ఇక హైదరాబాద్ రోడ్ల పై డ్రోన్‌లే ట్రాఫిక్ పోలీసులు!

|

ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవటంలో అందరికంటే ముందుండే హైదరాబాద్ పోలీస్ శాఖ మరో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టబోతోంది. నగరంలో గస్తీని మరింత ముమ్మరం చేసేందుకు గాను డ్రోన్ టెక్నాలజీని తెలంగాణ సర్కార్ ఉపయోగించుకోబోతోంది.

అంచనాలను తలక్రిందులు చేసిన ఇండియన్ ఐటీఅంచనాలను తలక్రిందులు చేసిన ఇండియన్ ఐటీ

ఆకాశంలోకి మల్టిపుల్ డ్రోన్‌లను లాంచ్ చేయటం ద్వారా ....
 

ఆకాశంలోకి మల్టిపుల్ డ్రోన్‌లను లాంచ్ చేయటం ద్వారా ....

ఆకాశంలోకి మల్టిపుల్ డ్రోన్‌లను లాంచ్ చేయటం ద్వారా పహారాను మరింత పటిష్టం చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. డ్రోన్‌లను పహారాకు ఉపయోగించటం ద్వారా అటు శాంతి భద్రతలతో పాటు ట్రాఫిక్ కంట్రోలింగ్, ఇంటి పన్నుల లెక్కింపు, ఏరియల్ సర్వే,పురపాలక పనులను ట్రాక్ చేయటం,వార్డ్ నేరస్థులును పట్టుకోవటం వంటి పనులకు సైబరాబాద్ కమీషనరేట్ ఉపయోగించుకోబోతోంది. ఈ ప్రత్యేకమైన డ్రోన్‌లను హైదరాబాద్‌కు చెందిన టెక్నాజలీ సంస్థ Cyient లోకల్ పోలీసులకు సమకూరుస్తోంది.

ఈ సంస్థకు ఇన్నోవేషన్ హెడ్‌గా వ్యవహరిస్తోన్న దినకర్ దేవిరెడ్డి....

ఈ సంస్థకు ఇన్నోవేషన్ హెడ్‌గా వ్యవహరిస్తోన్న దినకర్ దేవిరెడ్డి....

ఈ సంస్థకు ఇన్నోవేషన్ హెడ్‌గా వ్యవహరిస్తోన్న దినకర్ దేవిరెడ్డి ఇటీవల జరిగిన టీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతూ తాము అనేక ప్రాజెసక్టులతో అసోసియేట్ అయి ఉన్నామని గ్రేహౌండ్స్ బలగాలకు కూంబింగ్ ఆపరేషన్ నిమిత్తం అవసరమయ్యే డ్రోన్‌లను కూడా అభివృద్థి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ డ్రోన్‌లకు ఫిట్ చేసే...

ఈ డ్రోన్‌లకు ఫిట్ చేసే...

ఈ డ్రోన్‌లకు ఫిట్ చేసే థర్మల్ కెమెరాలు అగంతుకుల కదలికలను పసిగట్టటంతో పాటు పోలీసులను అప్రమత్తం చేస్తాయని తెలిపారు. ఈ డ్రోన్‌లను డ్రోన్ డిప్లాయిమెంట్ వెహికల్ ద్వారా కంట్రోల్ చేసుకునే వీలుంటుందని అన్నారు. ఈ ఏడాది ఆరంభంలో కేశవ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థులు మహిళల భద్రతను ఉద్దేశించి ఓ డ్రోన్‌ను అభివృద్థి చేయటం జరిగింది. ఈ డ్రోన్ మహిళలకు ఆపద తలెత్తిన సమయంలో యాప్ ద్వారా ఆ సమాచారాన్ని తెలుసుకుని వెంటనే పోలీసులను అప్రమత్తం చేస్తుంది.

టెక్నాలజీ వినియోగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం....
 

టెక్నాలజీ వినియోగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం....

టెక్నాలజీ వినియోగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నూతన ఆలోచన,ఆవిష్కరణల కోసం ప్రత్యేకంగా ‘ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ'ని విశాఖపట్నం సన్‌రైజ్‌ స్టార్టప్‌ విలేజ్‌లో ఏర్పాటు చేసింది. కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చేవారితో స్టార్టప్ లను ప్రారంభించంలో కీలక పాత్ర పోషిస్తున్న ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ ..ఈ మధ్యకాలంలో అత్యంత పాపులర్ అయిన డ్రోన్ల తయారీ మీదా దృష్టిసారించింది. దీంతో ఢిల్లీ కేంద్రంగా పనిచేసే రోబోటిక్‌ టెక్నాలజీ సంస్థ ‘ఓమ్నీ ప్రెజెంట్‌'తో కలిసి విశాఖపట్నంలో ‘అమరావతి డ్రోన్స్‌' పేరుతో రిసెర్చ్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ లేబొరేటరీని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఆధునిక టెక్నాలజీతో స్పందించగలిగే డ్రోన్‌లను సమకూరుస్తోంది.

ఈ మధ్య కాలంలో...

ఈ మధ్య కాలంలో...

ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే అవుట్ డోర్ సినిమా షూటింగ్‌లు మొదలుకుని ఇండోర్ భారీ ఫంక్షన్‌ల వరకు అద్భుతంగా చిత్రీకరించేందుకు డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఏదో మ్యాజిక్ చేసేటట్లు గాల్లో చక్కెర్లు కొడుతూ దృశ్యాలను విహంగ వీక్షణంలో చిత్రీకరిస్తూ ‘డ్రోన్' టెక్నాలజీ అద్భుతాలను సృష్టిస్తోంది

Most Read Articles
Best Mobiles in India

English summary
Drones could soon manage traffic in Hyderabad.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X