కుటుంబ సమేతంగా ఊరికి వెళ్తున్నారా..?, ఆ వివరాలను ఫేస్‌బుక్‌లో పెట్టకండి! (హెచ్చరిక)

Posted By: Staff

కుటుంబ సమేతంగా ఊరికి వెళ్తున్నారా..?, ఆ వివరాలను ఫేస్‌బుక్‌లో పెట్టకండి! (హెచ్చరిక)

 

లండన్: మీ కుటుంబ సభ్యులంతా  ఓ వారం రోజల పాటు టూర్‌కు ప్లాన్ చేసుకున్నారా..?, ఈ ఆహ్లాదకర సమాచారాన్ని ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా మిత్రులకు షేర్ చేస్తున్నారా..?, ఇక పై అలా చేయకండి!!!!!. సోషల్ నెట్‍‌వర్కింగ్ సైట్‌ల ద్వారా మీరు పోస్ట్ చేసే సందేశాలను చదివి దొంగలు మీ ఇంట్లో చోరికి తెగబడే  ప్రమాదముందని బ్రిటన్ అధ్యయనకర్తలు హెచ్చరిస్తున్నారు. ఇలా టెక్నికల్‌గా దొంగతనాలకు పాల్పడటంలో బ్రిటన్ దొంగలు దిట్టలట. ఏ ఇంటివారు ఊరికివెళుతున్నారు.. ఎన్ని రోజులు వాళ్లింట్లో ఎవరూ ఉండరు.. తదితర  అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్‌బుక్, ట్విట్టర్ ఆకౌంట్ల ద్వారా అక్కడి దొంగలు పరిశీలిస్తున్నారని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇళ్లలో చోరీలు చేసిన రికార్డు ఉన్న మాజీ దొంగలను ఇంటర్వ్యూ చేయగా... దొంగతనాన్ని చేయాలనుకునే ఇంటిని తాము ఫేస్‌బుక్ ద్వారా తాము తెలుసుకునే వాళ్లమని చెప్పారట!.  ఈ అధ్యయనంలో వెలుగుచూసిన మరో ఆసక్తికర అంశమేమిటంటే బ్రిటన్‌లో ఏకంగా 35శాతం మంది తమ విహారయాత్రల వివరాలను ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా షేర్ చేస్తున్నారట.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting