డుయో వీడియో కాలింగ్ ఒకేసారి 8 మందికి చేసుకోవచ్చు

టెక్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసు గూగుల్ డ్యుయో వీడియో కాలింగ్ ఫీచర్ లిమిట్ పెరిగింది. ఇప్పటిదాకా ఈ వీడియో కాలింగ్ లో నలుగురికి మాత్రమే అనుమతి ఉంది. ఇకపై గ్రూపు వీడియో కాలింగ్ లో యూజర్లు ఒకేసారి 8

|

టెక్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసు గూగుల్ డ్యుయో వీడియో కాలింగ్ ఫీచర్ లిమిట్ పెరిగింది. ఇప్పటిదాకా ఈ వీడియో కాలింగ్ లో నలుగురికి మాత్రమే అనుమతి ఉంది. ఇకపై గ్రూపు వీడియో కాలింగ్ లో యూజర్లు ఒకేసారి 8 మందిని కనెక్ట్ చేసుకావచ్చు. కాగా గూగుల్ ఏప్రిల్ నెలలో గూగుల్ డ్యుయోలో వీడియో కాలింగ్ ఫీచర్ ను గూగుల్ ప్రవేశపెట్టింది.

డుయో వీడియో కాలింగ్ ఒకేసారి 8 మందికి చేసుకోవచ్చు

ఈ ఫీచర్ ను ప్రవేశపెట్టిన నెలలోనే వీడియో కాలింగ్ లిమిట్ ను పెంచడం విశేషం. ఈ ఫీచర్ ప్రారంభంలో ఇండోనేషియాకు మాత్రమే పరిమితి ఉంది. కానీ, క్రమంగా బ్రెజిల్, కెనడా, ఇండియా, మెక్సికో, యూఎస్, ఇతర ప్రాంతాలకు పరిమితిని విస్తరించారు.

 మరో 7 గురు సభ్యులను

మరో 7 గురు సభ్యులను

గ్రూపు వీడియో కాలింగ్ ఫీచర్ పరిమితిని నలుగురి నుంచి 8 మంది వరకు పరిమితి పెంచినట్టు ఇంజినీరింగ్ లీడ్ ఆఫ్ గూగుల్ డ్యుయో, ప్రిన్సిపల్ ఇంజినీర్ గూగుల్ జస్టిన్ ఉబెర్టి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ కొత్త అప్ డేట్ తో.. డ్యుయో యూజర్లు.. అదనంగా మరో 7 గురు సభ్యులను గ్రూపు వీడియో కాల్స్ కు యాడ్ చేసుకోవచ్చు.

 ఆండ్రాయిడ్, ఐఓఎస్ సపోర్ట్

ఆండ్రాయిడ్, ఐఓఎస్ సపోర్ట్

గూగుల్ డ్యుయో యాప్ లేటెస్ట్ అప్ డేట్ ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజ్ సపోర్ట్ చేస్తుందని తెలిపారు. ఫేస్ బుక్ సొంత యాప్ వాట్సప్ మెసేంజర్ కు పోటీగా గూగుల్.. డ్యుయో గ్రూపు వీడియో కాలింగ్ ఫీచర్ పరిమితిని పెంచింది. వాట్సప్ గ్రూపు వీడియో కాలింగ్ లో ఒక సింగల్ గ్రూపులో నలుగురికి మాత్రమే జాయిన్ అయ్యే అవకాశం ఉంది.

తక్కువ లైటింగ్ ఫీచర్

తక్కువ లైటింగ్ ఫీచర్

గూగుల్ డుయోలో ఇప్పుడు తక్కువ లైటింగ్ లో కూడా క్వాలిటీ గల వీడియో కాల్ చేసుకునే అవకాశాన్నిగూగుల్ కల్పిస్తోంది. ఈ యాప్ టెస్టింగ్ దశలో ఉంది. అతి త్వరలోయే యూజర్ల మొబైల్ లోకి చేరే అవకాశం ఉంది.

ప్రారంభంలోనే రికార్డులు

గూగుల్ తయారు చేసిన "డుయో" యాప్ ప్రారంభంలోనే రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ఫ్రీ డౌన్‌లోడ్స్ విభాగంలో డుయో మొదటి స్థానాన్ని ఆక్రమించింది. పోకేమాన్‌గో, ఫేస్‌బుక్ మెసెంజర్‌లను యాప్‌లను వెనక్కినెట్టింది.ఈ వీడియో కాలింగ్ యాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులను ఆకర్షిస్తోంది. 4.5 రేటింగ్‌తో ఆగ్రస్థానంలో డుయో యాప్, 4.0 రేటింగ్‌తో రెండో స్థానంలో ఫేస్‌బుక్, 3.9 రేటింగ్‌తో మూడో స్థానంలో మెసెంజర్‌లు నిలిచాయి.

 

రూ. 9 వేల మొత్తాన్ని

రూ. 9 వేల మొత్తాన్ని

గూగుల్ కొత్తగా ప్రవేశపెట్టిన వీడియో కాలింగ్ యాప్ డుయోని ఇన్స్టాల్ చేసుకుని స్నేహితులకు రిఫర్ చేయడం ద్వారా దాదాపు రూ. 9 వేల మొత్తాన్ని యూజర్లు సొంతం చేసుకోవచ్చు.అయితే ఇందులో కొన్ని టర్మ్స్ అండ్ కండీషన్స్ ని ప్రవేశపెట్టింది. ఈ రకమైన ఆఫర్ ను మొదటగా ఫిలిప్ఫీన్స్ దేశంలో ప్రవేశపెట్టింది. గూగుల్ క్యాష్ రివార్డు పోగ్రాం కింద గూగుల్ డుయో ద్వారా డబ్బును సంపాదించుకునే అవకాశాన్ని ఇప్పుడు ఇండియన్లకు కూడా కల్పించింది.

మీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ డుయో యాప్....

మీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ డుయో యాప్....

దీని కోసం మీరు ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ డుయో యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత తొలి కాల్ చేయాలి. ఈ ప్రాసెస్ అయిన తరువా గూగుల్ క్యాష్ రివార్డు కు సంబంధించిన డేటాను మీకు యాక్టివేట్ చేస్తుంది. దీని ద్వారా మీరు మీ స్నేహితులకు ఫస్ట్ కాల్ చేయడం ద్వారా రిఫర్ చేయాలి.

ఈ ప్రాసెస్ ద్వారా యూజర్లు రూ.1000 వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది....

కొన్ని రిపోర్టుల ప్రకారం ఈ ప్రాసెస్ ద్వారా యూజర్లు రూ.1000 వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే పనిచేస్తుంది. మీరు ఆపిల్ ఐఫోన్ యూజరయితే మీ స్నేహితునికి రిఫర్ చేసిన అతను మాత్రమే ఈ ఆఫర్ పొందుతాడు. అది ఆండ్రాయిడ్ యూజర్ అయి ఉండాలి.

 

ఈ ఆఫర్ పొందాలంటే అది కొత్త నంబర్ అయి ఉండాలి...

ఈ ఆఫర్ పొందాలంటే అది కొత్త నంబర్ అయి ఉండాలి...

ఇక ఈ ఆఫర్ పొందాలంటే అది కొత్త నంబర్ అయి ఉండాలి. తొలిసారిగా నంబర్ నుంచి గూగుల్ డుయోని ఇన్ స్టాల్ చేసుకున్నవారే అర్హులు. అలాగే మీ స్నేహితుని నంబర్ కూడా కొత్తదై ఉండాలి.గూగుల్ డుయో యాప్ ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా మీరు యుపిఐ బేస్డ్ పేమెంట్లకు అర్హత పొందుతారు. డుయో, పే యాప్ ల ద్వారా గూగుల్ ఈ రకమైన ఆఫర్లను మీకు అందిస్తోంది.

Best Mobiles in India

English summary
duo group video calling limit increased 8 people

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X