ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ ఎందుకు కొనుగోలు చేశారో తెలుసా... కారణం తెలిస్తే నిజంగా షాక్ అవుతారు??
ఎలాన్ మస్క్ (Elon Musk) ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా ఉన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా 2022లో ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. అయితే ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక.. సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్‌ను (Parag Agrawal) ఆ పదవి నుంచి తొలగించారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పరాగ్ అగర్వాల్ తొలగించడానికి గల కారణాలపై అనేక మంది ఆరా తీశారు.
అయితే దీని వెనుక ఆ ఆసక్తికరమైన కారణం ఉందని (Elon Musk Twitter) తెలుస్తోంది. వృత్తిపరమైన కారణం కంటే వ్యక్తిగతమైన కారణమే ఉందని సమాచారం. బ్లూమ్‌బర్గ్‌కు చెందిన కర్ట్ వాగ్నర్ రాసిన "Battle For a Bird" అనే పుస్తకంలో పరాగ్ అగర్వాల్‌ను తొలగించేందుకు గల కారణాలను వెల్లడించారు. ఫిబ్రవరి 20న ఈ పుస్తకం విడుదల కానుంది. ఈ పుస్తకంలో కార్పొరేట్ లో జరుగుతున్న పరిణామాలను గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

ఈ పుస్తకం ఆధారంగా అమెరికన్ ప్రోగ్రామర్ జాక్ స్వీనీ నిర్వహించిన ఎలాన్‌జెట్ (Elonjet) అనే ట్విట్టర్ ఖాతాను నిషేధించాలని.. అప్పటి ట్విట్టర్ సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్‌ను ఎలాన్ మస్క్ కోరారు. అందుకు పరాగ్ నిరాకరించారు. దీంతో తొలుత ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా చేసేందుకు ప్రయత్నించిన మస్క్ అనంతరం ఏకంగా ట్విట్టర్ సంస్థనే కొనుగోలు చేశారు.
మస్క్ కార్యక్రమాలను ట్రాకింగ్ చేస్తున్న అమెరికన్ ప్రోగ్రామర్ జాక్ స్వీనీకి.. ట్రాకింగ్‌ను నిలిపేసేందుకు ఎలాన్ మస్క్ తొలుత $5000 అమెరికన్ డాలర్లు ఇచ్చేందుకు ముందుకొచ్చారని ఓ నివేదిక చెబుతోంది. అయితే అతను మాత్రం $50,000 లేదా ఇంటర్న్‌షిప్ ఇవ్వాలని కోరాడు. దీనికి నిరాకరించిన ఎలాన్ మస్క్.. చెల్లింపునకు బదులుగా Elonjet అనే ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

Elonjet ట్విట్టర్ ఖాతాను తొలగించేందుకు నాడు సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్ నిరాకరించడంతో తొలుత.. ట్విట్టర్‌లో షేర్లను కొనుగోలు చేసి, బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో చేరేందుకు మస్క్ ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలం కావడంతో ఎలాన్ మస్క్ 2022 అక్టోబర్‌లో ఏకంగా $44 మిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు.
పరాగ్‌ను తొలగించడం సహా ట్విట్టర్‌ను యాజమాన్యంలో మార్పుల గురించి ఎలాన్ మస్క్ నాడే షరతులు విధించినట్లు సమాచారం. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన అనంతరం.. సంస్థకు మరింత మెరుగైన నాయకత్వం అవసరం అనే కారణంతో పరాగ్ అగర్వాల్‌ను ఎలాన్ మస్క్ తొలగించారు.

అయితే అనంతరం తన రెండేళ్ల కుమారుడు ప్రయాణిస్తున్న వాహనాన్ని టార్గెట్ చేశాడనే ఆరోపణలతో Elonjet ట్విట్టర్ ఖాతాను ఎలాన్ మస్క్ నిషేధించారు. దాంతోపాటు స్వినీ మరియు అతని సహాయకంగా ఉన్న సంస్థలపై ట్విట్టర్ ద్వారా చట్టపరమైన చర్యలను ఎలాన్ మస్క్ ప్రకటించాడు. ఇటీవల ప్రసిద్ధ సంగీతకారుడు టేలర్ స్విఫ్ట్ యొక్క జెట్ కార్యకలాపాలను ట్రాకింగ్ ఆరోపణలపై స్వీని మరోసారి తెరపైకి వచ్చారు.
ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక ఎలాన్ మస్క్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్‌ను సహా అనేక మంది ఉద్యోగులను తొలగించారు. అనంతరం కీలక మార్పులు చేశారు. వెరిఫైడ్ అకౌంట్ కోసం ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను తీసుకొచ్చారు. ఆపై ట్విట్టర్ లోగోను మార్పు చేశారు. అనంతరం ఏకంగా ట్విట్టర్ పేరును X గా మార్పు చేశారు. క్రమంగా ట్విట్టర్‌ను ప్రీమియం వెర్షన్‌గా మార్చేందుకు అడుగులు వేస్తున్నారు.
ప్రస్తుతం (X) ట్విట్టర్ ను ఎవ్రీథింగ్ యాప్‌గా మార్చేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం కీలక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గత అక్టోబర్‌లో X ప్లాట్‌ఫాం లాంచ్ చేసిన కాలింగ్ ఫీచర్‌ను ప్రమోట్ చేసేందుకు ఎలాన్ మస్క్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది.
తాను కొన్ని రోజుల్లో ఫోన్ నంబర్‌ను నిలిపేస్తారని, X ప్లాట్‌ఫాం కాలింగ్ ఫీచర్ ద్వారా మాత్రమే మెసెజ్, ఆడియో/ వీడియో కాల్స్ మాట్లాడతానని తెలిపారు. X కాలింగ్ ఫీచర్‌ను మరింతగా ప్రమోట్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రీమియం సబ్‌స్కైబర్లు మాత్రమే ఈ కాలింగ్ ఫీచర్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. సాధారణ వినియోగదారులు కేవలం కాల్స్‌ను స్వీకరించేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది.


Click it and Unblock the Notifications








