కష్టాల్లో జియో ..

Written By:

టెలికం మార్కెట్లో దూసుకుపోతున్న జియోకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ మధ్య సంచలనం రేపిన డేటా లీక్ షాక్ జియోకు బాగా తగిలింది. ఆన్‌లైన్‌లో తమ వినియోగదారులకుచెందిన సమాచారం లీకైందన్న వార్తలు జియోని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీనిపై టెలికం శాఖ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.

1,000 mbps స్పీడ్‌తో BSNL ఆల్ట్రా ఫాస్ట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దీనిపై జియోని వివరణ

కోట్లాదిమంది జియో కస్టమర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడంపై టెలికాం శాఖ స్పందించింది. త్వరలోనే దీనిపై జియోని వివరణకోరనున్నట్టు తెలిపింది.

డేటా ఉల్లంఘన ఆరోపణపై

ఇప్పటివరకూ జియో నుంచి తమకు సమాచారం లేదని, డేటా ఉల్లంఘన ఆరోపణపై జియోను వివరాలు కోరనున్నామని టెలికాం కార్యదర్శి అరుణ్ సుందర్రాజన్‌ తెలిపారు.

మాజిక్‌ఏపీ.కామ్‌ లో

గత ఆదివారం వెలుగులోకి జియో కస్టమర్ల డేటా లీక్‌ ప్రకంపనలు రేపింది. ముఖ్యంగా ఈమెయిల్‌, ఫోన్‌ నెంబర్‌, ఆధార్‌ తదితర వివరాలు మాజిక్‌ఏపీ.కామ్‌ లో దర్శనమిచ్చాయి.

జియో ముంబైలో ఫిర్యాదు చేయగా

ఈ విషయంపై జియో ముంబైలో ఫిర్యాదు చేయగా రాజస్థాన్‌కు చెందిన ఇమ్రాన్‌ చిప్ప (35)ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఏ మేరకు లీకైందనే...

ఈ లీక్‌ను ధృవీకరించిన మహారాష్ట్ర సైబర్ పోలీస్ సీనియర్ అధికారి, ఏ మేరకు లీకైందనే వివరాలందించడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
DoT to seek detail over data breach from Reliance Jio: Telecom Secretary Arun Sundararajan Read more at Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting