చీప్ క్వాలిటీ యాక్సెసరీస్ కొంటే సమస్యలే..

క్వాలిటీ అనేది నూటికి నూరుపాళ్లు జెన్యున్ వస్తువుల్లోనే దొరుకుతుంది.

|

టెక్నాలజీ గాడ్జెట్‌ల కొనుగోలు విషయంలో కనీస అవగహన అనేది తప్పనిసరి. ఏ వస్తువుకు ఎక్కువ ఖర్చు పెట్టాలో, ఏ వస్తువుకు ఎక్కువ ఖర్చుపెట్టకూడదో తెలిసినవాడే అసులు‌సిసలైన టెక్ ఎక్స్‌పర్ట్. టెక్నాలజీ ఉత్పత్తుల విషయంలో క్వాలిటీ అనేది చాల తప్పనిసరి. క్వాలిటీ అనేది నూటికి నూరుపాళ్లు జెన్యున్ వస్తువుల్లోనే దొరుకుతుంది. కొన్ని సందర్భాల్లో బ్రాండెడ్ వస్తువుకు, అన్‌బ్రాండెడ్ వస్తువుకు మధ్య తేడాలను గమనించలేం. రెండు సమానంగానే పని చేస్తుంటాయి. లాంగ్ రన్‌లోకి వచ్చేసరికి అన్‌బ్రాండెడ్ గాడ్జెట్‌ క్వాలిటీని కొల్పోయి నిస్సత్తువుగా మారిపోతుంది.

 

కాస్తంతలో లోపించకండి..

కాస్తంతలో లోపించకండి..

కొంత మంది ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసి వాటికి అవసరమయ్యే యాక్సెసరీస్ కొనుగోలు విషయంలో మాత్రం చౌకబారుగా ఆలోచిస్తుంటారు. బ్రాండెడ్ వస్తువులకు అన్‌బ్రాండెడ్ ఉపకరణాలను కనెక్ట్ చేయటం ద్వారా అరకొర నాణ్యతతోనే సరిపెట్టుకోవల్సివస్తుంది. ఇక్కడ ప్రస్తావించబోయే ఎలక్టానిక్ గాడ్జెట్‌ల కొనుగోలు విషయంలో ఏ మాత్రం చౌకబారుగా వ్యవహరించినా మీరు సంతృప్తిపడలేరు. అవేంటో తెలుసుకుందామా మరి...

హెడ్‌ఫోన్స్

హెడ్‌ఫోన్స్

చీప్ క్వాలిటీ హెడ్‌ఫోన్స్ ద్వారా మన్నికైన మ్యూజిక్‌ను మీరు ఆస్వాదించలేరు. రోడ్‌సైడ్ దుకాణాల్లో అలానే ఫుట్‌పాత్ బజార్‌లలో విక్రయించే చీప్ క్వాలిటీ హెడ్‌ఫోన్‌లు ఏ క్షణం వరకు పనిచేస్తాయో చెప్పలేం. వీటిలో క్వాలిటీ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. మనసును హత్తుకునే నాణ్యమైన మ్యూజిక్‌ను ఆస్వాదించాలనుకుంటే కచ్చితంగా బ్రాండెడ్ హెడ్‌ఫోన్‌లను వాడితీరాలి.

బ్యాటరీ విషయంలో
 

బ్యాటరీ విషయంలో

బ్యాటరీలు రెండు రకాలుగా ఉన్నాయి. అందులో ఒకటి ఆల్కాలైన్ మరొకటి లిథియమ్. వీటిలో లిథియమ్ బ్యాటరీలను బెస్ట్ బ్యాటరీలుగా చెప్పుకోవచ్చు. ఇవి రీఛార్జబుల్ కానప్పటికి హైఎండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వ్యవస్థను కలిగి ఉంటాయి. మీ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్ కోసం రీఛార్జబుల్ బ్యాటరీలను ఎంపిక చేసుకునే విషయంలో టాప్‌ఎండ్ బ్యాటరీలను ఎంపిక చేసుకోవటం ఉత్తమం.

 యూఎస్బీ కేబుల్స్ విషయంలో...

యూఎస్బీ కేబుల్స్ విషయంలో...

చీప్ క్వాలిటీ యూఎస్బీ కేబుల్స్ ద్వారా వేగవంతమైన ఛార్జింగ్ ఇంకా డేటా ట్రాన్స్‌ఫర్‌ను మీరు ఆస్వాదించలేరు. రోడ్‌ సైడ్ దుకాణాల్లో అలానే ఫుట్‌పాత్ బజార్‌లలో విక్రయించే చీప్ క్వాలిటీ యూఎస్బీ కేబుల్స్ ఏ క్షణం వరకు పనిచేస్తాయో చెప్పలేం. వీటి మన్నిక కూడా నామమాత్రంగానే ఉంటుంది.

కెమెరా లెన్స్

కెమెరా లెన్స్

వీటి విషయంలో చీప్ క్వాలిటీ వద్దు కెమెరా లెన్స్ ఎంత మన్నికగా ఉంటే, ఆ ఫోటోగ్రఫీ అంత క్వాలిటీగా ఉంటుంది. నాసిరకం లెన్సును కొనగోలు చేయటం ద్వారా క్వాలిటీ ఫోటోగ్రఫీని మీరు ఆస్వాదించలేరు.

కీబోర్డ్

కీబోర్డ్

కంప్యూటింగ్ ప్రపంచంలో కీబోర్డ్ కీలక వస్తువు. కీబోర్డులను రఫ్ అండ్ టఫ్‌గా వాడేస్తుంటాం కాబట్టి వీటి ఎంపిక విషయంలో ఎల్లప్పుడు నాణ్యతను దృష్టిలో పెట్టుకోవాలి. సాధారణ కీబోర్డులతో పోలిస్తే ప్రీమియమ్ మోడల్ కీబోర్డ్స్ మన్నికైన పనితీరును కనబరుస్తాయి.

 ల్యాప్‌టాప్

ల్యాప్‌టాప్

మీరు కొనుగోలు చేసే ల్యాప్‌టాప్, మీ అవసరాలకు తగ్గట్టుగా ఉంటే బాగుంటుంది. వేగవంతమైన ప్రాసెసర్, క్రిస్ప్ డిస్‌ప్లే, పటిష్టమైన బిల్డ్‌బాడీ వంటి అంశాలు మీరు కొనే ల్యాప్‌టాప్‌లో తప్పనిసరిగా ఉండాలి. నాసిరకం ల్యాప్‌టాప్‌లలో ఈ మంచి లక్షణాలు మచ్చుకైనా కనిపించవు.

Best Mobiles in India

English summary
Don't Look for Cheap Quality products while purchasing these devices. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X