మొబైల్ యూజర్లకు మరో మంచి శుభవార్త

మొబైల్‌ యూజర్లకు టెలికాం డిపార్ట్‌మెంట్‌ శుభవార్తను చెప్పింది. ఆధార్‌తో మొబైల్‌ నెంబర్ల రీ-వెరిఫికేషన్‌ ప్రక్రియ గడువును టెలికాం డిపార్ట్‌మెంట్‌ పొడిగించినట్టు ప్రకటించింది.

|

మొబైల్‌ యూజర్లకు టెలికాం డిపార్ట్‌మెంట్‌ శుభవార్తను చెప్పింది. ఆధార్‌తో మొబైల్‌ నెంబర్ల రీ-వెరిఫికేషన్‌ ప్రక్రియ గడువును టెలికాం డిపార్ట్‌మెంట్‌ పొడిగించినట్టు ప్రకటించింది. ఆధార్‌ వాలిడిటీపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు ఈ వెరిఫికేషన్‌ చేపట్టుకోవచ్చని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ప్రస్తుత మొబైల్‌ సబ్‌స్క్రైబర్లు ఆధార్‌ ఆధారితంగా జరిపే ఈ-కేవైసీ ప్ర​క్రియను, సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు పెంచుకోవచ్చని వెల్లడించింది. అదేవిధంగా ప్రస్తుతం టెలికాం కంపెనీలు పంపుతున్న వాయిస్‌, టెక్ట్స్‌ మెసేజ్‌లలో రీ-వెరిఫికేషన్‌ ప్రక్రియ చివరి తేదీని పేర్కొనకూడదని ఆదేశాలు జారీచేసింది. పలు సర్వీసులకు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తప్పనిసరి చేస్తున్న ఆధార్‌ లింకేజీపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. మార్చి 13న జరిపిన విచారణలో ఆధార్‌ డెడ్‌లైన్‌ను మార్చి 31 కాకుండా, రాజ్యాంగ బెంచ్‌ తుది తీర్పు వెల్లడించే వరకు పొడిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సెల్ఫీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో దూసుకొస్తున్న OPPO F7 , మార్చి26న ముహుర్తంసెల్ఫీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో దూసుకొస్తున్న OPPO F7 , మార్చి26న ముహుర్తం

ఈ ఏడాది జనవరి 1 నుంచి..

ఈ ఏడాది జనవరి 1 నుంచి..

ఈ ఏడాది జనవరి 1 నుంచి టెలికాం డిపార్ట్‌మెంట్‌, ఆటోమేటెడ్‌ కస్టమర్‌ కేర్‌ నెంబర్‌ 14546 ద్వారా అన్ని ఆపరేటర్లు మొబైల్‌ నెంబర్ల రీ-వెరిఫికేషన్‌ను చేపట్టేలా వీలు కల్పించింది. తొలుత దీని ద్వారా జరిగే ప్రక్రియకు ఫిబ్రవరి 6ను డెడ్‌లైన్‌గా విధించి, అనంతరం మార్చి 31కి మార్చింది.

సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ..

సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ..

ప్రస్తుతం ఈ ప్రక్రియను సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు చేపట్టవచ్చని టెలికాం డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. ఓటీపీ, ఫింగర్‌ప్రింట్‌ అథెంటికేషన్‌ ఇవ్వలేని కస్టమర్లకు వారి ఇంటి వద్దే మొబైల్‌ నెంబర్‌ రీ-వెరిఫికేషన్‌ చేపట్టేందుకు డీఓటీ గత అక్టోబర్‌లో అనుమతి ఇచ్చింది. ఆధార్‌ లేని విదేశీయులు ఈ ప్రక్రియను వారు తమ మొబైల్‌ నెంబర్‌ ఆపరేటర్‌ రిటైల్‌ అవుట్‌లెట్‌కు వెళ్లి, పాస్‌పోర్టు వివరాలు అందించి చేపట్టాల్సి ఉంటుంది.

వివిధ సంక్షేమ పథకాలకు

వివిధ సంక్షేమ పథకాలకు

కాగా ఆధార్ ను వివిధ సంక్షేమ పథకాలకు,సేవలకు తప్పనిసరి చేస్తూ కేంద్రం విధించిన గడువును అత్యున్నత న్యాయస్థానం మరోసారి పొడిగించింది.ఆధార్ అనుసంధానంపై కేసును విచారిస్తోన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌లతో కూడిన ఐదురుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి గడుపు పెంపుపై నిర్ణయం తీసుకుంది.

మొబైల్‌ ఫోన్లు, బ్యాంకు అకౌంట్లకు

మొబైల్‌ ఫోన్లు, బ్యాంకు అకౌంట్లకు

మొబైల్‌ ఫోన్లు, బ్యాంకు అకౌంట్లకు ఆధార్‌ అనుసంధానికి సంబంధించి తుది తీర్పు వచ్చే వరకూ గడువును పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మాత్రమే ఆధార్‌ అవసరమని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఇదివరకు మార్చి 31 చివరి గడువు..

ఇదివరకు మార్చి 31 చివరి గడువు..

ఇదివరకు ఆధార్ అనుసంధానానికి మార్చి 31 చివరి గడువు ఉంది. కానీ కేంద్రం గడువును పొడిగించవచ్చు అని సంకేతాలు పంపింది. గత ఏడాది డిసెంబరు 15న వివిధ సేవలు, సంక్షేమ పథకాలకు ఆధార్ తప్పనిసరిగా లింక్ చేయాలన్న గడువును మార్చి 31వ తేదీ వరకు సుప్రీంకోర్టు పొడిగించిన విషయం తెలిసిందే..!

Best Mobiles in India

English summary
DoT extends Aadhaar-based re-verification deadline indefinitely More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X