ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లకు గుడ్‌న్యూస్ చెప్పిన టెలికాం విభాగం... 90 రోజుల వెయిటింగ్‌కు చెక్..!
స్మార్ట్‌ఫోన్‌లు యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ఆప్షన్‌లను ఎంచుకుంటారు. యూజర్లు అవసరాలు మరియు వివిధ ప్రయోజనాల కోసం ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్ కు మారుతుంటారు. తాజాగా ఈ అంశంపై టెలికాం శాఖ (DoT) కీలక ప్రకటన చేసింది. యూజర్లకు ఈ ఆప్షన్ ఉపయోగపడే అవకాశం ఉంది.
90 రోజుల వెయిటింగ్ :
టెలికాం విభాగం జూన్ 10, 2025 ను తీసుకొచ్చిన కొత్త నిబంధనల ఆధారంగా ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లు పరస్పరం సులభంగా మారేందుకు అవకాశం ఉంటుంది. గతంలో పోస్ట్‌పెయిడ్ నుంచి ప్రీపెయిడ్ లేదా ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కు మారాలంటే 90 రోజులుపాటు వేచిచూడాల్సి ఉండేది.

30 రోజుల్లో ప్లాన్ మార్చుకొనేందుకు అవకాశం :
కొత్త రూల్స్ ఆధారంగా కేవలం 30 రోజుల్లోనే యూజర్లు తమకు నచ్చిన ప్లాన్‌ను మార్చేందుకు అవకాశం ఉంది. OTP ఆధారిత KYC ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేసింది. ఈ KYC ప్రక్రియ టెలికాం సంస్థల అవుట్‌లెట్‌లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం మాత్రమే 30 రోజుల్లో ప్లాన్ మార్చుకొనేందుకు అవకాశం ఉంటుంది.
OTP ఆధారిత KYC :
అయితే ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ యూజర్లు ఈ OTP ఆధారిత KYC ద్వారా తొలిసారి మాత్రమే తమ ప్లాన్‌లను మార్చుకొనేందుకు అవకాశం ఉంటుంది. అనంతరం మరోసారి పోస్ట్‌పెయిడ్ నుంచి ప్రీపెయిడ్ లేదా ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో మార్పులు చేయాలని భావిస్తే 90 రోజులపాటు వేచిచూడాల్సి ఉంటుంది.
📱 Switching between Prepaid ↔️ Postpaid got easier through OTP!
— DoT India (@DoT_India) June 12, 2025
⏱️ Cooling-off period for first-time reconversion reduced from 90 days to 30 days.
🔁 Need to switch sooner? Use KYC at PoS or authorized outlets! pic.twitter.com/kWbPcGsanZ
కొంత మంది యూజర్లు వివిధ అవసరాల కోసం ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లకు మారుతుంటారు. అయితే కొత్త ప్లాన్‌లోకి మారాక.. సరైన ప్రయోజనాలు అందకపోవడం లేదా ఇతరాత్ర కారణాలతో తిరిగి పాత ప్లా్‌న్‌కు రావాలని భావిస్తుంటారు. ఇలాంటి వారికి ఈ KYC ప్రక్రియ అనుకూలంగా ఉంటుంది.
* ఈ సంవత్సరం మే నెలలో సైబర్ నేరాల కట్టడి, ఆర్థిక నేరాల నియంత్రణ కోసం ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ (FRI) ఫీచర్‌ను టెలికాం విభాగం తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఆర్థిక నేరాలతో సంబంధం ఉన్న ఫోన్ నంబర్‌లకు UPI ట్రాన్సాక్షన్‌లు జరగకుండా కట్టడి చేస్తుంది.
ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ఫీచర్ ద్వారా బ్యాంకులు, UPI ప్లాట్‌ఫామ్‌లను అప్రమత్తం చేయవచ్చు. నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్, DoT కి చెందిన చక్షు ప్లాట్‌ఫామ్, బ్యాంకింగ్ ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఉపయోగించుకుంటుంది. దీని ద్వారా ఫోన్ నంబర్‌లను నంబర్‌లను మీడియం, హై, వెరీ హై రిస్క్ కేటగిరీల్లో విభజిస్తుంది.
ఈ నంబర్‌లకు UPI పేమెంట్స్ చేసే సమయంలో యూజర్లను అప్రమత్తం చేస్తుంది. హై రిస్క్ జాబితాలో ఉన్న నంబర్‌లకు ఎటువంటి ట్రాన్సాక్షన్‌లు జరగకుండా కట్టడి చేస్తుంది. మీడియా, రిస్క్ కేటగిరీల్లో ఉన్న నంబర్‌లకు ట్రాన్సాక్షన్ చేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు యూజర్లను అప్రమత్తం చేస్తుంది.
ఎప్పటికప్పుడు రియల్‌టైంలో అప్‌డేట్స్‌ను అందిస్తుంది. దీంతోపాటు ఆర్థిక నేరాలతో సంబందం ఉన్న నంబర్లకు పేమెంట్స్ చేసే సమయంలో కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. యూపీఐ సంస్థలు ఈ ఫీచర్‌కు త్వరలోనే అనుసంధానం అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications