గూగుల్ మ్యాప్‌ని గుడ్డిగా నమ్మారు, పోయి బురదలో పడ్డారు

By Gizbot Bureau
|

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రచారం పొందిన ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ గూగుల్‌. అంతేకాదు ఇది అతిపెద్ద సెర్చ్‌ ఇంజన్‌ అనేది కూడా అందరికీ తెలిసిందే. గూగుల్‌ అందించే సర్వీసులలో ఒకటి గూగుల్‌ మ్యాప్స్‌. ఇదో వెబ్‌ మ్యాపింగ్‌ సర్వీస్‌. ఇది భూమి, ఆకాశం అన్న తేడాలు లేకుండా అన్ని దృశ్యాలను చూపిస్తుంది. రోడ్ల చిత్రాలు, కాలిబాట, కారు, బైకు, ప్రజా రవాణా మార్గాల వివరాలు తెలియజేస్తుంది.

గూగుల్ మ్యాప్‌ని గుడ్డిగా నమ్మారు, పోయి బురదలో పడ్డారు

అలాగే నగరాల్లో పెద్ద కంపెనీల స్థానాలు, ఇంటి చిరునామాలు కూడా చూపిస్తుంది. ప్రస్తుతం గూగుల్‌ మ్యాప్స్‌ దృశ్యాలు దాదాపు వంద దేశాల్లో కనిపిస్తున్నాయి. వివిధ ప్రదేశాల నుంచి రోడ్డు మార్గంలో 360 డిగ్రీల విశాలమైన దృశ్యాలను దీని ద్వారా మనం చూడవచ్చు. అయితే గూగుల్‌ మ్యాప్స్‌ వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో, అన్ని నష్టాలూ ఉన్నాయి. గూగుల్ మ్యాప్ ద్వారా దారిని వెతుక్కుంటూ వెళ్లిన వారికి ఎదురైన చేదు అనుభవం ఎలా ఉందో చూడండి.

 డెన్వర్ ఎయిర్ పోర్టు లొకేషన్‌

డెన్వర్ ఎయిర్ పోర్టు లొకేషన్‌

సీఎన్ఎన్ కథనం ప్రకారం.. కెనడాలోని అరోరాకు చెందిన ఓ బృందం కూడా అలాగే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి డెన్వర్ ఎయిర్ పోర్టు లొకేషన్‌ను ఎంటర్ చేసి దారి చూసుకున్నారు. అందరూ కలిసి కార్లలో బయలు దేరారు.. మ్యాప్స్‌లో నావిగేషన్ చూసుకుంటూ వెళ్లి పోయారు. కాస్త దూరం వెళ్లాక మెయిన్ రోడ్డు మూసివేసి ఉన్నట్లు కనిపించింది.

కాస్త దూరం వెళ్లాక రోడ్డంతా బురద మట్టితో

కాస్త దూరం వెళ్లాక రోడ్డంతా బురద మట్టితో

దీంతో వాళ్లు మరో రూట్ కోసం గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేయగా ఇంకో రూట్ నావిగేషన్ వచ్చింది.ఆ దారి చూస్తూ వెళ్లారు. ఎంత దూరం వెళ్లినా వారి గమ్యస్థానం రాలేదు. మరో రూట్ కదా... దూరం ఉంటుందిలే అనుకున్నారు. కానీ, అక్కడికి వెళ్లాక గానీ తెలీలేదు.. వాళ్లు వెళ్తోంది పొలాల్లోకి అని. కాస్త దూరం వెళ్లాక రోడ్డంతా బురద మట్టితో నిండిపోయింది.

చుట్టూ పొలాలు
 

చుట్టూ పొలాలు

అలాగే వెళ్లగా కార్లన్నీ బురదలో ఇరుక్కుపోయాయి. దిగి చూస్తే చుట్టూ పొలాలు కనిపించడంతో వారు షాక్ అయ్యారు. ఆ మార్గంలో ప్రయాణించిన వందలాది వాహనాలు బురదలో చిక్కుకోవడం సోషల్ మీడియాలో చర్చనీయమైంది. దీంతో గూగుల్‌పై ట్విట్టర్ వేదికగా దుమ్మెత్తిపోశారు. మ్యాప్స్‌ను నమ్ముకుంటే ఈ పరిస్థితి తీసుకొస్తుందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఓ వాహనదారుడు మాట్లాడుతూ..

ఓ వాహనదారుడు మాట్లాడుతూ..

ఓ వాహనదారుడు మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా విమానాశ్రయానికి చేరేందుకు 43 నిమిషాలు పడుతుంది. కానీ.. గూగుల్ డైరెక్షన్‌లో 23 నిమిషాల్లోనే విమానాశ్రయానికి చేరుకోవచ్చని ఈ షార్ట్‌కట్ చూపిస్తోంది. దీంతో ఈ మార్గంలోకి వచ్చి ఇలా ఇరుకున్నాం'' అని తెలిపాడు. అయితే వాస్తవానికి అది విమానాశ్రయానికి షార్ట్‌కట్ మార్గమే. కానీ, ఇటీవల వర్షాల వల్ల ఆ మార్గం బురదమయమైంది. దీంతో ఓ కారు అటుగా వెళ్తూ బురదలో చిక్కుకుంది. దాని వెనుక మరో వంద పైగా వాహనాలు నిలిచిపోయాయి.

 వాతావరణం వల్ల కొన్ని మార్గాల్లో

వాతావరణం వల్ల కొన్ని మార్గాల్లో

ఈ ఘటనపై గూగుల్ స్పందిస్తూ.. ‘‘గూగుల్ మ్యాప్‌లో ఎన్నో ఫీచర్స్‌ను అందుబాటులోకి తెచ్చాం. ముఖ్యంగా అందులోని మార్గాల గురించి స్పష్టమైన సమాచారం ఇస్తున్నాం. ఆ మార్గం వెడల్పు, దూరం వంటి విషయాలను వినియోగదారులు తెలుసుకోవచ్చు. మ్యాప్‌లో ఎప్పుడూ అత్యుత్తమ మార్గాలను సూచిస్తున్నాం. అయితే, వాతావరణం వల్ల కొన్ని మార్గాల్లో ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. డ్రైవర్లు స్థానిక నిబంధనలు అనుసరించి సరైన మార్గంలోనే ప్రయాణించాలి. అప్రమత్తంగా ఉంటూ సరైన మార్గాన్ని ఎంచుకోవాలి'' అని తెలిపింది.

Best Mobiles in India

English summary
Dozens of Drivers Got Stuck After Blindly Following Google Maps Into a Mud Pit

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X