ఆన్‌లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు యువత బానిస

|

భారతదేశంలో ఓవర్-ది-టాప్ (OTT) ద్వారా ఒక మనిషి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై రోజుకు సుమారు 70 నిమిషాలు గడుపుతున్నాడు. వినియోగదారుని పౌనపున్యం లేదా ఫ్రీక్వెన్సీ వారానికి 12.5 సార్లు ఉంటుందని కొత్త నివేదిక తెలిపింది. వీక్షకులు ఒక నిర్దిష్ట సమయంలో 2.5 కంటే ఎక్కువ ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేస్తున్నారు. స్మార్ట్ టీవీ మరియు పెద్ద స్క్రీన్లలో సినిమాలు తమకు ఇష్టమైన ఎంపికల ద్వారా ఎంత సేపు గడుపుతున్నారో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వీడియో స్ట్రీమింగ్ యొక్క వీక్షకుల ఫలితాలు

వీడియో స్ట్రీమింగ్ యొక్క వీక్షకుల ఫలితాలు

దాదాపు 96 శాతం మంది ప్రేక్షకులు పెద్ద స్క్రీన్లలో అంటే సినిమా థియేటర్ లలో ఈరోస్ నౌకు సంబందించిన వీడియోలు చూడడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అయితే 92 శాతం మంది నెట్‌ఫ్లిక్స్ ద్వారా మరియు 89 శాతం మంది హాట్‌స్టార్ ద్వారా వీడియోలను చూడడం కోసం ఇష్టపడుతున్నారు. అలాగే 30 శాతం మంది ప్రతివాదులు OTT ప్లాట్‌ఫామ్‌లలో సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు అని కొత్త నివేదిక కనుగొన్నది.

వీడియో ఆన్ డిమాండ్

ఇండియాలో ఇంటర్నెట్ వీడియో ట్రాఫిక్ 2022 నాటికి నెలకు 13.5 ఎక్సాబైట్ల (EB) కు చేరుకుంటుందని అంచనా. ఇది 2017 లో నెలకు 1.5 EBగా ఉండేది. వీడియో స్ట్రీమింగ్ యొక్క సహకారం 2022 నాటికి మొత్తం ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో 77 శాతం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో 30 కి పైగా వీడియో ఆన్ డిమాండ్ (VoD) ప్లాట్‌ఫాంలు ఉన్నాయి.

హాట్‌స్టార్ మరియు ZEE5 ప్రత్యేక షోలు

హాట్‌స్టార్ మరియు ZEE5 ప్రత్యేక షోలు

ఇండియా మార్కెట్ కోసం ఏడు వేర్వేరు భాషలలో ప్రత్యేక షోలు ఇవ్వడానికి హాట్‌స్టార్ 2019 ప్రారంభంలో సుమారు 120 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈరోస్ నౌ కూడా తన ప్లాట్‌ఫామ్ ద్వారా 100 కొత్త ఒరిజినల్ షోలను రూపొందించడానికి 50 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. మార్చి 2020 వరకు ఆరు భాషలలో 72 కొత్త ఒరిజినల్‌ షోలను విడుదల చేయాలని ZEE5 కూడా భావిస్తోంది.

ఒరిజినల్ కంటెంట్

ఒరిజినల్ కంటెంట్ అనేది ఇప్పుడున్న కాలంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని కొత్త నివేదిక పేర్కొంది. 10 శాతం మంది దీనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. భారతదేశంలోని చిన్న చిన్న నగరాలలో కూడా డేటా వినియోగం మరియు డిజిటల్ మౌలిక సదుపాయాలు అధిక సంఖ్యలో అందుబాటులో ఉన్నందున ప్రస్తుతం OTT మార్కెట్ విపరీతంగా విస్తరించింది అని ఈరోస్ డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రిషికా లుల్లా సింగ్ అన్నారు.

ప్రాంతీయ బాషలలో వీడియో స్ట్రీమింగ్

ప్రాంతీయ బాషలలో వీడియో స్ట్రీమింగ్

ముప్పై శాతం మంది యూజర్స్ హిందీ మరియు ఇంగ్లీష్ కాకుండా ఇతర భాషలలో కంటెంట్ చూడటానికి ఇష్టపడుతున్నారు. దేశంలోని పెద్ద పెద్ద ప్రాంతాలలో స్థానిక భాషలలో కంటెంట్ వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ముక్యంగా దక్షిణ భారతదేశంలో యూజర్స్ తమ తమ మాతృభాషకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అని నివేదిక పేర్కొంది.

87 శాతం మంది తమ మొబైల్ ఫోన్లలో వీడియో కంటెంట్‌ను వినియోగిస్తున్నారు. వీరిలో దాదాపు 28 శాతం మంది సంప్రదాయ కార్యాలయ సమయంలో కంటెంట్‌ను చూస్తారని నివేదిక తెలిపింది.

 

Best Mobiles in India

English summary
Do you Know How Much time Indian viewers spends daily on video streaming platforms

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X