గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఎలాంటి ఫోన్‌లు ఉపయోగిస్తున్నారో తెలుసా?
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు భారీగా అందుబాటులోకి వస్తున్నాయి. ఎంట్రీ లెవల్ నుంచి ప్రీమియం మోడల్ వరకు భారత్‌లో భారీ డిమాండ్ ఉంటోంది. ఇటీవల కాలంలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు. కొంత మంది యూజర్లు తరచూ స్మార్ట్‌ఫోన్‌లను మారుస్తూ ఉంటారు. అయితే టెక్ దిగ్గజాలు ఎలాంటి స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించేందుకు ఇష్టపడతారో ఎప్పుడైనా తెలుసుకోవాలని అనిపించిందా.. మీరు వాడుతున్న ఫోన్‌లనే వాళ్లూ వినియోగిస్తున్నారా లేదా కస్టమైజ్ చేసుకున్న ఫోన్‌లను ఉపయోగిస్తున్నారా అనే సందేహం ఎప్పుడైనా కలిగిందా...?
ప్రముఖ టెక్ సంస్థలకు చెందిన సీఈవోలు, వ్యవస్థాపకులు ఉపయోగిస్తున్న ఉత్పత్తులు గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. మెటా, అమెజాన్, ఆపిల్, టెస్లా సహా దిగ్గజ సంస్థల అధిపతులు ఎలాంటి ఫోన్‌లను వినియోగిస్తున్నారు.. అయితే తాజాగా ఇందుకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడయ్యాయి.

జనవరి 20 వ తేదీన అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. టెక్ దిగ్గజాలతోపాటు అనేక సంస్థలకు చెందిన ముఖ్యులు, వ్యాపార దిగ్గజాలు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి ఆపిల్ సీఈవో టిమ్ కుక్, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్, మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌తోపాటు టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ సహా అనేక మంది హాజరయ్యారు. ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవంలో వీరంతా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమం మధ్యలో తమ ఫోన్‌లను ఉపయోగిస్తూ కనిపించారు.

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Google CEO).. గూగుల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ వెర్షన్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్‌ను ఉపయోగిస్తూ కనిపించారు. గూగుల్ పిక్సల్ 9 XL ఫోన్‌గా భావిస్తున్నారు. అదే ఎలాన్ మస్క్ ఐఫోన్ 16 ప్రో మోడల్‌తో కనిపించారు. అయితే ఆపిల్ 16 సిరీస్ విడుదల సమయంలో ఎలాన్ మస్క్ (Elon Musk) కీలక వ్యాఖ్యలు చేశారు. Apple ఫోన్‌లో ఓపెన్ ఏఐకి చెందిన ChatGPT ను ఇంటిగ్రేట్ చేయడంపై స్పందించారు.
తమ సంస్థల్లో ఆపిల్ ఉత్పత్తులను నిషేధం వంటి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం ఆపిల్ ఫోన్‌ను వినియోగిస్తూ కనిపించారు. అయితే సాధారణంగా ఇటువంటి వ్యక్తులు ఒకటి కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తుంటారు. వివిధ అవసరాల కోసం వేర్వేరు బ్రాండ్‌లను ఎంపిక చేసుకుంటారు.

గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ భారత్‌లో ఆగస్టు 14 న విడుదల అయ్యాయి. ఈ సిరీస్‌లో భాగంగా పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ఫోల్డ్, పిక్సెల్ 9 ప్రో XL ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. XL మోడల్ 16GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్ (Google pixel 9 Pro XL) ధర రూ.1,24,999 గా ఉంది. హాజెల్, పోర్సెలేన్, రోజ్ క్వార్జ్, ఒబ్సిడియాన్ రంగుల్లో లభిస్తుంది.
గూగుల్ పిక్సెల్ ప్రో XL స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 5060mAh బ్యాటరీతో పనిచేస్తోంది. ఆండ్రాయిడ్ 14 OS ను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 49 క్వాడ్ పీడీ అల్ట్రావైడ్ కెమెరా, 48MP టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంది. మరియు 42MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఐఫోన్ 16 సిరీస్ భారత్ మార్కెట్‌లో 2024 సెప్టెంబర్ నెలలో విడుదల అయింది. ఈ సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఐఫోన్ 16 ప్రో మోడల్ 128GB, 256GB స్టోరేజీ, 1TB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. విడుదల సమయంలో 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,19,900 గా ఉండేది.
ఐఫోన్ 16 ప్రో మోడల్ (iPhone 16 pro Smartphone) 6.3 అంగుళాల సూపర్ రెటీనా XDR OLED డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఆపిల్ సెకండ్ జనరేషన్ 3nm A18 ప్రో చిప్‌సెట్‌తో పనిచేస్తోంది. 48MP వైడ్ ప్రైమరీ కెమెరా, 48MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 12MP టెలిఫోటో కెమెరాలతోపాటు 12MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. ఈ మోడల్ క్యాప్చర్ బటన్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








