Tata Sky, Airtel Digital TV ఆపరేటర్ల టీవీ కనెక్షన్ కొత్త ధరలు ఇవే...

|

ట్రాయ్ యొక్క మార్గదర్శకాలను అనుసరించి డిటిహెచ్ ఆపరేటర్లు టాటా స్కై మరియు ఎయిర్టెల్ డిజిటల్ టివి వంటివి నేషనల్ టారిఫ్ ఆర్డర్ 2.0 ను అమలు చేసాయి. రెండు కంపెనీలు కొత్త నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు (NCF) మరియు మల్టీ టివి యొక్క ధరలను ప్రకటించాయి. ఈ కొత్త ధరలు ప్రస్తుతం అమలులోకి వచ్చాయి.

 

NTO 2.0

NTO 2.0

కొత్తగా వచ్చిన మార్పులలో భాగంగా టాటా స్కై మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ టివి 200 SD FTA ఛానెళ్లను రూ.153.4 ప్రారంభ ధర వద్ద అందించనున్నాయి. ట్రాయ్ యొక్క NTO 2.0 టాటా స్కై మరియు ఎయిర్టెల్ డిజిటల్ టివి యొక్క మల్టీ టీవీ చందాదారులకు కూడా చాలా వరకు సహాయం చేస్తుంది. ఎయిర్‌టెల్ డిజిటల్ టివి మరియు టాటా స్కై రెండూ సెకండరీ కనెక్షన్ వినియోగదారుల నుండి 200 SD ఛానెళ్లను నెలకు కేవలం రూ.61.36 ధర వద్ద అందిస్తున్నాయి.

 

 

నోకియా ఫోన్ల ప్రియులకు శుభవార్త: కొత్త ఫోన్లలో పాత ఫీచర్స్నోకియా ఫోన్ల ప్రియులకు శుభవార్త: కొత్త ఫోన్లలో పాత ఫీచర్స్

NCF
 

NCF

ఇంతకుముందు టాటా స్కై ప్రతి మల్టీ టీవీ వినియోగదారు నుండి పూర్తి NCFను రూ.153.4 గా వసూలు చేసింది. అయితే ట్రాయ్ ఛార్జీలను ప్రైమరీ ఎన్‌సిఎఫ్‌గా కేవలం 40% కి పరిమితం చేస్తోంది. క్రొత్త మార్పులు ఈ రోజు నుండి అమలులోకి రానున్నాయి. అలాగే ఇప్పటికే ఉన్న వినియోగదారులు నెమ్మదిగా కొత్త మార్పులకు మార్చబడతారు.

 

 

ISRO NAVIC నావిగేషన్ సిస్టమ్ సపోర్ట్ తో రియల్‌మి X50 ప్రోISRO NAVIC నావిగేషన్ సిస్టమ్ సపోర్ట్ తో రియల్‌మి X50 ప్రో

ట్రాయ్ NTO 2.0

ట్రాయ్ NTO 2.0

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) NTO 1.0 కు చాలా సవరణలు చేసిన తరువాత NTO 2.0ను అమలు చేసింది. సవరణలు ప్రకటించినప్పటి నుండి ప్రసారకులు NTO1.0 నుండి ఇంకా కోలుకోనందున ఉపశమనం కోరుతూ రెగ్యులేటర్‌తో పోరాడుతున్నారు. ప్రసారకులు మరియు ట్రాయ్‌ల మధ్య సమస్య కొనసాగుతుండగా డిటిహెచ్ ఆపరేటర్లు కొత్త NTO 2.0 మార్పులను టాటా స్కై మరియు ఎయిర్‌టెల్ డిజిటల్ టివి ఆపరేటర్లు మొదటగా అమలు చేయడం ప్రారంభించారు.

 

 

Airtel Payments Bankలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్‌Airtel Payments Bankలో ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్‌

200 FTA ఛానెల్‌ల కొత్త ధరలు

200 FTA ఛానెల్‌ల కొత్త ధరలు

ట్రాయ్‌కు అవసరమైన మార్పుల ఆధారంగా డిటిహెచ్ ఆపరేటర్లు మార్పులు చేస్తున్నారు. పరిశ్రమలో కొత్త మార్పులలో భాగంగా ఎయిర్‌టెల్ డిజిటల్ టివి మరియు టాటా స్కై 200 FTA ఛానెల్‌లకు NCF గా రూ.153.4లను వసూలు చేస్తున్నాయి. NTO1.0 సమయంలో అందించిన 100 ఛానెల్‌లకు బదులుగా ఇప్పుడు 200 కంటే ఎక్కువ SD ఛానెళ్లను రూ.188.80 ధర వద్ద అందిస్తున్నారు.

 

 

Jio తక్కువ ధరలో అందిస్తున్న 4G డేటా వోచర్‌ ప్లాన్‌లుJio తక్కువ ధరలో అందిస్తున్న 4G డేటా వోచర్‌ ప్లాన్‌లు

టాటా స్కై కొత్త ధరలు

టాటా స్కై కొత్త ధరలు

"NCF = రూ 130 (w / o tax) + రూ .33.4 (GST) = రూ .153.4 (tax తో కలిపి) ధర వద్ద 200 SD ఛానెళ్లను మరియు రూ.160 (w/oటాక్స్) + రూ.28.80 (GST) = రూ.188.80 (tax తో కలిపి) ధర వద్ద 200 SD ఛానెల్‌ల కంటే ఎక్కువ ఛానెల్‌లకు పొందవచ్చు అని కొత్త అప్ డేట్ NCF డిక్లరేషన్ విడుదలలో టాటా స్కై పేర్కొంది.

 

 

Vivo Z6 5G యొక్క ఫీచర్స్ ఇవే... 5G స్మార్ట్‌ఫోన్‌లలో గట్టి పోటీVivo Z6 5G యొక్క ఫీచర్స్ ఇవే... 5G స్మార్ట్‌ఫోన్‌లలో గట్టి పోటీ

మల్టీ టీవీ NCF కొత్త ధరలు

మల్టీ టీవీ NCF కొత్త ధరలు

డిటిహెచ్ ఆపరేటర్లు ప్రతి ఒక్కరు మల్టీ టివి ఎన్‌సిఎఫ్ ఛార్జీలను తగ్గించారు. సెకండరీ కనెక్షన్ కోసం ఏ ఆపరేటర్ అయినా 40% కంటే ఎక్కువ ఎన్‌సిఎఫ్‌ను వసూలు చేయరాదని ట్రాయ్ NTO 2.0 లో కండిషన్ పెట్టింది. అందువల్ల మల్టీ టివి చందాదారుల కోసం రెండు స్థిర ఎన్‌సిఎఫ్ ఛార్జీలు ఉంటాయని ట్రాయ్ పేర్కొన్నారు. ఒకే ఇంటిలో ఒకే అకౌంట్ తో యాక్టివేట్ అయిన మల్టీ టీవీ కనెక్షన్ల కోసం 200SD ఛానెళ్లకు రూ.52 (పన్నులతో సహా రూ .61.36) నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు వర్తిస్తుంది.

200SD ఛానెల్‌లు

200SD ఛానెల్‌లు

200SD ఛానెల్‌లు మరియు అంతకంటే ఎక్కువ ఛానెల్‌ల చందా కోసం అదనంగా రూ.30 NCF వర్తిస్తుందని ఎయిర్‌టెల్ డిజిటల్ టివి తెలిపింది. అయితే టాటా స్కై 200 కంటే ఎక్కువ ఎస్‌డి ఛానెళ్లకు నెలకు రూ.75.52 (పన్నులతో సహా) స్థిర ఎన్‌సిఎఫ్‌ను వసూలు చేయనుంది. ఎయిర్టెల్ డిజిటల్ టీవీతో పోలిస్తే టాటా స్కై మల్టీ టీవీ ఛార్జీలు తాజా మార్పుల తరువాత సరసమైనవిగా మారాయి. హెచ్‌డి ఛానెల్‌ల ఎన్‌సిఎఫ్ వివరాల విషయానికి వస్తే రెండు ఎస్‌డి ఛానెల్‌ల ఎన్‌సిఎఫ్‌కు సమానంగా పరిగణించబవచ్చు.

Best Mobiles in India

English summary
DTH Operators Started Implementing New NTO 2.0 Changes

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X