యూసీ క్లీనర్ యాప్‌తో మీ ఆండ్రాయిడ్ ఫోన్‌ ‘రేసు గుర్రమే’

Posted By:

ఆండ్రాయిడ్ ఫోన్‌లలో జంక్ ఫైళ్లను క్లీన్ చేయటమనేది ఒక పెద్ద సవాల్ లాంటిదే. మనం ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసే ప్రతీ అప్లికేషన్ క్యాచీ ఫైల్స్‌తో పాటు బ్యాక్-హ్యాండ్ జంక్ ఫైళ్లను సృష్టిస్తూనే ఉంటుంది. వీటిని తరచూ క్లీన్ చేసుకోవటం ద్వారా ఫోన్ పనితీరు మరింతగా మెరుగుపడటంతో పాటు మరింత ఖాళీ స్పేస్ ఏర్పడుతుంది.

Read More: మీ పాత ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ఏం చేస్తున్నారు..?

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ పై పడుతున్న ఒత్తిడిని ఎప్పటికప్పుడు తగ్గిస్తూ పేరుకుపోయిన జంక్ ఫైళ్లను క్రమం తప్పకుండా క్లీన్ చేసేందుకు ‘యూసీ క్లీనర్ యాప్' గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉంది. ఈ యాప్‌ను యూసీ బ్రౌజర్ తయారీదారైన యూసీ వెబ్ ఉన్నత ప్రమాణాలతో అభివృద్థి చేసింది. ‘యూసీ క్లీనర్ యాప్' గురించి ఐదు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్ షోలో చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

‘యూసీ క్లీనర్ యాప్' గురించి ఐదు ఆసక్తికర విషయాలు

చాలా సింపుల్‌గా ఉండే యూజర్ ఇంటర్‌ఫేస్

యూసీ క్లీనర్ యాప్ చాలా సాధారణమైన యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంటుంది. ఈ యాప్ ఆండ్రాయిడ్ 4.1 ఆ తరువాతి వర్షన్‌లను సపోర్ట్ చేస్తుంది.

 

‘యూసీ క్లీనర్ యాప్' గురించి ఐదు ఆసక్తికర విషయాలు

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ‘యూసీ క్లీనర్' యాప్‌ను 9apps.com అలానే Google Play  స్టోర్‌ల నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ఏర్పాటు చేసిన యాడ్-ఫ్రీ యూజర్ ఇంటర్‌ఫేస్ మరింతగా ఆకట్టుకుంటుంది.

 

‘యూసీ క్లీనర్ యాప్' గురించి ఐదు ఆసక్తికర విషయాలు

స్మార్ట్‌ఫోన్ మెమరీని ఎంత పొదుపుగా వాడుకుంటే అంత లాభం. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న యూసీ వెబ్, ‘యూసీ క్లీనర్' యాప్‌ను 1.5ఎంబి కంటే తక్కువ సైజులో డిజైన్ చేసింది.

 

‘యూసీ క్లీనర్ యాప్' గురించి ఐదు ఆసక్తికర విషయాలు

చాలా వరకు ఆండ్రాయిడ్ యాప్ప్ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ ఎక్కువ సిస్టం మెమరీని వినియోగించేసుకుంటుంటాయి. తద్వారా ఫోన్ వేగం మరింత మందగిస్తుంది. ఈ క్రమంలో యూసీ క్లీనర్ యాప్ ర్యామ్ స్పేస్‌ను ఎప్పటికప్పుడు ఫ్రీ అప్ చేయటంతో పాటు ఎక్కువ మెమరీని వినియోగించుకుంటున్న యాప్స్‌ను ఎప్పటికప్పుడు క్లోజ్ చేసేస్తుంది.

 

‘యూసీ క్లీనర్ యాప్' గురించి ఐదు ఆసక్తికర విషయాలు

యూసీ క్లీనర్ యాప్‌లో పొందుపరిచిన సూపర్ బూస్టర్ ఫీచర్స్ స్మార్ట్‌ఫోన్‌లోని ఆటో-స్టార్ట్ యాప్స్‌ను డిసేబుల్ చేసేస్తాయి. అంతేకాకుండా.. బ్యాటరీ, డేటా ఇంకా స్టారేజ్ వినియోగాన్ని విశ్లేషణ చేస్తూ ఫోన్ పని తీరుతో పాటు స్టోరేజ్ స్పేస్‌ను పెంచే ప్రయత్నం చేస్తాయి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Cleaning junk files and maintaining the Android smartphone is one of the primary task that you need to do frequently. Even if you have installed few number of apps, your Android smartphone will slow down after some time, as it accumulate caches and back-hand junk files.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot