నాడు రూ.10 వేల కోట్ల లాభం,నేడు రూ.13 వేల కోట్ల అప్పు

By Gizbot Bureau
|

ఒకప్పుడు ఏడాదికి రూ.10వేల కోట్ల పైచిలుకు లాభాలు ఆర్జించిన ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ నేడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దాదాపు రూ.13వేల కోట్ల పైచిలుకు అప్పుల్లో కూరుకుపోయింది. ఆఖరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో త్వరలోనే కార్యకలాపాలను ఆపివేయాలనే ఆలోచనలో ఉంది.

 
మూసివేసే ప్రతిపాదన లేదన్న టెలికాం మంత్రి

టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో ఎంట్రీతో బీఎస్ఎన్ఎల్ పరిస్థితి ఇలా మారిపోయింది.సర్వీస్ విషయంలోనూ,టెక్నాలజీ విషయంలోనూ మిగతా టెలికాం సంస్థలతో బీఎస్ఎన్ఎల్ పోటీ పడలేక చేతులెత్తేసింది. మిగతా సంస్థలన్నీ 5G టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉంటే.. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ ఇంకా 4G టెస్టింగ్ దగ్గరే ఉంది. ఈ నేపథ్యంలో డాట్ బీఎస్‌ఎన్‌ఎల్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది.

 ఇప్పటికే ఖరారైన టెండర్లను

ఇప్పటికే ఖరారైన టెండర్లను

ముందస్తు కొనుగోళ్ల ఆర్డర్లు, ఇప్పటికే ఖరారైన టెండర్లను తదుపరి ఉత్తర్వులిచ్చేదాకా నిలిపివేయాలంటూ ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ను టెలికం శాఖ (డాట్‌) ఆదేశించింది. దీంతో పెట్టుబడి వ్యయాలకు సంబంధించి కొత్త టెండర్లు ప్రకటించాలంటే ముందుగా ఢిల్లీలోని కార్పొరేట్‌ ఆఫీసర్‌ అనుమతులు తీసుకోవాలంటూ అన్ని సర్కిల్స్‌ హెడ్స్‌కు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆర్థిక విభాగం ఆదేశాలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

 పెట్టుబడి వ్యయాలను

పెట్టుబడి వ్యయాలను

బీఎస్‌ఎన్‌ఎల్‌ తీవ్ర ఆర్థిక సవాళ్లతో సతమతమవుతున్న నేపథ్యంలో తాజా ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘బీఎస్‌ఎన్‌ఎల్‌ తాత్కాలికంగా ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటోందని, ఇప్పటికే పేరుకుపోయిన రుణభారాలను తీర్చే పరిస్థితుల్లో లేదని సర్కిల్‌ హెడ్స్‌కు పంపిన ఆర్డరులో కంపెనీ పేర్కొంది‘ అని బీఎస్‌ఎన్‌ఎల్‌ వర్గాలు తెలిపాయి.పెట్టుబడి వ్యయాలను తాత్కాలికంగా నిలిపివేయాలంటూ డాట్‌ నుంచి ఆదేశాలు రావడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ మేరకు ఆర్డరు జారీ చేసినట్లు వివరించాయి.

 భారీ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ ఉన్నప్పటికీ
 

భారీ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ ఉన్నప్పటికీ

ప్రైవేట్‌ టెలికం సంస్థలు ఓవైపున వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్‌ చేస్తుండగా.. వాటితో పోటీపడేందుకు 4జీ స్పెక్ట్రం కేటాయింపుల కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇంకా ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురుచూస్తోంది. హై స్పీడ్‌ ఇంటర్నెట్‌ను అందించేందుకు అనువుగా భారీ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ ఉన్నప్పటికీ అందుకు అవసరమైన పరికరాలు ఇంకా కొనుగోలు చేయాల్సి ఉంది. నిధుల సమీకరణ కోసం రియల్‌ ఎస్టేట్‌ ఆస్తులను విక్రయించే ప్రతిపాదనను పంపినప్పటికీ కేంద్రం దానిపై నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టింది. ఇవన్నీ బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యకలాపాల విస్తరణకు అడ్డంకులుగా మారాయి.

 నాడు లాభాలు నేడు నష్టాలు

నాడు లాభాలు నేడు నష్టాలు

2014-15లో రూ. 672 కోట్ల నిర్వహణ లాభం ఆర్జించిన బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలో రూ. 3,885 కోట్లు, 2016-17లో రూ. 1,684 కోట్ల నిర్వహణ లాభాలు ఆర్జించింది. రిలయన్స్‌ జియో రాకతో మిగతా టెల్కోల తరహాలోనే బీఎస్‌ ఎన్‌ఎల్‌పై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. టెలికం రంగంలో గతంలో ఎన్నడూ లేనంత భీకరమైన పోటీ నెలకొందంటూ కంపెనీ ఫైనాన్స్‌ విభాగం డైరెక్టర్‌ ఎస్‌కే గుప్తా గత నెలలో చీఫ్‌ జనరల్‌ మేనేజర్స్‌కు రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. పోటీ సంస్థలు ఆఫర్‌ చేస్తున్న అత్యంత చౌకైన టారిఫ్‌ల కారణంగా కంపెనీ ఆదాయం గణనీయంగా పడిపోయిందని అందులో ఆయన పేర్కొన్నారు.

 మొత్తం రూ.2500కోట్ల రుణం అవసరం

మొత్తం రూ.2500కోట్ల రుణం అవసరం

ఉద్యోగులకు జూన్ నెల వేతనాలు ఇచ్చేందుకు కేంద్రాన్ని బీఎస్ఎన్ఎల్ రూ.850కోట్ల రుణం ఇవ్వాల్సిందిగా దరఖాస్తు చేసుకుంది. సంస్థను కొన్ని నెలల పాటు నిలకడగా నడపాలంటే మొత్తం రూ.2500కోట్ల రుణం అవసరమవుతుందని కేంద్రానికి తెలిపింది.అయితే కేంద్రం నుంచి మాత్రం నిధులకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి హామీ లభించలేదు.

మూసివేసే ప్రతిపాదన లేదన్న టెలికాం మంత్రి

మూసివేసే ప్రతిపాదన లేదన్న టెలికాం మంత్రి

ఇదిలా ఉంటే ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లను మూసివేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రెండు ప్రభుత్వ సంస్థల పునరుద్ధరణకు సమగ్ర ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు టెలికాం మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ లోక్‌సభకు తెలిపారు.

Best Mobiles in India

English summary
DoT asks BSNL to put all capex on hold, stop tenders

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X