అ అంటే 'అమ్మ' నుంచి .... అ అంటే 'అమెరికా' అనే స్థాయిలో తెలుగు వృద్ధి

|

అతి ప్రాచీనకాలంనాటి నుంచి ఇప్పటికీ వాడుకలో వుంటూ, వ్యావహారిక భాషగా, సాహిత్యంగా అప్రతిహతంగా మనుగడ సాగిస్తున్న ఏకైక భాష బహుశా తెలుగేనేమో! అందుకే కాబోలు అమెరికాలో తెలుగు మాట్లాడేవాళ్ల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. అమెరికాలో తెలుగు మాట్లాడేవారు 2010-2017 మధ్య 86 శాతం పెరిగినట్టు ఆన్‌లైన్లో ఉన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వీడియో చెబుతోంది.సెన్సస్‌ గణాంకాలను సేకరించే అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ ఇమిగ్రేషన్‌ సంస్థ యూఎస్‌లో మాట్లాడే భాషలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2010-17 కాలంలో ఇంగ్లిష్‌ మినహా అక్కడి ఇళ్ళల్లో మాట్లాడే భాషపై ఈ అధ్యయనం చేశారని బీబీసీ తెలిపింది. 2017లో యూఎస్‌లో 4 లక్షలకు పైగా తెలుగు మాట్లాడేవారున్నారు. ఈ సంఖ్య 2010నాటితో పోల్చితే రెట్టింపు. అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న టాప్‌-10 భాషల్లో ఏడు సౌత్ ఆసియా వి కావడం విశేషం.

 

సామ్‌సంగ్ నుంచి ఇన్‌డిస్‌ప్లే ఫ్రంట్ కెమెరా ఫోన్..?

తెలుగుమాట్లాడేవారి సంఖ్య పెరగడానికి కారణం?

తెలుగుమాట్లాడేవారి సంఖ్య పెరగడానికి కారణం?

ఇంత వేగంగా తెలుగుమాట్లాడేవారి సంఖ్య పెరగడానికి 1990లలో యూఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లకు ఏర్పడిన డిమాండే కారణమని ‘తెలుగు పీపుల్‌ ఫౌండేషన్‌' స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు ప్రసాద్‌ కూనిశెట్టి చెప్పారు.అమెరికాలో ఉన్న వారిలో చాలా మంది హైదరాబాద్ నుంచి వచ్చిన వారే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పుడు 800కు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉండడంతో అమెరికాకు వస్తున్న తెలుగు ఐటీ నిపుణుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది.టెక్నాలజీ, ఇంజనీరింగ్ పరిశ్రమకు హైదరాబాద్ భారతదేశంలోనే ఒక మేజర్ హబ్‌గా మారింది. అమెరికాకు భారీగా ఐటీ నిపుణులను అందిస్తోంది.తెలుగు మాట్లాడే అమెరికన్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఐటీ నిపుణులను తమ సంస్థల్లో నియమించుకోవడం కూడా గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది.

32 కోట్ల జనాభాలో 6 కోట్ల మంది ఇంగ్లీషేతర భాషలు మాట్లాడుతున్నారు.....

32 కోట్ల జనాభాలో 6 కోట్ల మంది ఇంగ్లీషేతర భాషలు మాట్లాడుతున్నారు.....

అమెరికాలోని 32 కోట్ల జనాభాలో 6 కోట్ల మంది ఇంగ్లీషేతర భాషలు మాట్లాడుతున్నారు.అందులో అధికంగా స్పాని ష్‌ మాట్లాడే వాళ్లున్నారు. యూఎస్‌లో భారతీ య భాషల్లో హిందీ మాట్లాడుతున్నవారు టాప్‌లో ఉంటే తర్వాతి స్థానాన్ని గుజరాతీ చేజిక్కించుకుంది. బెంగాలీ భాషను తెలుగు అధిగమించింది. అయితే, తెలుగు కంటే తమిళం మాట్లాడే వారు అమెరికా అంతటా ఉన్నారని ఈ అధ్యయనంలో తేలింది.

అమెరికాలో ఉంటున్న తెలుగు మాట్లాడేవారిలో....
 

అమెరికాలో ఉంటున్న తెలుగు మాట్లాడేవారిలో....

అమెరికాలోని ఇలినాయీస్‌ స్టేట్, న్యూయార్క్, వాషింగ్టన్, ఓరెగాన్, కాలిఫోర్నియా, పెన్సిల్వేనియాల్లో తెలుగువారు ఎక్కువ. అమెరికాలో ఉంటున్న తెలుగు మాట్లాడేవారిలో మొదటి ఇండియన్-అమెరికన్ మిస్ అమెరికా నీనా దావులూరి, ప్రస్తుత మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల లాంటి ప్రముఖులు కూడా ఉన్నారు.

2000వ సంవత్సరంలో  తెలుగు మాట్లాడేవాళ్ల సంఖ్య 87,543 ఉండగా....

2000వ సంవత్సరంలో తెలుగు మాట్లాడేవాళ్ల సంఖ్య 87,543 ఉండగా....

అమెరికాలో తెలుగు మాట్లాడేవాళ్ల సంఖ్య 2000వ సంవత్సరంలో 87,543 ఉండగా 2010లో ఆ సంఖ్య 2,22,977 వరకు పెరిగింది. 2017లో ఈ సంఖ్య 4,15,414. ఏడేళ్లలో 86 శాతం పెరిగింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Do you speak Telugu? Welcome to America.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X