సోషల్ మీడియాలో చిన్నారుల ఫొటోలు పోస్ట్ చేస్తున్నారా.. జాగ్రత్తలు తప్పనిసరి!
సోషల్ మీడియా ఖాతాలు కలిగిన అనేక మంది తమ ఖాళీ సమయాల్లో ఎక్కువగా అందులోనే గడుపుతున్నారు. ఫలితంగా ఇంట్లో నుంచే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అప్‌డేట్ల గురించి తెలుసుకోగలుగుతున్నారు. మరియు ఎక్కడ నుంచైనా వ్యక్తులతో సులభంగా కనెక్ట్ అవుతున్నారు. ఈ సోషల్ మీడియాతో ఎన్ని లాభాలున్నాయో.. అన్నే నష్టాలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా వ్యక్తిగత, చిన్నారుల ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేయడం వల్ల కొన్నిసార్లు ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ప్రమాదాలపై సరైన అవగాహన లేని కొందరు తల్లిదండ్రులు తమ చిన్నారుల ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుంటారు.

అయితే ఇలాంటి పోస్టుల కారణంగా కొన్నిసార్లు బెదిరింపులను గురికావాల్సి రావచ్చు. మరియు చిన్నారులు ఇతర ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు సోషల్‌మీడియాను చట్ట వ్యతిరేక కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారు. అలాంటి వ్యక్తుల కారణంగా చిన్నారులు రిస్క్‌లో పడే అవకాశం ఉంది.
జాగ్రత్తలు తప్పనిసరి: చిన్నారుల ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేయాలని భావిస్తున్నప్పుడు లోకేషన్ సహా ఇతర సమాచారాన్ని పంచుకోవద్దు. మరియు మీ పోస్టులను మీ స్నేహితులు, పరిచయం ఉన్న వ్యక్తులు మాత్రమే చూడగలిగేలా సెట్టింగ్‌ల్లో మార్పులు చేయండి. అలాగే సరైన వస్త్రాలు ధరించి ఉన్న ఫోటోలనే షేర్ చేయండి. మీ చిన్నారులే నేరుగా ఫోటోలు అప్‌లోడ్ చేస్తున్నట్లు అయితే.. డిజిటల్ ప్రపంచంలోని ఇబ్బందులపై వారికి అవగాహన కల్పించండి.

చాలా మంది సెలబ్రిటీలు తమ చిన్నారుల ఫోటోలను పోస్టు చేసినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవడం మనం గమనించవచ్చు. చిన్నారుల ముఖాలు కనిపించకుండా ఎమోజీలు అడ్డుగా పెట్టడం లేదా లోకేషన్ లేదా ఇతర వివరాలు బహిర్గతం చేయకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటారు. సెలబ్రిటీల పిల్లలు కావడం కారణంగా దుర్వినియోగం అవుతాయనే భయంతో అలాంటి జాగ్రతలు తీసుకుంటారు.
సెలబ్రిటీలు అనే కాకుండా ఎవరైన తమ చిన్నారుల ఫోటోలను షేర్ చేస్తున్నట్లయితే కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఏదైనా ఫోటోను అప్‌లోడ్ చేసి, తర్వాత డిలీట్ చేస్తాం. అటువంటి ఫోటోలను మళ్లీ పొందేందుకు ఎన్నో అవకాశం ఉంటాయి. ఫలితంగా ఏదైనా ఫోటోను అప్‌లోడ్ చేసే ముందే ఒకటికి రెండు సార్లు ఆలోచించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఉత్తమం.
విరాట్ కోహ్లి, అనుష్క శర్మ తన చిన్నారి ముఖాన్ని బహిర్గతం చేయకుండా గతంలో ఓ పోస్టు చేశారు. అలాగే మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కూడా తన చిన్నారుల ఫోటోలను పోస్టు చేసిన సమయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. వారి ముఖం కనిపించకుండా ఎమోజీని అడ్డుగా ఉంచారు. చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని వారు జాగ్రత్తలు తీసుకున్నారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








