ఆండ్రాయిడ్ లాలీపాప్ కోసం ఎదురుచూస్తున్నారా..?

Posted By:

ఆండ్రాయిడ్ లాలీపాప్ కోసం ఎదురుచూస్తున్నారా..?

గూగుల్ లేటెస్ట్ వర్షన్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ‘ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్' కు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకున్న విషయం తెలిసిందే. ఈ యూజర్ ఫ్రెండ్లీ ఓఎస్ కోసం అనేక మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గూగుల్ నెక్సస్ ఫోన్‌లతో అధికారికంగా లభ్యమవుతోన్న ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఓఎస్ పలు సామ్‌సంగ్, సోనీ, మోటరోలా తదితర ఫోన్‌లకు అప్‌డేట్‌ల రూపంలో త్వరలో అందనుంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఆండ్రాయిడ్ లాలీపాప్ కోసం ఎదురుచూస్తున్నారా..?

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం కోసం ఎదురుచూస్తున్న వారిలో మీరు కూడా ఒకరైనట్లయితే మీ కోసం ఓ అత్యుత్తమ ఆండ్రాయిడ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా సిద్ధంగా ఉంది. ఈ యాప్ మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ను లాలీపాప్ హంగులతో తీర్చిదిద్దుతుంది.

ఆండ్రాయిడ్ లాలీపాప్ కోసం ఎదురుచూస్తున్నారా..?

ఆండ్రాయిడ్ డెవలపర్స్ ఎల్ఎల్ యాప్ గ్రూప్ తాజాగా తమ యూప్‌ను ఎల్ లాంచర్‌కు అప్‌డేట్ చేసింది. వివిధ ఆప్షన్‌లతో లభ్యమవుతోన్న ఈ యాప్ మీ ఆండ్రాయిడ్ 4.0 ఆపై వర్షన్ ఫోన్‌లకు ఆండ్రాయిడ్ లాలీపాప్ లుక్‌ను తీసుకువస్తుంది.

ఆండ్రాయిడ్ లాలీపాప్ కోసం ఎదురుచూస్తున్నారా..?

గూగుల్ ప్లేస్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న ఈ యాప్‌ను ఏ విధమైన రూట్ యాక్సెస్ లేకుండా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఎల్ లాంచర్ డౌన్‌లోడ్ లింక్.

English summary
Don’t wait for Android 5.0, this app makes your phone look like Lollipop for free. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot