ట్రంప్ చేతిలో ఐఫోన్, ఆ ఒక్క దాని కోసమేనట !

Written By:

డొనాల్డ్ ట్రంప్..ఈ పదం వినని వారు ఎవరూ ఉండరు. అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా కొన్ని దేశాలను ముప్పతిప్పలు పెడుతూ మరికొన్ని దేశాలకు స్నేహ హస్తాన్ని అందిస్తూ దూసుకుపోతున్నారు. ఇక పొద్దున లేచిన దగ్గర నుంచి ఆయనకు సోషల్ మీడయాలోనే ఎక్కువగా గడుపుతారు.అది కేవలం ట్విటర్లో మాత్రమే. అయితే ఆ మధ్య ట్రంప్ ఆపిల్ ఉత్పత్తులను భాయ్ కాట్ చేయాలంటూ పిలుపునిచ్చిన సంగతి అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అయితే ఇప్పుడు ట్రంప్ ఐఫోన్ మాత్రమే వాడుతున్నారు..దానితో పాటు శాంసంగ్ ఫోన్ ను వాడుతున్నారట. మరి ట్రంప్ కు, ఆపిల్ కంపెనీ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో ఓ స్మార్ట్ లుక్కేయండి.

స్పామ్ కాల్స్‌ విసిగిస్తున్నాయా, Do Not Disturbతో తరిమేయండి, సింపుల్ ట్రిక్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అన్ లాక్ చేయాలని ఆపిల్ కంపెనీని కోరగా..

కాలిఫోర్నియాలోని శాన్ బెర్నార్డినోలో ఓ టెర్రరిస్ట్ ను అమెరికన్ పోలీసులు కాల్చి చంపారు. అయితే అతని దగ్గరున్న ఐఫోన్లో మరింత సమాచారం ఉండే అవకాశం ఉందనే అనుమానంతో దాన్ని అన్ లాక్ చేయాలని ఆపిల్ కంపెనీని కోరగా అందుకు ఆపిల్ కంపెనీ తిరస్కరించింది.

ఓపెన్ చేస్తే..

అమెరికన్ సెక్యూరిటీ ఏజెన్సీ ఐఫోన్ ని అన్ లాక్ చేయమని ఆపిల్ ని కోరగా ఆపిల్ ఇది సెక్యూరిటీతో కూడుకున్న సమస్య అని దీన్ని ఓపెన్ చేస్తే మేము ఐఫోన్ సెక్యూరిటీకి బ్యాక్ డోర్ తెరిచనట్లవుతుందని ఆపిల్ తిరస్కరించింది. దీంతో ఒళ్లు మండిన ట్రంప్ ఆపిల్ ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు.

ఐఫోన్ ఇక వాడనని ..

అయితే అప్పుడు ఎన్నికలపై ట్వీట్లు వస్తుండటంతో మరో ప్రత్యామ్నాయం లేని ట్రంప్ ఆపిల్ ఐఫోన్ ఇక వాడనని శాంసంగ్ ఫోన్లు మాత్రమే వాడతానని తెలిపారు. అయితే దీని వెనక మతలబు వేరే ఉందనే అనుమానాలు కూడా అప్పట్లో వ్యక్తమయ్యాయి.

హిల్లరీ క్లింటన్ కు మద్దతుగా..

గతంలో జరిగిన అమెరికా ఎన్నికల్లో ఆపిల్ కంపెనీ హిల్లరీ క్లింటన్ కు మద్దతుగా నిలిచినందనే కధనాలు వచ్చాయి. దీనికి ఊతమిస్తూ ఆపిల్ కంపెనీ హిల్లరీ కోసం ఫండ్ రైజింగ్ కూడా చేపట్టింది. దీంతో ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు.

అమెరికాలోనే ఐఫోన్లను తయారుచేయాలని ..

ఆపిల్ కంపెనీ అమెరికాలోనే ఐఫోన్లను తయారుచేయాలని తేల్చి చెప్పారు. కాగా అది కుదరదని అపిల్ కంపెనీ తేల్చి చెప్పింది. ఇక్కడ తయారుచేయాలంటే తయారీ ఖర్చు చాలా ఎక్కువవుతుందని మేము దాన్ని భరించేందుకు సిద్ధంగా లేమని టిమ్ కుక్ తేల్చి చెప్పారు. ఇది కూడా బాయ్ కాట్ కు కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Donald Trump has a new iPhone — so it looks like he isn’t boycotting Apple anymore More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot