ఫేస్‌బుక్ కొత్త ఐడియాకి దాసోహాం..

Posted By: Staff

ఫేస్‌బుక్ కొత్త ఐడియాకి దాసోహాం..

 

800 మిలియన్ యూజర్స్‌ని కలిగి ఉండి ఇప్పటికి కూడా ఇంటర్నెట్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని సంపాదించుకున్న సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ఫేస్‌బుక్ రోజుకో కొత్త ఫీచర్‌ని ప్రవేశపెడుతుంది. మంగళవారం ఫేస్‌బుక్‌లో కొత్తగా  యూజర్స్ కోసం 'ఆత్మహాత్యలను నియంత్రించే టూల్'ని ప్రారంభించింది. ఎవరికైనా యూజర్స్‌కి ఆత్మహాత్య చేసుకోవాలనే భావన కలిగితే గనుక ఫేస్‌బుక్ ఆన్ లైన్ ఛాట్‌లో ఉన్న కౌన్సిలర్స్ ద్వారా వారికి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.

ఫేస్‌బుక్ ప్రతినిధి ఫ్రెడ్రిక్ వూలెన్స్  దీనిపై స్పందిస్తూ స్నేహితులకు తెలిసిన వారు ఎవరైనా ఆత్మహాత్య చేసుకోవాలనే భావనతో ఉంటే గనుక వారికి ఒకే ఒక్క క్లిక్ ద్వారా ఈ 'ఆత్మహాత్యలను నియంత్రించే టూల్' ని  సూచించవచ్చు. దీంతో ఫేస్‌బుక్ యూజర్స్‌కు ఈ మెయిల్ ద్వారా ప్రయివేట్ ఆన్‌లైన్‌ ఛాట్‌కి ఆహ్వానిస్తారు. వారి ఆత్మ హాత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు గాను 'నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ లైఫై లైన్' సంస్ద రంగంలోకి దిగుతుంది.

ఇలాంటి సందర్బాలలో కొంత మంది యూజర్స్ ఫోన్‌ని రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడకపోతే వారిని డైరెక్టుగా కలిసి వారి తగిన సహాయం అందించనున్నారు. ఎవరైతే యూజర్స్ సూసైడ్ మనసుతత్వంతో ఉంటారో వారికి డైరెక్టుగా వెబ్‌సైట్  హెల్ప్ సెంటర్‌తో పాటు సూసైడ్ రిపోర్టింగ్ ఫామ్స్‌ని సూచించవచ్చు. ఇక ఫేస్‌బుక్ విషయానికి వస్తే 2004వ సంవత్సరంలో మార్క్ జూకర్స్ బర్గ్ కో- ఫౌండర్‌గా కాలిఫోర్నియాలో స్దాపించడం జరిగింది. స్దాపించిన అనతి కాలంలోనే ప్రాచుర్యంలోకి రావడమే కాకుండా 800 మిలియన్ యూజర్స్‌ని సొంతం చేసుకుంది.

ఫేస్‌బుక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ 'ఆత్మహాత్యలను నియంత్రించే టూల్' ప్రస్తుతం ఎవరైతే యునైటెడ్ స్టేట్స్, కెనడాలలో ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్నారో వారికి అందుబాటులో ఉందని తెలిపారు. దీనిని ఫేస్‌బుక్‌లో ఫ్రారంభించడానికి గల కారణాలను వూలెన్ తెలియజేస్తూ రోజుకి 100 మంది అమెరికన్స్ కేవలం ఆత్మహాత్యల వల్లే మరణిస్తున్నారని వాటిని నిరోధించే భాగంలో దీనిని ప్రవేశపెట్టామని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot