"ట్రూత్" పేరుతో డొనాల్డ్ ట్రంప్ కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్!! లాంచ్ ఎప్పుడో తెలుసా

|

యునైటెడ్ స్టేట్స్ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ "ట్రూత్" అనే కొత్త సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను ప్రారంభించే ప్లాన్ ను ప్రకటించినట్లు కొన్ని మీడియా నివేదికలు తెలిపాయి. రాబోయే సోషల్ మీడియా ప్లాట్‌ఫాం "బిగ్ టెక్ నిరంకుశత్వానికి అండగా నిలుస్తుందని" అమెరికా మాజీ అధ్యక్షుడు అన్నారు. యుఎస్‌లో వ్యతిరేక స్వరాలను నిశ్శబ్దం చేస్తున్నారని ఆరోపిస్తూ బిబిసి నుండి ఒక నివేదిక ప్రస్తావించబడింది.

ట్రంప్

వైట్ హౌస్ ట్రంప్ బిడ్‌లో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అభిమానులతో కమ్యూనికేషన్ పెంచుకోవడంలో సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. కానీ అతని మద్దతుదారులు యుఎస్ క్యాపిటల్‌పై దాడి చేయడంతో అతడిని ట్విట్టర్ నుండి నిషేధించారు. అంతేకాకుండా ఫేస్‌బుక్ నుండి కూడా సస్పెండ్ చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అతనిని నిషేధించాలంటూ సోషల్ మీడియా సంస్థలు ఒత్తిడి చేసాయి. దీనికి కారణం అతని పోస్ట్‌లు అవమానకరమైనవి, నిప్పులు చెరిగేవి లేదా పూర్తిగా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

ట్విట్టర్ మరియు ఫేస్‌బుక్

గత సంవత్సరం ట్విట్టర్ మరియు ఫేస్‌బుక్ నుంచి అతడు చేసిన కొన్ని పోస్ట్‌లను తొలగించడం లేదా వాటిని తప్పుదోవ పట్టించేవిగా లేబుల్ చేయడం ప్రారంభించింది. కోవిడ్ -19 అనేది ఫ్లూ కంటే "తక్కువ ప్రాణాంతకం" అని అతను చెప్పాడు. జనవరి అల్లర్ల తర్వాత ట్రంప్‌ని నిషేధించడం లేదా సస్పెండ్ చేయడంపై వారు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ప్రసంగంలో అతను ఎన్నికల మోసానికి సంబంధించి నిరాధారమైన వాదనలు కూడా చేశాడు. అల్లర్లకు ప్రతిస్పందిస్తూ ట్రంప్ క్యాపిటల్‌లో ఉన్నవారిని "దేశభక్తులు" అని పిలిచారు. అంతేకాకుండా ఎన్నికల ఫలితాన్ని అంగీకరించే సంకేతాలను ఏవి కూడా చూపలేదు. ట్విట్టర్ మరియు ఫేస్‌బుక్ తన సైట్‌లను ఉపయోగించడాన్ని అనుమతించడం చాలా ప్రమాదకరమని తీర్పునిచ్చింది. అప్పటి నుండి అతను మరియు అతని సలహాదారులు ప్రత్యర్థి సోషల్ మీడియా సైట్‌ను సృష్టించాలని యోచిస్తున్నట్లు సూచించారు.

డోనాల్డ్ J ట్రంప్

ఈ సంవత్సరం ప్రారంభంలో మొదటగా అతను డోనాల్డ్ J ట్రంప్ డెస్క్ ను ప్రారంభించాడు. దీనిని తరచుగా బ్లాగ్ అని పిలుస్తారు. ఈ వెబ్‌సైట్ స్థాపించబడిన తరువాత సైట్‌ల ద్వారా అతను ఊహించిన దాని కంటే తక్కువలో కొద్దిమంది ప్రేక్షకులను మాత్రమే ఆకర్షించడంతో తర్వాత ప్రారంభించిన ఒక నెలలోపే శాశ్వతంగా మూసివేయబడింది. అతని సీనియర్ సహాయకుడు జాసన్ మిల్లర్ "మేము కలిగి ఉన్న మరియు విస్తృతమైన కృషికి సహాయకారిగా ఉన్నాము" అని చెప్పాడు. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ (TMTG) నుండి వచ్చిన ఒక ప్రకటన ఆధారంగా అతని తాజా వెంచర్ "ట్రూత్" సోషల్ మీడియా యొక్క ప్రారంభ వెర్షన్ వచ్చే నెలలో ఆహ్వానించబడిన అతిథులకు అందుబాటులో ఉంటుంది. అలాగే 2022 మొదటి మూడు నెలల్లో "దేశవ్యాప్తంగా రోల్ అవుట్" కానున్నట్లు తెలిపారు.

ఫేస్‌బుక్

ఫేస్‌బుక్, వాట్సాప్, గూగుల్, టెలిగ్రామ్‌తో సహా అన్ని పెద్ద సోషల్ మీడియా సంస్థలు ఇప్పుడు ఈ వారం ప్రారంభంలో అమల్లోకి వచ్చిన కొత్త ఐటి నిబంధనలను పాటించనున్నాయి. కేవలం ట్విట్టర్ మాత్రమే ఈ కొత్త నిబంధనలను ఇంకా పాటించలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొత్త సామాజిక చట్టాలను పాటించాలని భారత ప్రభుత్వం ఇప్పటికే మైక్రోబ్లాగింగ్ సైట్‌కు హెచ్చరికను తెలుపుతూ ఒక లేఖను పంపింది. భారత ప్రభుత్వం నియమించిన కొత్త ఐటి నిబంధనలు మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం దేశంలో పనిచేస్తున్న అన్ని ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కొత్త సామాజిక నియమాలను పాటించాలని ఆదేశించింది. దురదృష్టవశాత్తు కొత్త ఐటి నిబంధనలు అమల్లోకి వచ్చిన తరువాత కూడా ఫేస్‌బుక్, ట్విట్టర్, గూగుల్, వాట్సాప్ వంటి టెక్ కంపెనీలు నిబంధనలను పాటించడంలో విఫలమయ్యాయి.

Best Mobiles in India

English summary
Donald Trump's New Social Media Platform Called "Truth" Announced

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X