ఆపిల్‌కు అమెరికా సెగ తగిలింది

Written By:

ఆపిల్ ఎఫ్ బిఐ అధికారులకు సహకరించకపోవడంపై అమెరికాలో అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దిగ్గజ ఆపిల్ కంపెనీపై విరుచుకుపడ్డారు. కంపెనీ ఉత్పత్తులన్నింటీని బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. కనీసం అలాంటి సమాచారం ఇచ్చేవరకు యాపిల్‌ సంస్థ ఉత్పత్తులకు దూరంగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు.

ఆపిల్‌కు అమెరికా సెగ తగిలింది

ప్రస్తుతం రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న ట్రంప్ సౌత్ కరోలినాలోని పాలేస్ ఐలాండ్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నవంబర్ 8న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.

ఆపిల్‌కు అమెరికా సెగ తగిలింది

కాలిఫోర్నియాలో కాల్పుల ఘటన దర్యాప్తులో భాగంగా ఫరుఖ్ ఐఫోన్‌ ను అన్‌లాక్‌ చేసి.. అందులోని వివరాలు తెలుసుకునేందుకు వీలు కల్పించాలని యాపిల్ కంపెనీపై అమెరికా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది.

Read more: అమెరికా నుంచి హైదరాబాద్‌కు ఆపిల్ కంపెనీ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కాల్పులకు తెగబడిన ఘటనలో

గత సంవత్సరం క్యాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో లో సయీద్ రిజ్వాన్ ఫారుఖ్ అనే వ్యక్తి కాల్పులకు తెగబడిన ఘటనలో 14 మంది మృతిచెందారు.

 

 

మొబైల్ ఫోన్ ను అన్ లాక్ చేయాలని

అయితే, సయిద్ రిజ్వాన్ ఫారుఖ్ కు సంబంధించిన మొబైల్ ఫోన్ ను అన్ లాక్ చేయాలని.. తద్వారా అతని మొబైల్ లో ఉన్న సమాచారాన్ని తెలుసుకొని ఈ కేసుకు సహకరించాలని ఎఫ్ బీఐ ఆపిల్ సంస్థను కోరింది.

 

 

ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి ఎఫ్‌బీఐ దర్యాప్తు అధికారులకు

ఫోన్‌ను అన్‌లాక్‌ చేసి ఎఫ్‌బీఐ దర్యాప్తు అధికారులకు సహకరించాలని అమెరికాలోని ఓ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఆపిల్ సీఈఓ దీనిపై స్పందించారు.

 

 

యూఎస్‌ ప్రభుత్వం ఓ అసాధారణమైన పని చేసి

యూఎస్‌ ప్రభుత్వం ఓ అసాధారణమైన పని చేసి ఎఫ్‌బీఐకి సహకరించాలని కోరుతోంది. దీనివల్ల మా కస్టమర్ల భద్రత చిక్కుల్లో పడుతుంది. దీనిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తామ'ని చెప్పారు.

 

 

ఇది భద్రతకు సంబంధించిన విషయం అని

ఇది భద్రతకు సంబంధించిన విషయం అని, మొబైల్ ఫోన్ ను తాము అన్ లాక్ చేస్తే.. అది తమ వినియోగదారుల భద్రత చిక్కుల్లో పడుతుందని ఆ సంస్థ సిఈవో టిమ్ కుక్ పేర్కొన్నారు.

 

 

2014లో వచ్చిన ఆపిల్ మొబైల్ లో అడ్వాన్సు టెక్నాలజీ

అంతే కాకుండా 2014లో వచ్చిన ఆపిల్ మొబైల్ లో అడ్వాన్సు టెక్నాలజీ వాడామని, అందులో డిఫాల్ట్ ఆటో ఎన్ క్రిప్షన్ ఆన్ చేసి ఉంటే సమాచారాన్ని నేరుగా భద్రపరుచుకోవచ్చని.. భద్రపరుచుకున్న సమాచారం గురించి తెలుసుకోవాలి అనుకుంటే.. ఖచ్చితంగా కోడ్ తెలిసుండాలని ఆపిల్ సంస్థ చెప్తున్నది.

 

 

ఒకవేళ కోడ్ ను కనుక 10సార్లు తప్పుగా ఎంటర్ చేస్తే

ఒకవేళ కోడ్ ను కనుక 10సార్లు తప్పుగా ఎంటర్ చేస్తే.. సమాచారం మొత్తం డిలీట్ అవుతుందని.. ఇక దానిని తెరవడం తమ తెచ్నికల్ సిబ్బందికి కూడా సాధ్యం కాదని ఆపిల్ సంస్థ చెప్తున్నది.

 

 

ఫారుఖ్ ఫోన్ లో ఎన్నిసార్లు తప్పు కోడ్ ఎంట్రీ చేసినా

ఫారుఖ్ ఫోన్ లో ఎన్నిసార్లు తప్పు కోడ్ ఎంట్రీ చేసినా సమాచారం పోకుండా ఉండే విధంగా చేయాలని ఆపిల్ సంస్థను ఎఫ్ బీఐ కోరింది. ఇది అసాధారణమైన పని అని ఆపిల్ చెప్తున్నది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Donald Trump Calls For Boycott Until Apple Unlocks Shooter's Phone
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot