Home
News

డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు, నెటిజన్ల చేత పెట్టించుకున్నారు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఎప్పుడేం మాట్లాడతారో ఏమని ట్వీట్‌ చేస్తారో ఆయనకే తెలీదనే విషయం గత కొంత కాలంగా ఆయన చేస్తున్న ట్వీట్లను చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్లు నెటిజన్ల చేతికి చిక్కడంతో అమెరికా అధ్యక్షుడిని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. విషయంలోకి వెళ్తే ..చంద్రుడిపైకి మరోసారి మనిషిని పంపేందుకుగాను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) సమాయత్తమవుతోంది. 2024 నాటికి వ్యోమగాములను చంద్రుడిపైకి పంపడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు, నెటిజన్ల చేత పెట్టించుకున్నారు

oneplus 7 Pro Gallery

ఇందుకు సంబంధించిన స్పేస్‌ పాలసీ డైరెక్టివ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతేడాది సంతకం చేశారు కూడా. ఈ మేరకు.. తన హయాంలో మరోసారి చంద్రయాత్ర చేపట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ.. నాసాను ప్రశంసిస్తూ ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. అంతవరకు బాగానే ఉంది. ఆయన మళ్లీ చేసిన ట్వీటే ఆయన పీకల మీదకు వచ్చింది.

ట్రంప్‌ మరో ట్వీట్

ట్రంప్‌ మరో ట్వీట్

ఈ ట్వీట్ తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరో ట్వీట్ చేశారు. ‘ మనం ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాం. అయితే నాసా ఇప్పుడు మాట్లాడాల్సింది చంద్రుడిపైకి వెళ్లే విషయం గురించి కాదు. ఇది 50 ఏళ్ల క్రితమే జరిగింది కదా. వారు దృష్టి పెట్టాల్సిన పెద్ద పెద్ద అంశాలెన్నో ఉన్నాయి. మార్స్‌(ఇందులో చంద్రుడు కూడా భాగం), రక్షణ వ్యవస్థ, సైన్స్‌ ఇందులో ముఖ్యమైనవని ట్రంప్‌ తన తాజా ట్వీట్‌లో నాసాను విమర్శించారు.

 ఆయనపై విమర్శలు

ఆయనపై విమర్శలు

ఈ క్రమంలో ట్రంప్‌ రెండు ట్వీట్లను పోల్చి చూస్తున్న నెటిజన్లు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా చంద్రుడు.. అంగారకుడిలో భాగమంటూ ట్రంప్‌ పేర్కొనడంపై జోకులు పేలుస్తున్నారు. ఈరోజు నుంచి అందరూ గుర్తుపెట్టుకోండి. మూన్‌.. మార్స్‌లో భాగమట. ట్రంప్‌ చెప్పారు' మీరు గ్రేట్ సర్ అంటూ వ్యంగోక్తులు విసురుతున్నారు.

 మనిషిని చంద్రుడి మీదకు పంపేందుకు ..

మనిషిని చంద్రుడి మీదకు పంపేందుకు ..

1968లో అపోలో-11 మిషన్ ద్వారా వ్యోమగాములు నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్, మైకేల్‌ కొల్లిన్స్, ఎడ్విన్‌ ఇ అల్డ్రిన్‌లను నాసా చంద్రుడిపైకి పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 1969 జూలై 20న చంద్రుడి మీద మనిషి కాలు మోపాడు. అయితే తాజాగా మళ్లీ మనిషిని చంద్రుడి మీదకు పంపేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మిషన్‌కి ఆర్టెమిస్‌( గ్రీకు చంద్రదేవత) అని పేరు పెట్టారు. ఈసారి చంద్రయాత్రలో మహిళా వ్యోమగాములకు కూడా అవకాశం కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది నాసా.

 చంద్రుడిపై పరిశోధనలకే..

చంద్రుడిపై పరిశోధనలకే..

అంతరిక్ష పరిశోధనలకు కోట్ల కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నాం. అవన్నీ చంద్రుడిపై పరిశోధనలకే నాసా ఎందుకు ఖర్చు చేస్తోంది ? 50 ఏళ్ల క్రితమే మనం చంద్రుడిపై కాలు పెట్టాం కదా. రక్షణ, సైన్స్‌ రంగాల్లో ఇంకా అతి పెద్ద లక్ష్యాలను సాధించాలి. అంగారకుడిపై అధ్యయనం చేయాలి (చంద్రుడు కూడా అంగారకుడిలో భాగమే కదా)' అని ట్వీట్‌ చేశారు.

 చంద్రుడు భూమికి ఉపగ్రహమని..

చంద్రుడు భూమికి ఉపగ్రహమని..

ఈ ట్వీట్‌ ఒక వైరల్‌గా మారింది. జోకులు, మెమెలు, వెటకారాలు, వెక్కిరింపులు ఒకటేమిటి నెటిజన్లు ట్రంప్‌ని ఓ ఆటాడుకున్నారు. చంద్రుడు భూమికి ఉపగ్రహమని అయిదో క్లాసు చదివే పిల్లల్ని అడిగినా చెబుతారు. అలాంటిది భూమికి 3.39 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న అంగారకుడు చంద్రుడిలో భాగం ఎలా అవుతాడు ? అగ్ర దేశానికి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం జ్ఞానం లేదా అంటూ ఛలోక్తులు విసిరారు.

 గతంలో గ్లోబల్‌ వార్మింగ్‌పై ట్రంప్‌ ట్వీట్‌కు

గతంలో గ్లోబల్‌ వార్మింగ్‌పై ట్రంప్‌ ట్వీట్‌కు

ట్రంప్‌ అంత అజ్ఞాన అంటూ ఒకరు ఆశ్చర్యపోతే, మరొకరు ట్రంప్‌ తండ్రి ఆయనకి ఖగోళ శాస్త్రం గురించి ఎన్నడూ చెప్పలేదా? అసలు అంతరిక్షమంటేనే ఓ రహస్యాల పుట్ట. అంగారకుడిలో చంద్రుడిని భాగం చేసి కొత్త రహస్యాన్ని ప్రపంచానికి ట్రంప్‌ బట్టబయలు చేశారు అంటూ మరొకరు వ్యంగ్య బాణాలు విసిరారు. అంతరిక్షానికి సంబంధించి అధ్యక్షుడి ట్రాక్‌ రికార్డు చూస్తే నాసా ట్రంప్‌ సహాయ సహకారాలు బాగా ఎక్కువగా తీసుకుంటే బాగుంటుందని సలహాలిచ్చారు. గతంలో గ్లోబల్‌ వార్మింగ్‌పై ట్రంప్‌ ట్వీట్‌కు మన అస్సామీ అమ్మాయి ఆస్తా శర్మ వెదర్‌కి, క్లైమేట్‌కి తేడా తెలుసుకోవాలంటూ చురకలంటించడం తెల్సిందే.

More from GizBot

Best Mobiles in India

English summary
Trump Criticizes NASA Plan Of Going To Moon. He Directed It 18 Months Ago More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X