300లకు పైగా డ్రోన్లు భూమిని ఢీకొట్టాయి, నష్టం ఎంతో తెలుసా ?

సౌత చైనాలో బారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఆకాశంలోనుంచి ఒక్కసారిగా 300లకు పైగా డ్రోన్లు భూమిని ఢీకొట్టాయి. అయితే మనుషులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

|

సౌత చైనాలో బారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఆకాశంలోనుంచి ఒక్కసారిగా 300లకు పైగా డ్రోన్లు భూమిని ఢీకొట్టాయి. అయితే మనుషులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాల్లోకెళితే సౌత్ చైనాలోని హైకూలో చైనీస్ డ్రోన్ మేకర్ హై గ్రేట్ 300లకు పైగా డ్రోన్లతో ఆకాశంలో ఓ లైట్ షోని నిర్వహించింది. ఈ షో కొనసాగుతండగానే ఆకాశంలోని డ్రోన్లు అదుపుతప్పి భూమి మీదకు దూససుకొచ్చాయి. ఒక్కసారిగా పేలుడు కలకలంతో అక్కడ భయంకర వాతావరణం నెలకొంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

రూ.20,000 ధరల్లో లభించే బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే....రూ.20,000 ధరల్లో లభించే బెస్ట్ ల్యాప్‌టాప్‌లు ఇవే....

ఈ డ్రోన్లు కూలిపోతున్న దృశ్యాలు.....

ఈ డ్రోన్లు కూలిపోతున్న దృశ్యాలు.....

ఈ డ్రోన్లు కూలిపోతున్న దృశ్యాలు వీడియో రూపంలో బయటకు వచ్చాయి. ఆ వీడియో ప్రకారం డ్రోన్లు సన్నని లైటు వెలుతురుతో ఒక్కసారిగా జనాల మీదకు వచ్చినట్లుగా ఉన్నాయి. ఆకాశం నుంచి నక్షత్రాలు రాలుతున్నట్లుగా ఈ డ్రోన్లు భూమి మీదకు వచ్చాయి.

 డ్రోన్లు కిందకు వస్తున్న తరుణంలో ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు....

డ్రోన్లు కిందకు వస్తున్న తరుణంలో ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు....

కాగా ఈ డ్రోన్లు కిందకు వస్తున్న తరుణంలో ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పనిచెప్పారు. వాటిని తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఆకాశం నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు....

ఆకాశం నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు....

ఆకాశం నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు నేరుగా జనావాసాల్లోనూ, చెట్ల మీద కూలిపోయాయి. అదృవశాత్తూ ఈ డ్రోన్ల ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ డ్రోన్లు వివిధ ఆకారాల్లో వీక్షకులకు కనువిందును చేశాయి.

 Electromagnetic interference సమస్య వల్ల కూలిపోయాయని....

Electromagnetic interference సమస్య వల్ల కూలిపోయాయని....

కాగా ఈ డ్రోన్లు Electromagnetic interference సమస్య వల్ల కూలిపోయాయని High Great technicians తెలిపారు. విద్యుత్ ప్రవహించే తీగల్లో ఏదో లోపముందని అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని ముందు ముందు తగు జాగ్రత్తలు తీసుకుంటామని వారు తెలిపారు.

Best Mobiles in India

English summary
Dozens of drones performing light show crash to earth above screaming spectators more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X