మీ ఫోన్ పోయిందా,అయితే ఇకపై చాలా ఈజీగా ట్రాక్ చేయవచ్చు
మీ ఫోన్ పోయిందా? ఎవరైనా దొంగలించారా? లేదంటే ఎక్కడైనా పొగట్టుకున్నారా? ఇక నుంచి మీ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా, ఎవరైనా చోరీ చేసినా అంతగా ఆందోళన పడనవసరం ఉండదు. ఎందుకంటే మీరు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ఎక్కడున్నా కనిపెట్టే టెక్నాలజీ అందుబాటులోకి రానుంది.

మీరు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ జాడను కనిపెట్టే టెక్నాలజీ వచ్చేనెల నుంచి అందుబాటులోకి రానున్నది. ఇండియాలో మొబైల్ దొంగిలిస్తే తిరిగి పొందడం చాలా కష్టమని, చాలా అరుదుగా కొట్టేసిన ఫోన్ కనిపెట్టగలమనే విషయం అందరికీ తెలిసిందే. ఇకపై ఈ బెడదను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించనుంది.

ఫోన్ కనిపెట్టడం చాలా సులువు
సాధారణంగా కొట్టేసిన ఫోన్‌లో SIM కార్డు ఉండి ఉంటే.. నెట్ వర్క్ ద్వారా ఫోన్ కనిపెట్టే అవకాశం ఉంది. ఒకవేళ మొబైల్ డివైజ్ నుంచి SIM కార్డు తొలగించి వేస్తే ఇక ఫోన్ కనిపెట్టడం చాలా కష్టం. అయితే ఇప్పుడు దొంగలించిన మొబైల్ ఫోన్ లో SIM కార్డు తొలగించినా ఫోన్ కనిపెట్టడం చాలా సులువని కేంద్ర ప్రభుత్వం అంటోంది. దీనికో మార్గం.. పరిష్కారం ఉందని గట్టిగా చెబుతోంది.

ట్రాకింగ్ సిస్టమ్
ఈ పరిష్కారంలో భాగంగా సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DoT) వచ్చే నెల ఆగస్టులో ట్రాకింగ్ సిస్టమ్ టెక్నాలజీని లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. దేశంలో ఎక్కడైనా మీ మొబైల్ ఫోన్ దొంగతనానికి గురైనా, ఎక్కడైనా పొగట్టుకున్నా సరే ఈ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా వెంటనే కనిపెట్టవచ్చు.

జూలై 26వరకు పార్లమెంట్ సమావేశాలు
ఇప్పుడు C-DoT టెక్నాలజీ రెడీగానే ఉంది. పార్లమెంట్ సెషన్ తర్వాత టెలికం డిపార్ట్ మెంట్ సంబంధిత మంత్రిని సంప్రదించాక లాంచింగ్ పై క్లారిటీ వస్తుంది. వచ్చే నెలలో కచ్చితంగా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని DoT అధికారి ఒకరు తెలిపారు. జూలై 26వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతాయని భావిస్తుండగా.. ఆగస్టులో లాంచింగ్ తేదీపై కొన్నిరోజుల్లో క్లారిటీ వస్తుందని ఆయన చెప్పారు. దీన్ని మహారాష్ట్రల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి చూశామని ఆ అధికారి చెప్పారు.

బడ్జేట్ కేటాయింపులు రూ.15 కోట్లు
2017 జూలైలోనే C-DoT (సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ - CEIR) అనే పేరుతో ప్రాజెక్టును అసైన్ చేయడం జరిగిందన్నారు. దొంగలించిన మొబైల్ ఫోన్లను కనిపెట్టడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ ట్రాకింగ్ సిస్టమ్ ను అమలు చేయడానికి బడ్జేట్ కేటాయింపుల్లో రూ.15 కోట్లు వరకు ప్రతిపాదించినట్టు సమాచారం.

ఫోన్లను బ్లాక్ లిస్టులో పెట్టడం వల్ల
కొట్టేసిన మొబైల్ ఫోన్లలో SIM కార్డు ఉన్నా లేకున్నా అన్నీ సర్వీసులను బ్లాక్ చేయడం కామన్ గా చేస్తుంటారు. కామన్ డేటాబేస్ తో అన్ని టెలికం కంపెనీలకు షేర్ చేయడం ద్వారా కొట్టేసిన మొబైల్ ఫోన్లను బ్లాక్ లిస్టులో పెట్టడం వల్ల ఆ ఫోన్‌లో ఓ నెట్ వర్క్ వేసిన పనిచేసే అవకాశం ఉండదు. ఇలాంటి అన్ని మొబైల్ డివైజ్‌లను ట్రాకింగ్ చేయడానికి DoT ఎలా ప్లాన్ చేస్తుంది అనేదానిపై క్లారిటీ లేదు. ఈ ట్రాకింగ్ సిస్టమ్ కు సంబంధించి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు.

సీఈఐఆర్ సిస్టమ్ ద్వారా బ్లాక్
సెల్‌ఫోన్ చోరీ అయినట్లు ఫిర్యాదు చేస్తే దానికి ఏ సర్వీసూ అందకుండా సీఈఐఆర్ సిస్టమ్ ద్వారా బ్లాక్ కూడా చేయొచ్చు. సీఈఐఆర్ సిస్టమ్‌ను అన్ని మొబైల్ ఆపరేటర్ల ఐఎంఈఐ డేటాబేస్‌కు అనుసంధానం చేస్తారు. చోరీకి గురైన 15 నంబర్ల ఐఎంఈఐ నంబర్‌ను మనం ఫిర్యాదులో పేర్కొనాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications








