఫాస్ట్‌ గా ఛార్జింగ్‌ చేయవచ్చు! :
దీంతోపాటు ఫ్లైట్‌ మోడ్‌ ఆన్ చేసి స్మార్ట్‌ఫోన్‌ ను ఛార్జింగ్‌ చేస్తే.. సాధారణం కంటే తక్కువ సమయంలోనే ఫుల్‌ ఛార్జింగ్ చేయవచ్చు. నెట్‌వర్క్‌ లేకపోవడం మరియు బ్యాగ్రౌండ్‌ యాక్టివిటీ నిలిచిపోవడం వల్ల వేగంగా ఛార్జింగ్‌ అవుతుంది.

రాత్రి సమయాల్లో ఇలా :
చాలా మంది రాత్రి నిద్రపోయే సమయంలో స్మార్ట్‌ఫోన్‌ లో ఫ్లైట్‌ మోడ్‌ ఆన్‌ చేస్తుంటారు. దీని వల్ల రాత్రి సమయంలో రేడియోషన్‌ ప్రభావం తగ్గుతుందని భావిస్తుంటారు.

Flight Mode or Airplane Mode in smartphones

అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో :
అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో ఎక్కువ మంది స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ఫ్లైట్ మోడ్‌ ను ఆన్ చేసి ఉంచుతారు. బ్యాగ్రౌండ్‌ యాప్స్‌ డేటా ఉపయోగించకుండా నిలువరించడం సహా అనవసరంగా డేటా ఖర్చుకాకుండా ఉండేందుకు ఈ పద్ధతిని ఎంచుకుంటారు. ఎందుకంటే అంతర్జాతీయ ప్రయాణాల సమయంలో డేటా రీఛార్జ్‌ ప్లాన్‌ ధరలు అధికంగా ఉంటాయి.

ఆఫ్‌లైన్‌ గేమ్స్‌ సమయంలో :
స్మార్ట్‌ఫోన్‌ లో ఆఫ్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతున్న సమయంలో అంతరాయాలు లేకుండా నియంత్రించేందుకు చాలా మంది ఫ్లైట్‌ మోడ్‌ ను ఉపయోగిస్తారు. ముఖ్యంగా చిన్నారులకు గేమింగ్‌ కోసం ఫోన్‌లు ఇచ్చే సమయంలో ఫ్లైట్‌ మోడ్ ఆన్‌ చేసి ఉంచడం ఉత్తమం. వారికి తెలియకుండా లింక్స్ పైన క్లిక్ చేసినా ఇబ్బంది లేకుండా ఉంటుంది.

Flight Mode or Airplane Mode in smartphones

చిటికలో పరిష్కారం :
స్మార్ట్‌ఫోన్‌లలో డేటా వినియోగిస్తున్నప్పుడు కొన్నిసార్లు డేటా వేగం సడన్‌ గా తగ్గిపోవడం, నెట్‌వర్క్‌ లో ఇబ్బందులు ఎదుర్కోవడం, బ్లూటూత్ కనెక్టింగ్‌ ఇబ్బందులు ఉండే, ఫ్లైట్‌ మోడ్‌ ఆన్‌ చేసి, ఆఫ్‌ చేస్తే ఈ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి.

కాసేపు ప్రైవేట్‌ గా ఉండాలని భావిస్తుంటే :
ముఖ్యమైన మీటింగ్స్‌, చదువుకుంటున్న సమయంలో కాల్స్‌, మెసేజ్‌ లు, ఇతర నోటిఫికేషన్‌ లు రాకుండా ఫ్లైట్‌ మోడ్‌ ను యాక్టివేట్‌ చేయవచ్చు. దీంతోపాటు కొంత సమయంపాటు ప్రైవేట్‌ గా ఉండాలని భావిస్తుంటే ఈ ఫ్లైట్‌ మోడ్‌ ఎంతగానే ఉపయోగపడుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Do you know how many uses with Flight Mode or Airplane Mode in smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X