Home
News

Zoho Mail జీమెయిల్‌ నుంచి జోహో మెయిల్‌కు మారాలని భావిస్తున్నారా..?

వాట్సాప్‌నకు పోటీగా చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న జోహో కార్పొరేషన్‌ (Zoho Corporation) తీసుకొచ్చిన మేడ్‌ ఇన్‌ ఇండియా యాప్‌ అరట్టై (Arattai App) భారత్‌ లో కొన్ని రోజులుగా ట్రెండింగ్‌ లో ఉంది. వాట్సాప్‌ తరహాలోనే.. అరట్టై యాప్‌ లోనూ చాట్‌, వాయిస్‌, వీడియో కాలింగ్, డాక్యుమెంట్‌ షేరింగ్‌, స్టేటస్‌, ఛానళ్లు సహా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు పాకెట్‌ అనేక ప్రత్యేక ఫీచర్‌ కూడా ఉంది.

ప్రస్తుతానికి వాయిస్‌, వీడియో కాలింగ్‌ కు మాత్రమే ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఉంది. మెసేజ్‌ లకు కూడా త్వరలో ఎం‌డ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్ సపోర్టును అందిస్తామని జోహో చెబుతోంది. అధిక ప్రాధాన్యతతో దీనిపై పనిచేస్తున్నామని తెలిపింది. మేడ్‌ ఇన్‌ ఇండియా యాప్‌ కావడం, ప్రభుత్వ వర్గాల నుంచి సపోర్టు, డేటా పాలసీ యూజర్లను ఆకట్టుకుంటోంది.

Do you plans to switch from gmail to zoho mail here is the guide

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా కీలక ప్రకటన :
అయితే జోహో కార్పొరేషన్‌ అరట్టై యాప్‌తోపాటు మెయిల్‌ సర్వీసులను కూడా అందిస్తోంది. ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. తాను జీమెయిల్ నుంచి జోహో మెయిల్‌ కు (Zoho Mail) మారినట్లు చెప్పారు. X వేదికగా ఇందుకు సంబంధించిన పోస్ట్‌ చేశారు.

అయితే జీమెయిల్‌ నుంచి జోహో మెయిల్‌కు ఎలా మారాలి :
> జోహో అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్లి, జోహో మెయిల్‌ ను క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిల్‌ క్రియేట్‌ చేసుకొనే సమయంలో అక్కడ ఫ్రీ, పెయిడ్‌ వెర్షన్ అనే రెండు రకాల ఆప్షన్‌ లు ఉంటాయి.
> మీ ఇ-మెయిల్‌లను కొత్తగా క్రియేట్‌ చేసిన జోహో మెయిల్‌కు బదిలీ చేసేందుకు, జీమెయిల్‌ సెట్టింగ్స్‌లో IMAP అనే ఫీచర్‌ ఉంటుంది.

> ఈ ఫీచర్‌ ద్వారా మీ కాంటాక్ట్స్‌, ఫోల్డర్‌లను సురక్షితంగా జోహో మెయిల్‌ కు బదిలీ చేసుకోవచ్చు. మైగ్రేషన్‌ విజార్డ్ మరింత డేటాను బదిలీ చేసుకోవచ్చు. జీమెయిల్‌ ఫార్వడింగ్‌ ఫీచర్‌ ను జోహో మెయిల్‌ కు కొత్త మెయిల్స్‌ ను పొందవచ్చు. అధిక డేటా ఉంటే మాత్రం బదిలీకి ఎక్కువ సమయం పడుతుంది.

జోహో మెయిల్ ప్రత్యేకతలు :
> ప్రస్తుతం జీమెయిల్‌ ద్వారా తక్కువ స్టోరేజీ కలిగిన డాక్యుమెంట్స్, ఫైల్స్‌ మాత్రమే పంపేందుకు వీలుంది. జోహో మెయిల్‌ ద్వారా 1GB వరకు ఫైల్స్‌ ను షేర్‌ చేసుకోవచ్చు.
> జోహో మెయిల్‌ లో స్ట్రీమ్‌ ట్యాబ్‌ ఉంటుంది. అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. జోహో మెయిల్‌ తో సహా జోహో కార్పొరేషన్‌కు సంబంధించిన ఏ ప్లాట్‌ఫాం కూడా మీ వ్యక్తిగత డేటాను ఎక్కడా ఉపయోగించదు.

కోటికి పైగా డౌన్‌లోడ్స్‌తో :
వాట్సాప్‌నకు పోటీగా తీసుకొచ్చిన అరట్టై యాప్‌నకు భారీగా స్పందన వస్తోంది. గూగుల్‌ ప్లేస్టోర్‌లో సుమారు కోటికి పైగా డౌన్‌లోడ్స్‌ తో దూసుకెళ్తోంది. ప్రస్తుతం గూగుల్‌ ప్లేస్టోర్‌ టాప్‌ ఫ్రీ యాప్స్‌ జాబితాలో 4.8 శాతం రేటింగ్‌ని కలిగి ఉంది. అదే సమయంలో ఆపిల్ యాప్‌ స్టోర్‌లో సోషల్ నెట్‌వర్కింగ్ విభాగంలో నంబర్‌ 1 స్థానంలో నిలిచింది.

More from GizBot

Best Mobiles in India

English summary
Do you plans to switch from gmail to zoho mail here is the guide in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X