ఇండియాలో ఆన్‌లైన్ గేమర్‌లు అధికంగా ఎక్కడ నమోదయ్యారో తెలుసా??

|

భారతదేశంలో కరోనా ప్రభావంతో పిల్లలు మరియు పెద్దవాళ్ళు ఇంటికే పరిమితం కావడంతో తీరిక సమయాలలో అధికంగా ఆన్‌లైన్ లో గేమ్ లను ఆడడానికి ఇష్టపడుతున్నారు. ఆన్‌లైన్ క్లాసులు మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంతో ఇంటి వద్ద ఉండడంతో 20221లో అధిక శాతం మంది ఆన్‌లైన్ గేమ్ లను ఆడడానికి ఇష్టపడ్డారు. అయితే అధికంగా గ్రాఫిక్స్ కలిగిన పెద్ద పెద్ద గేమ్లను కాకుండా చిన్న చిన్న గేమ్ లను ఆడడానికి ఎంచుకోవడం అనేది కొసమెరుపు. అయితే వీటి యొక్క డేటా ఎలా ఉందొ పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఫాంటసీ గేమింగ్

భారతదేశంలోని ప్రముఖ ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన మొబైల్ ప్రీమియర్ లీగ్ (MPL) తన ఇండియా మొబైల్ గేమింగ్ రిపోర్ట్ 2021 (IMGR)ని ఇటీవల విడుదల చేసింది. ఇండియా యొక్క గేమింగ్ జాగ్రఫీకి సంబంధించిన డేటాను షేర్ చేసింది. షేర్ చేసిన నివేదిక ప్రకారం 2021 సంవత్సరంలో దేశంలో అత్యధిక సంఖ్యలో ఆన్‌లైన్ గేమ్లను ఆడుతున్న వారిలో ఎక్కువ మంది ఢిల్లీ ప్రాంతంలో ఉండడం ప్రత్యేకత. అంతేకాకుండా మొదటి ఐదు జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక మెట్రో నగరం కూడా ఢిల్లీ కావడం మరొక ప్రత్యేకత.

IMGR

IMGR 2021 నివేదిక ప్రకారం ఢిల్లీ నగరం అగ్రస్థానంలో ఉండగా జైపూర్, పూణె, లక్నో మరియు పాట్నా తర్వాతి స్థానాల్లో చోటును దక్కించుకున్నాయి. MPL ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది "పుణె, లక్నో మరియు పాట్నా వంటి నగరాలలో నివసించే వారు 2021లో మొబైల్ గేమ్‌లను అధిక సంఖ్యలో ఆడుతున్న ఆటగాళ్ళను కలిగి ఉండడం గమనార్హం అది కూడా ముంబై, బెంగళూరు మరియు కోల్‌కతా వంటి పెద్ద నగరాలను వెనుకకు నెట్టి". ముంబై, బెంగళూరు మెట్రో నగరాలు ఆరు, ఏడో స్థానాల్లో నిలవగా కోల్‌కతా 12వ స్థానంలో నిలిచింది.

MPL

BGMI మరియు కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ వంటి మరిన్ని భారీ గ్రాఫిక్ PC లేదా మొబైల్ గేమ్‌లు అగ్రస్థానం గేమ్ స్పాట్‌లు తీసుకోవచ్చని మీరు అనుకుంటే పొరపాటు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే క్యారమ్, ఫ్రూట్ డార్ట్, ఫ్రూట్ చాప్, రన్నర్ నంబర్ 1 మరియు బ్లాక్ పజిల్‌లు వంటి చిన్న చిన్న గేమ్ లు అగ్రస్థానంలో నిలిచాయి. నివేదిక ప్రకారం చెస్ మరియు పూల్ కూడా దేశంలో గేమర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. MPL సంవత్సరంలో 1.3 మిలియన్ ఎస్పోర్ట్స్ ప్లేయర్స్ రిజిస్ట్రేషన్‌ను పొందింది. 2021 సంవత్సరంలో 17 మిలియన్ల ప్రత్యక్ష వీక్షకుల సంఖ్యతో దాని ప్లాట్‌ఫారమ్‌లో అర మిలియన్ గేమ్‌లు ఆడినట్లు కూడా పేర్కొంది.

CAGR

ఇతర వార్తల విషయానికి వస్తే కన్సల్టెన్సీ సంస్థ EY తన అంచనాల ప్రకారం ఆన్‌లైన్ గేమింగ్ కోసం భారతీయ దేశీయ మార్కెట్ 2019లో కేవలం $906 మిలియన్ల నుండి 2023లో $2 బిలియన్లకు పెరుగుతుందని సూచిస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. అంటే గేమింగ్ పరిశ్రమ దాదాపు 22 శాతం CAGRని అందిస్తుంది. భారతదేశంలో ఆన్‌లైన్ గేమర్‌లు 2020లో సుమారుగా 360 మిలియన్ల నుండి 2022లో 510 మిలియన్లకు పెరుగుతారని మరియు 85 శాతం వాటాను మొబైల్ గేమర్‌లు ఆక్రమించారని అంచనా వేయబడింది.

Best Mobiles in India

English summary
Do You Know Where Most of The 2021 Online Gamers are Registered in India?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X