చైనాను వదిలేసి అమెరికాకి రా,ఆపిల్‌కు ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్

టెక్ ప్రపంచంలో దూసుకుపోతున్న అమెరికా దిగ్గజం ఆపిల్ కంపెనీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు.

|

టెక్ ప్రపంచంలో దూసుకుపోతున్న అమెరికా దిగ్గజం ఆపిల్ కంపెనీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ఆపిల్‌ కంపెనీ ఐఫోన్లతో సహా తన ఉత్పత్తుల తయారీని చైనా నుంచి అమెరికాకు తరలించాలని కోరారు. చైనాపై తన ప్రభుత్వం ప్రారంభించిన వాణిజ్య యుద్ధ పర్యవసానాలు తట్టుకోవాలంటే ఇదొక్కటే మార్గమన్నారు. చైనా ఉత్పత్తులపై మనం విధిస్తున్న భారీ సుంకాలతో ఆపిల్‌ ఉత్పత్తుల ధర పెరగొచ్చు. ఆ కంపెనీ తన ఉత్పత్తుల తయారీని అమెరికాకు తరలించడం ఒక్కటే ఇందుకు పరిష్కారం. కంపెనీ ముందుకు వస్తే పన్నుల ప్రోత్సాహంతోపాటు ఎలాంటి పన్నుల భారం విధించమని ట్వీట్‌ చేశారు.

అలీబాబా అధినేత నుంచి షాకింగ్ న్యూస్, బిల్ గేట్స్ బాటలో..అలీబాబా అధినేత నుంచి షాకింగ్ న్యూస్, బిల్ గేట్స్ బాటలో..

సబ్సిడీలను నిలిపివేయాలని..

సబ్సిడీలను నిలిపివేయాలని..

భారత్, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అమెరికా ఇస్తున్న సబ్సిడీలను నిలిపివేయాలని, అమెరికా కూడా అభివృద్ధి చెందుతున్న దేశమేనని, అందరికన్నా వేగంగా అభివృద్ధి చెందాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

ఇదంతా పిచ్చి పని..

ఇదంతా పిచ్చి పని..

అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పుకుంటూ భారత్, చైనా సబ్సిడీలు పొందుతున్నాయి. మనం వాటికి డబ్బు చెల్లిస్తున్నాం. ఇదంతా పిచ్చి పని. ఆ సబ్సిడీలను నిలిపివేయాలని ఉత్తర డకోటాలో జరిగిన ఒక కార్యక్రమంలో పిలుపునిచ్చారు.

ప్రపంచ ఆర్థిక శక్తిగా చైనా ఎదిగేందుకు ..

ప్రపంచ ఆర్థిక శక్తిగా చైనా ఎదిగేందుకు ..

డబ్ల్యూటీవో అత్యంత పనికిమాలిన సంస్థ అని ట్రంప్ అభివర్ణించారు. ప్రపంచ ఆర్థిక శక్తిగా చైనా ఎదిగేందుకు డబ్యూటీవో దోహదపడిన విషయం చాలామందికి తెలియదన్నారు.

50వేల కోట్ల డాలర్లు తీసుకొని..
 

50వేల కోట్ల డాలర్లు తీసుకొని..

తాను చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు పెద్ద అభిమానినని, అమెరికా నుంచి వారు 50వేల కోట్ల డాలర్లు తీసుకొని అభివృద్ధి చెందడాన్ని అనుమతించరాదని అన్నారు.

భద్రత కల్పిస్తున్నందుకు గాను..

భద్రత కల్పిస్తున్నందుకు గాను..

ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలకు వెలుపలి నుంచి తాము భద్రత కల్పిస్తున్నందుకు గాను అవి రుసుము చెల్లించాలని చెప్పారు.

సొంత ఖర్చులతో..

సొంత ఖర్చులతో..

సొంత ఖర్చులతో ప్రపంచమంతటా తాము కాపలా కాస్తుండగా, అభివృద్ధి చెందిన దేశాలు మాత్రం ఆ ఫలాలను అనుభవిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

Best Mobiles in India

English summary
Shift manufacturing from China to US to avoid trade war: Trump tells Apple more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X