టాటా డొకోమో ఫ్రీ రోమింగ్ ప్లాన్!

Posted By: Staff

టాటా డొకోమో ఫ్రీ రోమింగ్ ప్లాన్!

 

హైదరాబాద్: టాటా డొకోమో టెలిసర్వీసెస్ కంపెనీ తన జిఎస్‌ఎం, సిడిఎంఏ వినియోగదారుల కోసం సరికొత్త ‘రోమ్ ఫ్రీ’ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ టారిఫ్ సౌలభ్యతతో యూజర్ రూ.46తో రీచార్జ్ చేయించుకుని దేశంలో ఎక్కడినుంచైనా ఫ్రీ ఇన్‌కమింగ్ రోమింగ్ సౌకర్యాన్ని పొందవచ్చు. అవుట్ గోయింగ్ కాల్స్‌కు సెకనుకు 1.2పైసలు ఛార్జ్ చెయ్యబడుతుంది. ప్రిపెయిడ్ కస్టమర్లు ఎక్కువగా వివిధ ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుందని ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రామకృష్ణ వెల్లడించారు. యాక్టివేషన్ చేసుకున్న తర్వాత రెండు నెలల పాటు ఈ సౌకర్యం చెల్లుబాటులో ఉంటుంది.

టాటా డొకొమో స్పెషల్ ప్యాక్.. ‘20 గంటల ఫ్రీ కాలింగ్’!!

టెలికాం ప్రొవైడర్ టాటా డొకొమా ఆంధ్రా ప్రీపెయిడ్ కస్లమర్లు కోసం 20గంటల అపరిమిత కాల్ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. డొకొమా రూ.123 విలువ గల రీఛార్జ్ పై రోజుకు 20 గంటల పాటు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ వాలిడిటీ 30 రోజులు. ఈ రీఛార్జ్ పై స్థానిక టాటా డొకొమో సీడీఎంఏ, జీఎస్‌ఎం, వర్జిన్ మొబైల్, టీ24 కస్టమర్లు రాత్రి 10 నుంచి మరసటి రోజు సాయంత్రం 6 వరకు ఇదే నెట్‌వర్క్‌లో ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 మధ్య చేసే కాల్స్‌కు 6 సెకన్లకు ఒక పైసా మాత్రమే చార్జీ చేస్తారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot