Home
News

గూగుల్ పే లో లోపం, అకౌంట్ లో ఉచితంగా డబ్బులు పడ్డాయి! రూ.80,000 వరకు 

By Maheswara

గూగుల్ పే లోని లోపం కారణంగా పొరపాటున కొందరి ఖాతాలకు అదనపు డబ్బు కాష్ బ్యాక్ రూపంలో జమ అయింది.దీనితో గూగుల్ పే వినియోగదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. అనేక మంది ఇంటర్నెట్ వినియోగదారులు, తాము ఈ అదనపు క్యాష్ బ్యాక్ ను పొందినట్లు నివేదించారు. దీని ద్వారా USD 10 నుండి USD 1,000 (INRకి మార్చబడినప్పుడు సుమారు ₹80,000) వరకు చెల్లింపులు ఉన్నాయి.

గూగుల్ పే వినియోగదారులు ఈ అదనపు నగదును పొందడానికి కారణమైన సాంకేతిక సమస్య గురించి ఇంకా వివరాలు వెల్లడించలేదు. కానీ, కంపెనీ వెంటనే ఈ లోపాన్ని గుర్తించి, క్రెడిట్ చేసిన డబ్బులను తిరిగి వెనక్కి తీసుకుంది. దీనితో గూగుల్ పే వినియోగదారులలో ఈ ఉత్సాహం స్వల్పకాలికంగానే మిగిలిపోయింది. కానీ, వినియోగదారులు ఇప్పటికే ఆ డబ్బు ఖర్చు చేసేసి ఉంటే, అటువంటప్పుడు,ఆ డబ్బు వినియోగదారులకు చెందుతుందని గూగుల్ ప్రకటించింది.

Due To Glitch In Google Pay Some Users Are Getting Huge Amount Of Cashbacks Up To Rs.80000.

మిషాల్ రెహమాన్ అనే జర్నలిస్ట్, ఈ గూగుల్ పే గ్లిచ్‌ తో తన అనుభవాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. అతను గూగుల్ పే యాప్ ను చూసినప్పుడు "గూగుల్ పే చెల్లింపుల అనుభవాన్ని డాగ్‌ఫుడ్ చేయడం" కోసం $46 "రివార్డ్‌లు" అందుకున్నట్లు గమనించి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. గూగుల్ పే యాదృచ్ఛికంగా వినియోగదారులకు ఉచిత డబ్బును ఇస్తున్నట్లుగా కనిపించిందని ఆయన స్క్రీన్ షాట్ పంచుకున్నాడు.

తన లాగే, ఇతర వినియోగదారులు కూడా "రివార్డ్‌లు" పొందారా లేదా అని ఎలా తనిఖీ చేయాలనే దానిపై టిప్స్ కూడా అందించారు. గూగుల్ పే యాప్‌ని తెరిచి, "డీల్స్" ట్యాబ్‌కు స్వైప్ చేసి, స్క్రీన్ పైభాగంలో జాబితా చేయబడిన ఏవైనా "రివార్డ్‌లు" కోసం వెతకాలని అతను వినియోగదారులకు సలహా ఇచ్చాడు. ఈ అదనపు నిధులు కూడా పొరపాటేనని అనుమానం వ్యక్తం చేస్తూ ప్రస్తుతానికి తన ఖాతాలో డబ్బులు ఉన్నాయని తెలియచేసారు.

దీనితో, చాలా మంది రెడ్దిట్ వినియోగదారులు కూడా ఈ గూగుల్ పే గ్లిచ్‌తో తమ అనుభవాలను పంచుకున్నారు. ఒక వినియోగదారు తమ ఖాతాలో నమ్మలేనట్లుగా USD 1072 (దాదాపు రూ.88,000) జమ చేసినట్లు నివేదించగా, మరొక వినియోగదారు USD 240 అందుకున్నట్లు పేర్కొన్నారు. ఈ వార్త గూగుల్ పే వినియోగదారుల మధ్య త్వరగా వ్యాపించింది.దీనితో ప్రతి ఒక్కరు కూడా తమ ఖాతాలను చెక్ చేసుకున్నారు.

చివరకు ఎలోన్ మస్క్ కూడా ట్విట్టర్‌లో "నాయిస్" అనే పదంతో ఒక వార్తా నివేదికకు ప్రతిస్పందిస్తూ ఈ సంఘటనపై చిలిపిగా స్పందించాడు. కానీ, గూగుల్ ఈ తప్పుడు చెల్లింపులన్నింటినీ మళ్ళీ వెనక్కి తీసుకుంది. రెహమాన్ మరొక ట్వీట్‌లో కంపెనీ నుండి అందుకున్న ఇమెయిల్‌ను పంచుకున్నారు, ఇది లోపాన్ని అంగీకరించింది మరియు కొన్ని సందర్భాల్లో చెల్లింపులు రివర్స్ అవుతున్నాయని కూడా పేర్కొన్నాడు.

రెహ్మాన్ షేర్ చేసిన ఇమెయిల్ సమాచారం ప్రకారం "మీ గూగుల్ పే ఖాతాలో మీకు తెలియకుండా నగదు క్రెడిట్ జమ అయినందున మీరు ఈ ఇమెయిల్‌ని అందుకున్నారు. అప్పటి నుండి సమస్య పరిష్కరించబడింది మరియు సాధ్యమైన చోట క్రెడిట్ రివర్స్ చేయబడింది." అని మెయిల్ సారాంశం.అంటే, తమ గూగుల్ పే ఖాతాలో డబ్బును మళ్ళీ వెనక్కి తీసివేయబడిందని భావించవచ్చు.

అయితే, డబ్బును మీరు అప్పటికే ఖర్చు చేసినా లేదా బదిలీ చేసినా అది మీకే చెందుతుంది, అని గూగుల్ ఇలా పేర్కొంది, "మేము క్రెడిట్‌ను రివర్స్ చేయలేకపోతే, ఆ డబ్బు మీదే ఉంచుకోవాలి. తదుపరి చర్య అవసరం లేదు." కాబట్టి ఆనందించండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Due To Glitch In Google Pay Some Users Are Getting Huge Amount Of Cashbacks Up To Rs.80000.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X