ఈ ఏడాది రెండంకెల సంఖ్యలో ఐటి ఉద్యోగులకు జీతభత్యాలు పెంపు

Posted By: Super

ఈ ఏడాది రెండంకెల సంఖ్యలో ఐటి ఉద్యోగులకు జీతభత్యాలు పెంపు

బెంగళూరు: ఈ సంవత్సరం సాప్ట్‌వేర్ ఇంజనీర్ల జీతాల పెంపు బారీగా జరగనున్నాయని పలు కంపెనీలు ప్రస్తావించాయి. మార్చి ముగియడంతో అందరి దృష్టి ఇప్పుడు జీతాల పెంపు మీదనే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గత సంవత్సరం చూసుకున్నట్లైతే చాలా మందికి సింగిల్ డిజిట్ పెంపుకే పరిమితం చేశారు. మరి కోన్ని కంపెనీలలో ఐతే అస్సలు జీతాల పెంపు అనే మాటే వినబడలేదు. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలావరకు పెద్ద కంపెనీలు ఎంప్లాయస్‌ని డబుల్ డిజిట్ ఇంక్రిమెంట్స్‌తో తృప్తి పరచనున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది.

దానికి కారణం ప్రపంచ వ్యాప్తంగా ఐటి సెక్టార్‌కు మంచి గిరాకీ రావడమేనని అంటున్నారు. ఇది మాత్రమే కాకుండా ఐటి కంపెనీల క్లయింట్స్‌లో కూడా కాన్పిడెంట్ రావడం ఓ ముఖ్య కారణం అంటున్నారు. ఇకపోతే ఈ సంవత్సరం జీతాల పెంపు అనేది యావరేజిగా 12శాతం నుండి 15శాతం వరకు ఉండవచ్చుంటున్నారు. ఇక మరికోంత మందికి ప్రోడక్ట్ బేసేడ్, స్పెషలైజ్‌డ్ ఏరియాలలో నిష్టాతులైన వారికి 20శాతం వరకు జీతాల పెంపు ఉంటుందని అంచనా..

భారతదేశంలో ప్రముఖ కంపెనీ విప్రో ఇప్పటికే ఏప్రైసల్ ప్రాసెస్‌ని ప్రారంభించిన విషయం తేలిసిందే. మే చివరి కల్లా ఈ తతంగం మొత్తం పూర్తి అవతుందని అన్నారు. ఇక జీతాల పెంపు అనేది జూన్-జులై నెలలో ఇవ్వనున్నట్లు తెలిపారు. గత సంవత్సరం 8-12శాతం పెంపు ఇవ్వగా, ఈ సంవత్సరం అది 12-15శాతం వరకు పెరగనుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇక పెంచినటువంటి జీతం జూనా 1వ తారీఖు నుండి అమలు కానుందని అన్నారు.

సి మహాలింగం(సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెచ్‌ఆర్) సింఫనీ సర్వీసెస్, మాట్లాడుతూ ప్రస్తుతం ఐటి ఉద్యోగులకు మంచి డిమాండ్ ఉంది. అదీకాక కస్టమర్స్ రేట్స్ కూడా బాగా పెరగడం వల్ల ఎంప్లాయస్ జీతాలు పెంపు విషయంలో ఈ సంవత్సరం చాలా సానుకూలంగా స్పందించడానికి అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా 3-8 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ కలిగినటువంటి ఉద్యోగులు ప్రస్తుతం హాట్ ప్రోపర్టీ.

రాయ్ జోసఫ్(హెచ్‌ఆర్) మహీంద్ర అండ్ మహీంద్ర, మాట్లాడుతూ ఈ సంవత్సం మేము ఎంతవరకు ఐతే ఎకానమీ ఊహించామో అంతవరకు రావడం జరిగింది. ప్రస్తుతం కంపెనీ ఉన్నటువంటి టాలెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారికి జీతం పెంపు అనేది ఇవ్వడం జరుగుతుంది. నాకు తెలిసి జీతం పెంపు అనేది చాలా కష్టమైన విషయం. దీనికి కారణం కొంతమంది ఉద్యోగులు ఎక్కవ శాతం జీతం పెంపు పోందగా మరికొంత మంది తక్కువ శాతం జీతం పెంపు పోందాల్సి ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot