సముద్రంలో పడిపోయిన ఐఫోన్‌ను తిరిగి తెచ్చింది

Posted By:

సముద్రం అడుగు భాగంలో పడిపోయిన ఐఫోన్‌ను ఓ డాల్ఫిన్ చాకిచక్యంగా వెతికి పట్టుకొచ్చిన ఘటన బహమాస్‌లో చోటుచేసుకుంది.

 సముద్రంలో పడిపోయిన ఐఫోన్‌ను తిరిగి తెచ్చింది

అట్లాంటిక్ సముద్రం మధ్య భాగంలోని బహమాస్ ప్రాంతంలో మయామి హీట్ డ్యాన్సర్ తెరిస్సా‌ కీ ఫోటోషాట్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ సందర్భంగా తన ఐఫోన్‌ను భద్రంగా పట్టుకోమని తన మిత్రురాలికి ఇవ్వబోయింది. ఫోన్‌ను అందుకునే క్రమంలో ఆమె బ్యాలన్స్ కోల్పొవటంతో ఫోన్ నీటిలో పడిపోయింది.

Read More : Google.comను రూ.785కు కొనేసాడు..!

ఇంతలో అక్కడే ఉన్న క్యాసిక్యూ అనే డాల్ఫిన్ సముద్రం అడుగు భాగంలోకి వెళ్లి ఆ ఐఫోన్ వెతికి పట్టుకొచ్చి పడేసుకున్న వ్యక్తి చేతికి ఇచ్చింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండ పోయాయి. ఈ మొత్తం తతంగాన్ని అక్కడే ఉన్నఓ మిత్రుడు రికార్డ్ చేయటంతో ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కెర్లు కొడుతోంది. వివిధ విన్యాసాలను ప్రదర్శించటంలో ఆరితేరిన ఆ డాల్ఫిన్ గ్రాండ్ బహామా ఐలాండ్ వారిది కావటం విశేషం.

English summary
Dolphin retrieves iPhone after she drops it into the ocean. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot