Home
News

ఇతర నెట్‌వర్క్‌ నుంచి BSNL కు పోర్టింగ్‌ ప్లాన్ చేస్తున్నారా... అయితే ఈ వెబ్‌సైట్ మీకు ఉపయోగపడుతుంది..!!

ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా ఈ నెల తొలివారంలో మొబైల్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ల ధరలను భారీగా పెంచాయి. దీంతో అనేక మంది మొబైల్‌ వినియోగదారులు తక్కువ ధరకే సేవలు అందిస్తున్న BSNL (భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌) నెట్‌వర్క్‌కు పోర్టింగ్‌ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇదే పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చేందుకు BSNL కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 4G నెట్‌వర్క్‌ విస్తరణను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 4G టవర్ల ఏర్పాటును ముమ్మరం చేసింది.

గతవారంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 1000 టవర్లను ఏర్పాటు చేసినట్లు BSNL వెల్లడించింది. లక్షకు పైగా టవర్లను ఏర్పాటు చేయాలని టార్గెట్‌ పెట్టుకున్న సంస్థ ఇప్పటి వరకు 12 వేల టవర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటికే పంజాబ్‌లో 4G సర్వీసులను పరీక్షించిన BSNL.. ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

You can track BSNL network tower with  tarang sanchar website

ఇప్పటికే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 4G సర్వీసులను ప్రారంభించనుంది. ఈ టెక్నాలజీ కోసం TCS తో BSNL ఒప్పందం కుదుర్చుకుంది. BSNL నెట్‌వర్క్‌ను కూడా TCS నిర్వహించనుంది. దీంతోపాటు కేంద్రం ఇప్పటికే ప్రకటించిన రిలీఫ్‌ ప్యాకేజీ ద్వారా BSNL కోసం స్పెక్ట్రమ్‌ రిజర్వ్‌ చేయబడింది. పూర్తి గ్రామీణ ప్రాంతాలు సహా ఇప్పటికీ ఇంటర్నెట్‌ సౌకర్యం లేని ప్రాంతాల‌కూ నెట్‌వర్క్‌ను విస్తరించాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ భావిస్తోంది.

BSNL 4G సర్వీసులపై కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జోతిరాదిత్య సింధియా కీలక వ్యాఖ్యలు చేశారు. 4G సర్వీసుల రోజువారీ పర్యవేక్షణకు ప్రత్యేక యూనిట్‌ ను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. సంస్థ రోజువారీ లక్ష్యాలను నిత్యం పర్యేవేక్షిస్తామని స్పష్టం చేశారు. దీంతోపాటు BSNL కు పోర్టింగ్‌ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్న వినియోగదారులు తమకు సమీపంలో ఉన్న టవర్ల సిగ్నల్‌ స్థితిని తెలుసుకోవచ్చు.

మీ సమీపంలోని BSNL టవర్లు 2G/3G/4G లేదా 5G కి సంబంధించిన స్థితిని తెలుసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన వెబ్‌సైట్ అందుబాటులో ఉంది. http://tarangsanchar.gov.in.emfportal వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం కిందకు స్క్రోల్‌ చేసి My Location పైన క్లిక్‌ చేయాలి. తర్వాత పేరు, ఈ మెయిల్‌, మొబైల్ నంబర్‌, Captcha ను ఎంటర్‌ చేయాలి.

అనంతరం Send me a mail with OTP అనే ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి. అంటే మీ మెయిల్‌ ఐడీకి OTP పంపమని కోరాలి. తర్వాత OTP ను ఎంటర్‌ చేయాలి. అనంతరం మీ సమీపంలోని నెట్‌వర్క్‌ టవర్ల మ్యాప్‌ కనిపిస్తుంది. ఏదైనా టవర్‌ పై క్లిక్‌ చేసి వాటి స్థితిని తెలుసుకోవచ్చు. అనంతరం మీరు నిర్ణయం తీసుకోవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Do you Plans to port to BSNL then you can track tower near to your location with tarang sanchar website
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X