ఈ ప్రభుత్వ యాప్‌తో ట్రాఫిక్ ఫైన్స్ నుంచి తప్పించుకోవచ్చు

By Gizbot Bureau
|

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ట్రాఫిక్ రూల్స్ మ‌రియు ఫైన్స్ క‌ఠినంగా ఉన్నాయి. వాహ‌నానికి సంబంధించి ఏది లేక‌పోయినా భారీ ఫైన్స్ క‌ట్ట‌ాల్సి వ‌స్తుంది. బిజీ లైప్‌లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఒక్కోసారి వాహ‌నానికి సంబంధించి ఏదో ఒక ప‌త్రం మరచిపోతాం. అయితే స్మార్ట్‌ఫోన్స్‌ కాలంలో ఎన్నో పనులు సులభతరమయ్యాయి. ఈ నేపథ్యంలో వాహన పత్రాలన్నీ ఒకచోట పెట్టుకునేందుకు ఏవైనా యాప్స్‌ ఉంటే బాగుంటుంది కదా! ఇందుకోసం ప్రభుత్వ యాప్ DigiLocker or mParivahan సిద్ధంగా ఉంది . కేంద్ర ప్రభుత్వం కూడా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కి సంబంధించిన పత్రాలు అన్నీ ఈ యాప్ లో ఖచ్చితంగా ఉండి తీరాల్సిందేనని చెప్పింది.

డిజి లాకర్‌లో చూపించే పత్రాలు 
 

డిజి లాకర్‌లో చూపించే పత్రాలు 

కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలు మరియు ఆయా రాష్ట్రాల పోలీసు శాఖలకు డిజి లాకర్‌లో చూపించే పత్రాలు చెల్లుతాయని సూచించింది. ల్యామినేటెడ్ రూపంలో ఉన్న పత్రాలను స్కాన్ చేసి, సాఫ్ట్ కాపీల రూపంలో డిజి లాకర్‌లో భద్రత పరుచుకున్న అన్ని ప్రభుత్వం కార్యాలయాల్లో చెల్లుబాటు అవుతాయని కేంద్రం సూచించింది. భారత సమాచార సాంకేతిక చట్టం 2000 ప్రకారం డిజి లాకర్‌లో ఉన్న పత్రాలు చెల్లుబాటు అవుతాయి. కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "రాష్ట్ర ప్రభుత్వాలు మోటార్ వాహనాల చట్టం 1988 ప్రకారం జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మరియు ఇతర పత్రాలు డిజి లాకర్ లేదా ఎమ్‌పరివాహన్ మొబైల్ యాప్ ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో చెల్లుబాటు అవుతాయని పేర్కొంది."

ఫిజకల్ డాక్యుమెంట్లను

ఫిజకల్ డాక్యుమెంట్లను

ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న వెహికల్ డాక్యుమెంట్లు మోటార్ వాహనాల చట్టం 1988 మరియు కేంద్ర మోటార్ వాహనాల నియమావళి 1989 యొక్క నియమ నిభందనలను పాటిస్తాయి. వెహికల్ ఇన్సూరెన్స్ మరియు దాని రెన్యువల్‌కు సంభందించిన డాటాను ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బోర్డ్ (IIB) ప్రభుత్వ వాహన్ (VAHAN) డాటా బేస్‌లోకి పొందుపరుస్తుంది. ఇది ఆటోమేటిక్‌గా డిజిలాకర్ మరియు ఎమ్‌పరివాహన్ అప్లికేషన్లలో అప్‌లోడ్ అవుతుంది.అధికారులు ఫిజకల్ డాక్యుమెంట్లను కోరాల్సిన అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత ఆన్‌లైన్ వెరిఫికేషన్ ద్వారా అప్‌లోడ్ అయ్యే పత్రాలను అధికారులు పరిగణలోకి తీసుకోవచ్చని వెల్లడించింది.

డిజిటల్ ఇండియా

డిజిటల్ ఇండియా

మెరుగైన మరియు పారదర్శక సేవలను అందించేందుకు డిజిలాకర్ ఎంతో చక్కగా ఉపయోగపడుతుందని కేంద్రం పేర్కొంది. డిజిలాకర్ మరియు ఎమ్‌పరివాహన్ యాప్‌లో ఉన్న డిజిటల్ పత్రాలు చట్టపరంగా చెల్లుబాటు అవుతాయని కేంద్రం విడుదల చేసిన ప్రకటన, ఇటీవల ప్రాచుర్యం పొందిన భారతదేశపు ప్రఖ్యాత నినాదం - "డిజిటల్ ఇండియా" నిజమని నిరూపించింది. ప్రజలు ఇక మీదట తమ స్మార్ట్ ఫోన్‌లలో అన్ని ఒరిజనల్ పత్రాలను భద్రత పరుచుకుని అవసరం వచ్చినపుడు ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు.

డిజిలాకర్‌ అకౌంట్‌ క్రియేట్‌ 
 

డిజిలాకర్‌ అకౌంట్‌ క్రియేట్‌ 

నేషనల్‌ డిజిటల్‌ లాకర్‌ సిస్టమ్‌గా పిలిచే ‘డిజిలాకర్‌' యాప్‌లో వాహనాలకు సంబంధించిన పత్రాలను భద్రపరుచుకోవచ్చు. అయితే దీనికోసం వాహనదారులు తప్పనిసరిగా డిజిలాకర్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి. అందులో తమ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌, ఇన్సూరెన్స్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులు భద్రపరుచుకోవచ్చు. హార్డ్‌ కాపీలను చూపించలేనప్పుడు డీజీలాకర్‌ యాప్‌ ద్వారా పత్రాలను చూపించ‌వ‌చ్చు. ట్రాఫిక్‌ పోలీసు అడిగినప్పుడు నేరుగా ఈ యాప్‌ నుంచే సంబంధిత పత్రాలు చూపించి.. జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఈ యాప్ అందుబాటులో ఉంది.

గతంలోనే అందుబాటులోకి 

గతంలోనే అందుబాటులోకి 

పాలనలో డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చిన భారత ప్రభుత్వం ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు డిజిలాకర్ అనే మొబైల్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలు ఈ యాప్‌లో తమకు సంభందించిన అన్ని పత్రాలను భద్రపరుచుకుని అధికారులు అడిగినపుడు వాటిని చూపించవచ్చు. అయితే, ఈ డిజిలాకర్ గతంలోనే అందుబాటులోకి వచ్చినప్పటికీ డిజిలాకర్ గురించి సరైన అవగాహన లేని ట్రాఫిక్ పోలీసు అధికారులు డిజిలాకర్‌లో చూపించే డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకునేవారు కాదు. ల్యామినేటెడ్ రూపంలో ఉన్న డీఎల్, ఆర్‌సిలను మాత్రమే చూపించాలని పట్టుబట్టేవారు. ఇప్పుడా ఆ సమస్య లేదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Driving licence, vehicle papers on DigiLocker or mParivahan at par with original documents: Road Transport Ministry

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X