దటీజ్ జియో, అమెరికాను వెనక్కి నెట్టేసిన ఇండియన్లు

By Gizbot Bureau
|

దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో దెబ్బకు అగ్రరాజ్యం వెనక్కి వెళ్లిపోయింది. ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులున్న దేశంలో భారత్ రెండోస్థానంలో నిలిచింది. ప్రపంచంలోని మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల్లో 12 శాతం మంది మనదేశంలోనే ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు.

దటీజ్ జియో, అమెరికాను వెనక్కి నెట్టేసిన ఇండియన్లు

ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 380 కోట్లకు చేరగా...ఈ సంఖ్య ప్రపంచ జనాభాలో సగానికంటే ఎక్కువ(51శాతం) కావడం ఇంటర్నెట్ వాడకం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. అంతకు ముందు నివేదిక మేరకు ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 360 కోట్లుగా ఉంది. అంటే ఇది ప్రపంచ జనాభాలో 49 శాతం. ఇప్పుడు అది మించిపోయింది.2019 మారీ మీకర్‌’ రిపోర్ట్‌ ఈ విషయాలను వెల్లడించింది.

చైనా ఫస్ట్, సెకండ్ ఇండియా

చైనా ఫస్ట్, సెకండ్ ఇండియా

ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పరంగా చైనా అగ్రస్థానంలో నిలుస్తుండగా...భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు ఇంటర్నెట్ ట్రెండ్స్ అధ్యయన సంస్థ- మేరీ మీకర్ 2019 నివేదిక పేర్కొంది. చైనా 21 శాతం వాటాతో ప్రపంచంలో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించగా అమెరికా యూజర్‌ బేస్‌ 8 శాతంగా ఉన్నట్లు నివేదికలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 12 శాతం వాటాతో ఇండియా ఏకంగా 2వ స్థానంలో ఉంది.

జియో పాత్ర కీలకం

జియో పాత్ర కీలకం

ఇంటర్నెట్ వినియోగదారుల్లో ప్రపంచంలో భారత్ రెండో స్థానంలో నిలవడం వెనుక రిలయన్స్ జియో పాత్ర కీలకమని మేరీ మీకర్ తన నివేదికలో తెలిపింది. అధిక వేగం ఇంటర్నెట్ సేవలను అతి తక్కువ ధరలకు జియో అందుబాటులోకి తీసుకొచ్చిందని గుర్తు చేసింది.

30.7 కోట్ల మొబైల్ కలెక్షన్లు

30.7 కోట్ల మొబైల్ కలెక్షన్లు

అమెరికాకు బయట అత్యంత వినూత్న సేవలు అందిస్తున్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీల్లో రిలయన్స్ జియో ఒకటని మేరీ మీకర్ తన నివేదికలో కొనియాడింది.దేశ వ్యాప్తంగా రియలన్స్ జియో 30.7 కోట్ల మొబైల్ కలెక్షన్లు కలిగి ఉన్నట్లు తెలిపింది.భారత్‌లో ఇంటర్నెట్‌పై నియంత్రణలు ఫర్వాలేదని మేరీ మీకర్ తన వార్షిక నివేదికలో తెలిపింది. ఇంటర్నెట్ నియంత్రణలు భారత్‌లో మధ్యశ్రేణిలో ఉంటాయని తెలిపింది.

ఉచిత కాల్స్‌, డేటా

ఉచిత కాల్స్‌, డేటా

ఉచిత కాల్స్‌, డేటాకు తక్కుధ రుసుములు వసూలు చేయడంతో, ఏడాది లోపే రిలయన్స్ జియోకు అత్యధిక చందాదారులు జత కలిశారు. అంతే కాదు రిలయన్స్ జియో సాయంతో డేటా వినియోగం రెండింతలైంది. 30.7 కోట్ల మొబైల్‌ కనెక్షన్లు కలిగిన రిలయన్స్‌ జియో, ఈ- కామర్స్‌ రంగాన్ని సంప్రదాయ దుకాణదార్లతో అనుసంధానం చేసేందుకు ప్రయత్నిస్తోంది.ఈ ఘనత దక్కడంలో, అధికవేగం డేటా సేవల (4జీ)ను, తక్కువ ధరల్లో అందుబాటులోకి తెచ్చిన రిలయన్స్‌ జియో పాత్ర ఎంతో కీలకం అని తేలింది.

ఈ- కామర్స్‌ రంగంలోకి

ఈ- కామర్స్‌ రంగంలోకి

జియో ఈ- కామర్స్‌ రంగంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్‌ రిటైల్‌ విక్రయశాలల్లో అడుగిడే 35 కోట్ల మందిని, జియో చందాదారులైన 30.7 కోట్ల మందిని, 3 కోట్ల మంది చిరు వ్యాపారులను అనుసంధానించి, మారుమూల ప్రాంతాల వినియోగదారులకు అన్ని రకాల ప్రయోజనాలు చేకూరుస్తాం' అని రిలయన్స్‌ జియో అధిపతి ముకేశ్‌ అంబానీ ప్రకటించారని మేరీ మేకర్ నివేదిక గుర్తు చేసింది.

జియో స్టోర్లను

జియో స్టోర్లను

తమ ఆన్‌లైన్‌ పోర్టల్‌ నుంచి సరుకు చేరవేసేందుకు, వస్తువుల సమీకరణకు కేంద్రాలుగా జియో స్టోర్లను వినియోగించుకోవాలన్నది రిలయన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రణాళికగా తెలుస్తోంది. మొత్తం 95 శాతం జనాభాకు చేరువ కావాలన్నది రిలయన్స్ ఆశయంగా పెట్టుకుంది. రిలయన్స్ ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లు 11 వేలు ఉన్నాయి. వీటిలో ఐదు వేల నగరాల పరిధిలో 5100కి పైగా జియో పాయింట్ స్టోర్లుగా వినియోగిస్తోంది.

Best Mobiles in India

English summary
Due to Jio, India is home to world's 2nd largest internet user base: Report

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X